పసుపు రైతుకు ఊరట
కేసముద్రం,న్యూస్‌లైన్ : కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్‌లో శుక్రవారం పసుపు (కాడి) క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,151ధర పలి కింది. ఏప్రిల్‌లో పసుపు అమ్మకాలు ప్రారంభం కాగా.. మొదట్లో గరిష్ట ధర రూ.7,000, కనిష్టంగా రూ. 6,000తో కొనుగోళ్లు జరిగారుు. అనంతరం ధర క్వింటాల్‌కు రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు పలుకుతూ వచ్చింది. ఈ క్రమంలో మార్కెట్‌కు శుక్రవారం 150 బస్తాలు అమ్మకానికి రాగా... క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,151, కనిష్టంగా రూ.5,070తో మార్కెట్ వ్యాపారులు కొనుగోలు చేశారు.
గత ఖరీఫ్‌లో పండించిన పసుపునకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాకపోవడంతో కొందరు రైతులు దాచిపెట్టుకున్నారని, వాటినే ఇప్పుడు అమ్ముకుంటున్నారని మార్కెట్ అధికారులు తెలిపారు. అదేవిధంగా పసుపు గోళా రకం క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.5,304, కనిష్ట ధర రు.5,105 పలికినట్లు వారు వెల్లడించారు. కొంత మేరనైనా ధర పెరగడంతో పసుపు రైతులు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.