చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | CM YS Jagan Samarlakota Tour Live Updates | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Thu, Oct 12 2023 10:18 AM | Last Updated on Thu, Oct 12 2023 4:41 PM

CM YS Jagan Samarlakota Tour Live Updates - Sakshi

Updates..

ఎల్లో బ్యాచ్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌.. 
సామర్లకోటలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్‌. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంది. 

ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకోవడం. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్‌. సినిమా షూటింగ్స్‌ లేని టైమ్‌లో ఇక్కడికి వచ్చి స్టోరీలు చెబుతాడు. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్‌. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. 

ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువ, విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు.

సీఎం జగన్‌ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి. జగన్‌ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది.. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. 

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. 
►రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం. 
►రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. 
►కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు. 
►రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. 
►రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. 
►ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. 
►లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. 
►రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 

►ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నాం. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. 
►ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్‌, సిమెంట్‌ అందిస్తున్నాం. 
►వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నాం. 
►పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. 

►పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. 
►తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు. 
►మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం. 

►సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 
►నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం. 
►మన ప్రభుత్వంలో 35‍కు పైగా పథకాలు అమలవుతున్నాయి. 
►పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది. 
►గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు. 

►పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. 
►పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. 

►సామర్లకోటలో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌.
►జోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

► జగనన్న కాలనీలో దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్‌. 
► పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లను అందించిన సీఎం జగన్‌.
► జగనన్న కాలనీని పరిశీలించిన సీఎం జగన్‌ 
► కాసేపట్లో సామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో సీఎం జగన్‌ బహిరంగ సభ.

► సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

►సీఎం జగన్‌ సామర్లకోటకు చేరుకున్నారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. 

►సామర్లకోటకు బయలుదేరిన సీఎం జగన్‌

►రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవే­శాలకు పేదలు సిద్ధమయ్యారు. 
►కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవే­శాల కార్యక్రమంలో సీఎం జగన్‌ స్వయంగా పాల్గొ­న­నున్నారు. 


►మంత్రులు, ఎమ్మె­ల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. 
►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టిం­చారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు.

అడ్డంకులను అధిగమిస్తూ..
►రాష్ట్రంలో 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్‌ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్‌ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది.

►ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్‌ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 

7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
►పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement