బ్రాహ్మి ప్రభావవంతమైన ప్రయోజనాలను కలిగిస్తోందని ‘జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్’ వెల్లడించింది. బ్రాహ్మితోపాటు మరో నాలుగింటిని కూడా తెలిపింది. బ్రాహ్మిని క్యాప్సూల్ రూపంలో, పౌడర్‌గానూ, నీటిలో మరిగించి టీ గా కూడా తీసుకోవచ్చు. ఇది దెబ్బతిన్న న్యూరాన్‌లను ఆరోగ్యవంతం చేసి నాడీ వ్యవస్థ నుంచి సాగాల్సిన సమాచార ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.
– అశ్వగంధ: మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాల నుంచి స్వస్థత పరిచి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని ‘జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్’ అధ్యయనంలో వెల్లడైంది. కార్టిసోల్ స్థాయులు పెరగడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అశ్వగంధ కార్టిసోల్ స్థాయులను తగ్గించి మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. సమాచారాన్ని అందుకున్న తర్వాత మెడదు వేగంగా స్పందించి చేయాల్సిన పని మీద శ్రద్ధ, కార్యనిర్వహణ సమర్థతను మెరుగుపడుతుంది. అయోమయానికి గురికావడం తగ్గి ఆలోచనల్లో స్పష్టత చేకూరుతుంది. ఇది టాబ్లెట్, పౌడర్‌గా దొరుకుతుంది. నిద్ర΄ోయే ముందు పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.
– పసుపు: పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సుగుణాలుంటాయి. యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌ని కూడా మెరుగు పరుస్తుందని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ జీరియాట్రిక్ సైకియాట్రీ’ పేర్కొన్నది. దీనిని కూరల్లో వేసుకోవడం, జలుబు చేసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగడం తెలిసిందే. నీటిలో పసుపు, మిరియాల పొడిని మరిగించి తాగితే జీవక్రియలు మెరుగుపడతాయి.
– గోతుకోలా: దీనిని సెంట్రెల్లా ఏషియాటికా అంటారు. ఈ ఆకును ఆసియాలోని చాలా దేశాల్లో సలాడ్, సూప్, కూరల్లో వేసుకుంటారు. ఈ ఆకును నీటిలో మరిగించి టీ తాగవచ్చు. క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎదురయ్యే జ్ఞాపకశక్తి లోపం నివారణ అవుతుందని ‘జర్నల్ ఆఫ్ ఎథ్నోపార్మకాలజీ’ చెప్పింది. మధ్య వయసు నుంచి దీనిని వాడడం మంచిది.
– గింకో బిలోబా: దీనిని చైనా వాళ్లు మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్ధక్యంలో ఎదురయ్యే మతిమరుపు (డిమెన్షియా) ను నివారిస్తుందని ‘కోష్రానే డాటాబేస్ ఆఫ్ సిస్టమిక్ రివ్యూస్’ తెలియ చేసింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ్రపాపర్టీస్ మెదడు కణాల క్షీణతను అరికడతాయి. ఇవి కూడా మాత్రలు, పొడి రూపంలో దొరుకుతాయి. రోజూ ఈ పొడిని నీటిలో మరిగించి తాగితే వయసు మీరుతున్నా సరే మతిమరుపు సమస్య దరి చేరదు.
ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!
Comments
Please login to add a commentAdd a comment