భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బయోటిక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు పసుపును కూడా మితంగానే వాడాలి. అధ్యయనం ప్రకారం రోజుకు ఒక టీ స్పూన్ పసుపు మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా వ్యాధుల బారిన పడితే పసుపును వాడొద్దంటున్నారు నిపుణులు.
♦ పసుపు డయాబెటిక్ ఫేషెంట్స్‌కు అంత మంచిది కాదు అంటారు. ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్ పెరుగుతుందట.
♦ పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు కలగవచ్చు.
♦ ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్లు పసుపును ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది.
♦ కామెర్లు ఉన్నవారు పసుపుకు వీలైనంతగా దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది.
♦ కొందరు అలర్జీతో బాధపడుతుంటారు. అలాంటి వారు చాలా మితంగా పసుపును వాడాలి. లేదంటే అలర్జీ సమస్య తీవ్రమవుతుంది.
♦ కొందరికి శరీరంలో వేడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు పసుపును ఎక్కువగా తినడం వల్ల మరింత వేడి పెరుగుతుంది.
♦ అధికంగా పసుపు వినియోగించడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment