సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న రాగామాకుల కుంట వద్ద మంగళవారం ఉదయం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఆధికారులు అతన్ని అరెస్టు చేసి సుమారు రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ స్మగ్లర్ తమిళనాడు రాష్ట్రంలోని జమునామత్తూరుకు చెందిన స్వామినాథన్‌గా గుర్తించారు. కాగా ఎర్రచందనం కూలీలు తనిఖీ చేసే టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో అధికారులు రాళ్లదాడిని ప్రతిఘటించి కుంబింగ్ కొనసాగిస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment