ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మెడిసన్‌కు సంబంధించి పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా వల్ల మనదేశ సాంప్రదాయ పద్దతులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్సీ (ఐసీఎంఆర్ ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే అశ్వగంధ ఏ విధింగా పనిచేస్తుందన్న దానిపై పరీక్షించనున్నారు.
#WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX
— ANI (@ANI) May 7, 2020
అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అశ్వగంధతో పాటు యష్తిమధు, గుడుచి పిప్పాలి వంటి సాంప్రదాయ ఔషదాలు (ఆయుష్ -64) గా పిలిచే ఈ ఫార్ములాను నేటినుంచి ఇవ్వనున్నట్లు ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా తెలిపారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయని పేర్కిన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 కు చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1,783 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. (చ్యవన్‌ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి)
Comments
Please login to add a commentAdd a comment