రైతు ఆత్మహత్యలు, పత్తి కొనుగోళ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్లో ఆరోపించారు.
హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు, పత్తి కొనుగోళ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్లో ఆరోపించారు. పత్తి కొనుగోలుకు కేంద్రం రూ.10 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కేటాయించిందని ప్రశ్నించారు. కరువు మండలాలు ప్రకటించకపోవడంతోనే కేంద్రం నుంచి సాయం అందలేదని బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని బండారు దత్తాత్రేయ వివరించారు.