ashwagandha
-
బ్రాహ్మి: ఇది.. మీ మెదడుకు మేతలాంటిది!
బ్రాహ్మి ప్రభావవంతమైన ప్రయోజనాలను కలిగిస్తోందని ‘జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్’ వెల్లడించింది. బ్రాహ్మితోపాటు మరో నాలుగింటిని కూడా తెలిపింది. బ్రాహ్మిని క్యాప్సూల్ రూపంలో, పౌడర్‌గానూ, నీటిలో మరిగించి టీ గా కూడా తీసుకోవచ్చు. ఇది దెబ్బతిన్న న్యూరాన్లను ఆరోగ్యవంతం చేసి నాడీ వ్యవస్థ నుంచి సాగాల్సిన సమాచార ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.– అశ్వగంధ: మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాల నుంచి స్వస్థత పరిచి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని ‘జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్’ అధ్యయనంలో వెల్లడైంది. కార్టిసోల్ స్థాయులు పెరగడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అశ్వగంధ కార్టిసోల్ స్థాయులను తగ్గించి మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. సమాచారాన్ని అందుకున్న తర్వాత మెడదు వేగంగా స్పందించి చేయాల్సిన పని మీద శ్రద్ధ, కార్యనిర్వహణ సమర్థతను మెరుగుపడుతుంది. అయోమయానికి గురికావడం తగ్గి ఆలోచనల్లో స్పష్టత చేకూరుతుంది. ఇది టాబ్లెట్, పౌడర్‌గా దొరుకుతుంది. నిద్ర΄ోయే ముందు పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.– పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలుంటాయి. యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌ని కూడా మెరుగు పరుస్తుందని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ జీరియాట్రిక్ సైకియాట్రీ’ పేర్కొన్నది. దీనిని కూరల్లో వేసుకోవడం, జలుబు చేసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగడం తెలిసిందే. నీటిలో పసుపు, మిరియాల పొడిని మరిగించి తాగితే జీవక్రియలు మెరుగుపడతాయి.– గోతుకోలా: దీనిని సెంట్రెల్లా ఏషియాటికా అంటారు. ఈ ఆకును ఆసియాలోని చాలా దేశాల్లో సలాడ్, సూప్, కూరల్లో వేసుకుంటారు. ఈ ఆకును నీటిలో మరిగించి టీ తాగవచ్చు. క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎదురయ్యే జ్ఞాపకశక్తి లోపం నివారణ అవుతుందని ‘జర్నల్ ఆఫ్ ఎథ్నోపార్మకాలజీ’ చెప్పింది. మధ్య వయసు నుంచి దీనిని వాడడం మంచిది.– గింకో బిలోబా: దీనిని చైనా వాళ్లు మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్ధక్యంలో ఎదురయ్యే మతిమరుపు (డిమెన్షియా) ను నివారిస్తుందని ‘కోష్రానే డాటాబేస్ ఆఫ్ సిస్టమిక్ రివ్యూస్’ తెలియ చేసింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ్రపాపర్టీస్ మెదడు కణాల క్షీణతను అరికడతాయి. ఇవి కూడా మాత్రలు, పొడి రూపంలో దొరుకుతాయి. రోజూ ఈ పొడిని నీటిలో మరిగించి తాగితే వయసు మీరుతున్నా సరే మతిమరుపు సమస్య దరి చేరదు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ..
30 ఎకరాల్లో జీవీ కొండయ్య అశ్వగంధ సాగు కింగ్ ఆఫ్ ఆయుర్వేదగా పేరొందిన ఔషధ పంట అశ్వగంధ మెట్ట రైతులకు లాభాల సిరులను కురిపిస్తోంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో సంప్రదాయ పంటలను నమ్ముకొని ఏటా పంట నష్టంతో కుదేలైన జీవీ కొండయ్య అనే రైతు వినూత్నంగా ఆలోచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జీ.కొట్టాల గ్రామంలోని తన పొలంలో 30 ఏళ్ల క్రితం అశ్వగంధ సాగుకు శ్రీకారం చుట్టి లాభాలు గడిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచారు. కొండయ్యను ఆదర్శంగా తీసుకొని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎందరో రైతులు అశ్వగంధ సాగు చేపట్టారు. ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. అశ్వగంధ పంటపై హైదరాబాదు బోడుప్పల్‌లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం (సీమాప్)లో జరిగిన అవగాహన సదస్సు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు చెప్పింది శ్రద్ధగా విన్న కొండయ్య ఆ సీజన్లోనే ఎకరాకు రూ.6 వేల ఖర్చుతో 5 ఎకరాల్లో అశ్వగంధను సాగు చేశారు. అతి తక్కువ వర్షపాతంలోనే పండే పంట ఇది. ఎటువంటి క్రిమి సంహారక మందులుగానీ, ఎరువులు గానీ వాడాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి సాధించారు. ఎకరాకు 3 క్వింటాళ్ల అశ్వగంధ వేర్ల దిగుబడి రావడంతో క్వింటాకు రూ.40 వేల వరకూ ఆదాయం పొందారు. నాటి నుంచి కొండయ్య వెనుతిరిగి చూడలేదు. 5 ఎకరాలతో ప్రారంభించి 30 ఎకరాలకు విస్తరించారు. తనకున్న 8 ఎకరాలతో పాటు ఇతర రైతుల భూమిని కౌలుకు తీసుకొని, ప్రతి ఏడాదీ భూమి మారుస్తూ. అశ్వగంధను సాగు చేస్తున్నారు. అశ్వగంధ సాగులో మంచి దిగుబడి సాధించడంతోపాటు, నాణ్యమైన దిగుబడితో ప్రశంశలు అందుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మెడిషినల్ బోర్డు నుంచి, లక్నోలోని ‘సీమాప్’తో పాటు ఢిల్లీ, జైపూర్లలో కూడా అవార్డులు సొంతం చేసుకున్నారు. 2 ఎకరాల్లో ఫారం పాడ్లు నిర్మించి, వర్షాభావ పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తూ వచ్చారు. కొండయ్యను చూసి సొంత గ్రామంతోపాటు రాయలసీమ జిల్లాల రైతులు పలువురు అశ్వగంధ సాగు చేస్తూ లాభాలు గడిస్తుండటం విశేషం. మార్కెటింగ్ సమస్య లేదు అశ్వగంధ పంటను జూలైలో విత్తితే జనవరిలో పంట చేతికి వస్తుంది. వర్షపాతం అతితక్కువ ఉన్న ప్రాంతాలకే ఈ పంట అనుకూలం. వర్షాలు ఎకువైతే వేరు కుళ్లిపోయి పంట పాడైపోతుంది. పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. కిలో రూ.200 చొపున ఎకరాకు 3 కేజీల విత్తనం వేస్తే సరిపోతుంది. పంటకు చీడపురుగుల బెడదగానీ, తెగుళ్ల బెడద గానీ ఏమీ ఉండవు. పశువులు, పక్షులు, జింకల నుంచి కూడా ముప్పు ఉండదు. పశువుల పేడను ఎరువుగా వేస్తే సరిపోతుంది. విత్తిన నెల తరువాత ఒకసారి, 3 నెలల తరువాత మరోసారి కలుపు తీయాలి. పంట పీకిన రోజే వేరును, కాండాన్ని, కాయలను వేరు చేసి ఆరబెడతాం. వేరు నాణ్యతను బట్టి 6 భాగాలుగా విభజించి ప్యాకింగ్ చేసి పెడతాం. కాయను నూర్పిడి చేసి విత్తనాలు తీస్తాం. ఎకరాకు 50 నుండి 100 కేజీల వరకూ విత్తనం వస్తుంది. అదే విత్తనాన్నే తిరిగి పంట సాగుకు ఉపయోగిస్తాం. మిగిలిన విత్తనాన్ని కావాల్సిన రైతులకు కిలో రూ.200 చొప్పున విక్రయిస్తాం. అశ్వగంధ విత్తనం వేశాక తరువాత నెలరోజుల పాటు వర్షం రాకపోయినా విత్తనం ఏమీ కాదు. అశ్వగంధ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం కూడా అందుతుంది. పంటను నిల్వ చేసేందుకు స్టోరేజీ రూముల నిర్మాణానికి డబ్బు కూడా ఇస్తుంది. వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొంటున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు. – జీవీ కొండయ్య (94415 35325), అశ్వగంధ రైతు, జీ.