
విజయవాడ స్టేషన్‌లో రైల్వే జీఎం తనిఖీలు
విజయవాడ (రైల్వేస్టేషన్): దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా శుక్రవారం విజయవాడ స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఉదయం మచిలీపట్నం స్టేషన్‌లో తనిఖీచేసిన ఆయన తిరుగు ప్రయాణంలో విజయవాడ స్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై నున్న ప్రయాణికుల వెయిటింగ్ హాల్, వివిధ ఆహార పదార్ధాల స్టాళ్లను తనిఖీ చేశారు.
ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై నున్న ఎస్కలేటర్ పనిచేయక పోవడంతో తక్షణం మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. రాబోవు కష్ణా పుష్కరాలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటినుంచే ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టాలని డీఆర్‌ఎం అశోక్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.