సాక్షి, విజయవాడ: మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు తెలిపారు. ఇప్పటివరకు 360 విద్యాసంస్థలు తనిఖీ చేశామని.. 50 కాలేజీలు, 25 స్కూళ్లపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష)
ప్రభుత్వాదేశాలను కొన్ని కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అధిక ఫీజులు వసూలు చేశారు.అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీలు తిరిగి డబ్బును విద్యార్థులకు ఇచ్చేయాలి. అలా చేస్తే చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తే 91502 81111 కాల్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అధిక ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంతారావు హెచ్చరించారు. చదవండి: కదిలిన సంక్షేమ రథ చక్రాలు
Comments
Please login to add a commentAdd a comment