కొట్టాల, గుంతకల్లు మం., అనంతపురం జిల్లా – యం.మనోహర్, సాక్షి, గుంతకల్లు రూరల్, అనంతపురం జిల్లా -
ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్
ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మెడిసన్‌కు సంబంధించి పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా వల్ల మనదేశ సాంప్రదాయ పద్దతులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్సీ (ఐసీఎంఆర్ ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే అశ్వగంధ ఏ విధింగా పనిచేస్తుందన్న దానిపై పరీక్షించనున్నారు. #WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX — ANI (@ANI) May 7, 2020 అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అశ్వగంధతో పాటు యష్తిమధు, గుడుచి పిప్పాలి వంటి సాంప్రదాయ ఔషదాలు (ఆయుష్ -64) గా పిలిచే ఈ ఫార్ములాను నేటినుంచి ఇవ్వనున్నట్లు ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా తెలిపారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయని పేర్కిన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 కు చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1,783 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. (చ్యవన్‌ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి) -
ఆయుర్వేద ప్రభావమెంత?
న్యూఢిల్లీ: కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద ఔషధం అశ్వగంధ చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అశ్వగంధను కరోనా సోకకుండా నిరోధించగల ఔషధంగా వైద్య సిబ్బందికి, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఇతరులకు హైడ్రో క్లోరోక్విన్ స్థానంలో వినియోగించవచ్ఛా? అనే విషయంపై నియంత్రిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ను సీఎస్ఐఆర్, ఐసీఎంఆర్‌ల సహకారంతో ఆయుష్, ఆరోగ్య, శాస్త్ర,సాంకేతిక శాఖలు ప్రారంభించాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం వెల్లడించారు. ఆయుర్వేద ఔషధాలు యష్టిమధు, గదుచి, పిప్పలి, ఆయుష్ 64ల సమ్మేళనాన్ని సాధారణ కోవిడ్ రోగులకు ఇవ్వడంపైనా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ తెలిపారు. వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా, అలాగే, సోకాక ఔషధంగా వాటిని వినియోగించడంపై పరీక్షలు జరుపుతున్నామన్నారు. కరోనా తీవ్రంగా ఉండేవారిపై ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియో ఔషధాల ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే పరీక్షలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోవిడ్‌పై ఆయుష్ ఔషధాల ప్రభావం, ఆయా ఔషధాల వినియోగం తదితర సమాచారం తెలిపే ‘సంజీవని’ యాప్‌ను హర్షవర్ధన్ ఆవిష్కరించారు. -
అశ్వగంధకు ఇదే అదను!
రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే ఔషధ పంటల్లో అశ్వగంధ ముఖ్యమైనది. తెలుగురాష్ట్రాలతోపాటు మరో 4 రాష్ట్రాల్లో అశ్వగంధ సాగులో ఉంది. పంటకాలం 150–180 రోజులు. ఆగస్టు మొదటి వారం వరకు దీన్ని విత్తుకోవచ్చు. అశ్వగంధ వేర్లు, కాండం, ఆకుల్లో ఔషధ గుణాలుంటాయి. అయితే వాణిజ్యపరంగా వేర్లకే గిరాకీ ఉంటుంది. మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. వేర్లు లేత పసుపుతో కూడిన తెలుపు రంగులో చిరుచేదుగా ఉంటాయి. నరాల బలహీనతను నివారించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అల్సర్ల నివారణకు ఉపయోగిస్తారు. అశ్వగంధ వేర్ల చూర్ణం నిద్రలేమిని నివారిస్తుంది. నీరు నిల్వ ఉండని నేలలు, పొడి వాతావరణం అనుకూలం. ఉదజని సూచిక 7.5–8.0 మధ్య ఉండాలి. వర్షాధార పంటగా సాగుకు తేలికపాటి నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉంటే ఇసుక నేలలు లేదా తేలికపాటి ఎర్రనేలలు అనుకూలం. జవహర్–20, రక్షిత, నాగరి రకాలు విత్తుకోవచ్చు. తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ బోడుప్పల్‌లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ(సీమాప్) అందించే పోషిత రకం వంగడం అనుకూలం. ఎకరాకు నారు పద్ధతిలో 2 కిలోలు, వెదజల్లే పద్ధతిలో 7–8 కిలోలు అవసరం. 5 రెట్లు ఇసుకతో కలిపి వెదజల్లాలి. నారును వరుసల మధ్య 25–30 సెం.మీ., మొక్కల మధ్య 8–10 సెం.మీ. ఉండేలా నాటుకోవాలి. అశ్వగంధకు తీవ్రమైన తెగుళ్లేవీ రావు. కాయలు ఎరుపు రంగులోకి మారినప్పుడు లేదా ఆకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు మొక్కలను పీకి వేర్లను సేకరించాలి. వేర్లను 7–10 సెం.మీ. ముక్కలు చేసి నీడన ఆరబెట్టుకోవాలి. ఎండిన వేర్లను గ్రేడింగ్ చేసుకొని నిలువ ఉంచుకుంటే రైతులకు మంచి ధర లభిస్తుంది. ఎకరాకు 250–300 కిలోల ఎండు వేర్లు, 80 కిలోల విత్తనం వస్తుంది. ఎకరాకు ఖర్చు రూ. 15 వేల వరకు ఉంటుంది. జాతీయ ఔషధమొక్కల బోర్డు, తెలంగాణ ఔషధ మొక్కల బోర్డు(94910 37554) ఎకరా సాగుకు రూ. 4,392 వరకు సబ్సిడీ అందిస్తున్నాయి. మార్కెట్ ధరను బట్టి రూ. 35,000–45,000 వరకు నికరాదాయం రావచ్చు. మధ్యప్రదేశ్‌లోని నీమచ్, మాండ్సర్ మార్కెట్లు అశ్వగంధ కొనుగోలుకు ప్రసిద్ధి. స్థానికంగా కూడా మార్కెటింగ్ అవకాశాలున్నాయి. (రాజేంద్రనగర్‌లోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలోని ఉద్యాన కళాశాల పరిశోధక విద్యార్థులు ఎస్. వేణుగోపాల్, బి. అనిత అందించిన సమాచారం) -
అశ్వగంధతో మేలైన నిద్ర!
టోక్యో: నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే అశ్వగంధ ఉపయోగించండి అంటున్నారు శాస్త్రవేత్తలు. అశ్వగంధ ఆకులలో నిద్రకు ఉపకరించే లక్షణాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. అశ్వగంధలోని వివిధ మూలకాలు నిద్రపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయంపై జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ త్సుకుబాకు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన నిర్వహించారు. అశ్వగంధ ఆకుల నుంచి సంగ్రహించిన నీటిలో ట్రైఎథిలీన్ గ్లైకోల్(టీఈజీ) అధికంగా ఉంటుందని, ఇది సాధారణ నిద్రకు ఉపకరిస్తుందని వారు తెలిపారు. ఇన్సోమ్నియా, నిద్ర సంబంధిత రుగ్మతలకు చికిత్స అందించడంలో ఈ పరిశోధనలు ఎంతో సహాయపడతాయని త్సుకుబా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మహేశ్ కె.కౌశిక్ తెలిపారు. భారత్‌లోని సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదలో అశ్వగంధను ఉపయోగిస్తారు. దీని లాటిన్ పదం సోమ్నిఫెరా (నిద్రను కలిగించేది అని అర్థం). అశ్వగంధ నిద్రకు మేలు చేస్తుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నప్పటికీ, అందులో నిద్రకు ఉపకరించే లక్షణాలున్న మూలకం ఏమిటో ఇప్పటికీ తెలియలేదని పరిశోధకులు తెలిపారు.