సైనస్, కీళ్ల నొప్పులు, అజీర్తి, జలుబు, దగ్గు.. శీతాకాలంలో పొంచి ఉండే రుగ్మతలు. వీటి నుంచి బయటపడేందుకు మీ వంటిట్లోనే చక్కని పరిష్కారం ఉంది. హాస్పిటల్ల చుట్టూ తిరగకుండా.. మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
పసుపు
అవును.. ఆహారంలో పసుపు తీసుకోవడంవల్ల చేకూరే మేలు అంతాఇంతా కాదు. పాలు, టీ వంటి పానీయాల్లో చిటికెడు పసుపును జోడించడం వల్ల చలికాలపు రుగ్మతల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మీ ఆహారంలో పసుపును భాగం చేస్తే చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..
పసుపును ‘హాలిడే వెయిట్’ అని కూడా అంటారు. కొంతమంది సెలవురోజుల్లో ఆరోగ్యానికి హాని తలపెట్టే ఆల్కహాల్ వంటివి సేవించడం పరిపాటి. ఫలితంగా లివర్ దెబ్బ తినడం జరుగుతుంది. ఐతే పసుపులోని యాంటీఆక్సిడెంట్స్ మీ శరీరానికి లోపల్నుంచి చికిత్సనందిస్తుంది.
శీతాకాలపు చలిని తట్టుకోవడానికి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఐతే కొంతమంది వేడి పానీయాలను అధికంగా తీసుకుంటారు. ఇవి జీర్ణవ్యవస్థను ఇబ్బందిపెడతాయి. పసుపు ఆహారానికి రుచిని జోడించడమేకాకుండా, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు తరచుగా ఆహారంలో పసును తీసుకోవడం వల్ల మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు కూడా వనకూరుతుంది.
పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో అనేక వ్యాధుల నివారణలో పసుపు వినియోగించబడుతోందనే విషయం తెలిసిందే. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు చక్కని మందు మన వంటిటి పసుపే! కాబట్టి దీనిని తీసుకోవడం మర్చిపోకండే..!
చదవండి: Depression: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!!
Comments
Please login to add a commentAdd a comment