వంటిమామిడి వద్ద వర్షంలోనూ తనిఖీలు
- పోలీసు వలయంలో రాజీవ్ రహదారి
- వంటిమామిడి వద్ద చెక్‌పోస్టు, విస్తృత తనిఖీలు
- భారీగా మోహరించిన బలగాలు
- పర్యవేక్షించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీ
వర్గల్/ములుగు: రాజీవ్ రహదారిని పోలీసులు దిగ్బంధించారు. జిల్లా సరిహద్దు వంటిమామిడి వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. వరుసగా రెండోరోజైన మంగళవారం రోజంతా తనిఖీ లను కొనసాగించారు. మల్లన్న సా గర్ నిర్వాసితులకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతలు వస్తున్నారనే సమాచారంతో చెక్ పోస్టు భారీగా బలగాలను మోహరించారు. ప్రతి వాహనా న్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వంటిమామిడి వద్ద ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు తనిఖీలు కొనసాగాయి.
మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి డీఎస్పీలు శ్రీధర్, నాగరాజు, తిరుపతయ్య ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 150 మందికిపైగా పోలీసులు తనిఖీ లు చేపట్టారు. మహిళా నేతలను అరెస్ట్ చేసేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను రంగంలోకి దింపారు. వర్షంలోనూ కొనసాగించారు. అనుమానితులను ఏ ఒక్కరిని వదలకుండా ఆర్టీసీ బస్సులను, కార్లను, ఇతర వాహనాలను సైతం తనిఖీ చేశారు.
చెక్‌పోస్టును సందర్శించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీ
వంటిమామిడి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును మంగళవారం ఉదయం హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకు¯ŒS సబర్వాల్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించారు. అక్కడి పరిస్థితి సమీక్షించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి దాదాపు గంటపాటు చెక్ పోస్టు వద్దే ఉండి పరిస్థితి అంచనా వేస్తూ పోలీసులకు తగు ఆదేశాలిచ్చారు.