
కుటుంబంతో అల్లు అర్జున్
అల్లు అర్జున్ తన చిరునామాను మార్చాలనుకుంటున్నట్లున్నారు. అవును... బన్నీ (అల్లు అర్జున్) కొత్త ఇంటి పనులు ప్రారంభమయ్యాయి. కొత్త ఇంటి భూమిపూజ జరిగిన ఫొటోను షేర్ చేస్తూ, ఈ ఇంటికి ‘బ్లెసింగ్’ అని పేరు పెట్టినట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. భార్య స్నేహ, కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హాతో కలిసి బన్నీ భూమిపూజ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు బన్నీ. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో జరుగుతోంది. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment