
న్యూఢిల్లీ: నోట్లరద్దుకు ముందు, తర్వాత ఆదాయాల్లో భారీ తేడాలు ఉన్నాయనే అనుమానంతో 20,572 పన్ను రిటర్ను పత్రాలను సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. అలాగే పన్ను ఎగవేశారనే అనుమానం ఉన్న మరో లక్ష కేసులను కూడా విచారించనున్నట్లు అధికారులు సోమవారం చెప్పారు. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ అక్టోబరు చివరి నాటికి రూ.1,883 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించింది. మొత్తం 541 బినామీ ఆస్తులను అధికారులు జప్తు చేయగా, వాటిలో అహ్మదాబాద్ కార్యాలయం పరిధిలో 136, భోపాల్ పరిధిలో 93 ఉండటం గమనార్హం. బినామీ ఆస్తులను కలిగిఉన్న వారిపై ఐటీ కఠిన చర్యలు కొనసాగుతాయని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment