Beauty: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్‌ తగ్గుముఖం పట్టడం ఖాయం! | Beauty Tips In Telugu: Honey Pack To Get Rid Of Tan Healthy Skin | Sakshi
Sakshi News home page

Beauty Tips: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్‌ తగ్గుముఖం పట్టడం ఖాయం! ఇక పసుపుతో కలిపి పెడితే..

Published Wed, Oct 19 2022 10:19 AM | Last Updated on Wed, Oct 19 2022 10:52 AM

Beauty Tips In Telugu: Honey Pack To Get Rid Of Tan Healthy Skin - Sakshi

Honey Pack Benefits: ట్యాన్‌ తొలగి ముఖారవిందం ద్విగుణీకృతం కావాలా? సహజసిద్దమైన నిగారింపుతో మెరిసిపోవాలా? అయితే, తేనెతో వీటిని కలిపి ముఖానికి అప్లై చేయండి. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

పెరుగుతో
►రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టేబుల్‌ స్పూను తేనె తీసుకుని బాగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
►పదిహేను నిమిషాల తరువాత కడగాలి.

పసుపులో కలిపి
►టీ స్పూను తేనెలో అర టీస్పూను పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి
►ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
►ఈ రెండు ప్యాక్‌లను వారానికి మూడు సార్లు వేయడం వల్ల చర్మం మృదువుగా మారడమేగాక, ఆరోగ్యంగా ఉంటుంది. 

సహజసిద్ధ నిగారింపు
►రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి
►పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి.

►బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
►ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన ట్యాన్‌ తగ్గుముఖం పడుతుంది.
►రోజ్‌ వాటర్‌ ముఖానికి సహజసిద్ధ నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది.

చదవండి: Beauty Tips: ట్యాన్‌, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్‌.. ఇలా చేశారంటే
Beard Shaving: రోజూ షేవింగ్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement