హెల్త్
ఆరోగ్యంగా ఉండటానికి సరైన తిండి, శరీరానికి తగిన వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంతమంది జీవన శైలి, మానసిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోవడం లేదు. అటువంటి వారు నిద్రమాత్రలకు బదులు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు.
అరటి పండు..
నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు అరటి పండ్లతోపాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్‌తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. పైనాపిల్‌లో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్‌ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
కివీ పండ్లు..
ద్ర సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయులను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
యాపిల్..
యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్ అనేది బెస్ట్ స్నాక్‌గా చెపొ్పచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్ తినండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది.
బొప్పాయి..
బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు హాయిగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఇవి చదవండి: Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..
Comments
Please login to add a commentAdd a comment