Kantha Rao
-
పిల్లలు పుట్టేందుకు ఆపరేషన్.. వికటించడంతోనే నెల్లూరి కాంతారావు మృతి
అలనాటి వెండితెర చిత్రాల్లో నటుడిగా, పహిల్వాన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు నెల్లూరు కాంతారావు. అయితే ఓ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఆయన నిండు ప్రాణాలు పోయాయి. తాజాగా కాంతారావు సతీమణి నిర్మల(80) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మాది ఉమ్మడి కుటుంబం. కాంతారావుకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేది. తనకు ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్సర్సైజ్ చేసేవాడు. మాకు కనకమహల్ అని థియేటర్ ఉండేది. దాన్ని కూడా ఆయనే బాగా చూసుకునేవాడు. ముగ్గురిని చంపేశారంటూ పుకారు ఓ సినిమా రిలీజైనప్పుడు ముగ్గురు పిల్లలు క్యూలైన్లో నిలబడకుండా ముందుకు వెళ్లారు. అక్కడున్న వాళ్ల ఆపుతుంటే వీళ్లు ఇంకా తిడుతూ రెచ్చిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన కాంతారావు కోపంతో వాళ్లను చెంప మీద ఒక్కటిచ్చాడు. వాళ్లు కింద పడటంతో ఏదైనా అయ్యిందేమోనని క్యాంటీన్‌కు తీసుకెళ్లి సోడా తాగించి మరీ సారీ చెప్పాడు. వాళ్లు కూడా తప్పు మాదే అని తిరిగి సారీ చెప్పారు. కానీ కాసేపటికి పోలీసులు వచ్చి ముగ్గురిని చంపి బాత్రూమ్లో వేశారంట అని అడిగారు. ఆ పిల్లలేమో మాకు తెలియకుండా అక్కడి నుంచి జారుకుని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అసలేం జరిగిందనేది బయటకు చెప్పడం లేదు. కాంతారావు అరెస్ట్ ఇక కాంతారావు విద్యార్థులను హత్య చేశాడని ప్రచారం జరిగింది. విద్యార్థులు పెట్రోల్ తీసుకుని థియేటర్ దగ్గరకు వచ్చారు. రాళ్లు తీసుకుని థియేటర్ అద్దాలు పగలగొట్టారు. ఏం చేయాలో అర్థం కాక కాంతారావు అక్కడి నుంచి గోడ దూకి పారిపోయాడు. ఆయన్ను అరెస్ట్ చేసేవరకు రచ్చరచ్చ చేశారు. తర్వాత ఎలాగో బయటకు వచ్చాడు. ఆయన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. కానీ మేము చేసిన ఓ పని వల్ల ఆయన ప్రాణమే పోయింది. పిల్లల కోసం ఆస్పత్రికి అసలేమైందంటే.. మా పెదనాన్న కొడుక్కి పిల్లలు లేకపోతే మద్రాసులో ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఆయన ఇచ్చిన మందులతో వారికి పిల్లలు పుట్టారు. ఈయన ఓ నలుగురిని తీసుకెళ్తే వారికి కూడా పుట్టారు. మమ్మల్ని కూడా వెళ్లమని చెప్తూ ఉండేవాడు. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత మేము కూడా వెళ్లాం. అన్ని టెస్టులు చేశారు. మందులిచ్చారు, మళ్లీ రమ్మన్నారు. ఈసారి వెళ్లినప్పుడు కాంతారావుకు ఒక ఆపరేషన్ చేస్తామన్నారు. మత్తుమందు వికటించి అప్పుడు ఓ సినిమా చేస్తున్నందున అది పూర్తయిపోయాక వస్తానని చెప్పాడు. సినిమా రిలీజవగానే ఆస్పత్రికి వెళ్లాం. ఆపరేషన్ చేసేందుకు క్లోరోఫామ్(మత్తుమందు) ఇచ్చారు. ఈయన పహిల్వాన్ కావడంతో ఆక్సిజన్ మాస్క్లాంటివి పీకేస్తాడేమోనని బెడ్‌కు కట్టేశారు. కానీ మత్తు మందు వికటించి ఆయన చనిపోయారు. నా భర్త అలా చనిపోతాడని అనుకోలేదు' అని చెప్పుకొచ్చింది నిర్మల. చదవండి: చిరంజీవి చెడామడా తిట్టేశాడు: కోట శ్రీనివాసరావు -
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫేస్ టు ఫేస్ వార్నింగ్
-
Rega Kantha Rao Vs Podem Veeraiah: స్టేజీపైనే బాహాబాహీ.. నీకు మైండ్ ఉందా.. నువ్వు నోర్మూసుకో..!
దుమ్ముగూడెం: తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకురావడంతో పాటు గల్లాలు పట్టుకునేందుకు రెడీ అయ్యారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అక్కడే ఉన్న కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారులు సర్దిచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడులో బుధవారం తునికాకు బోనస్ చెక్కుల పంపిణీకి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ కాంతారావు, ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని, రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థేనంటూ తన ప్రసంగం కొనసాగించారు. దీనికి వేదికపై ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య(కాంగ్రెస్) జోక్యం చేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమమని..ఇక్కడ రాజకీయాలెందుకంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాంతారావు మరింత దూకుడుగా ప్రసంగం కొనసాగిస్తూ ప్రతిపక్షాలనుద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం ముగించి తన సీట్లో కూర్చునే సమయంలోనూ ప్రభుత్వ పథకాల గురించి చెబుతుంటే బాధెందుకు అంటూ పోదెంను ఉద్దేశించి అన్నారు. ఇందుకు వీరయ్య ‘నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడితే కుదరదంటూ’హెచ్చు స్వరంతో బదులిచ్చారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీకు మైండ్ ఉందా అంటూ పోదెం అనగా.. నువ్వు నోర్మూసుకో అంటూ విప్ అన్నారు. ఇలా అభ్యంతరకమైన పదాలతో దూషించుకుంటూనే ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిశ్చేషు్టడై చూస్తుండిపోయారు. ఇద్దరూ భౌతికదాడులకు దిగే విధంగా పరిస్థితి నెలకొనడంతో అక్కడే ఉన్న కలెక్టర్ అనుదీప్, పీసీసీఎఫ్ డోబ్రియల్ కల్పించుకుని రేగా చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టగా ఎస్పీ వినీత్ ఎమ్మెల్యే పొదెంను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. -
‘అమ్మాయిల పిచ్చి రూమర్’పై స్పందించిన కాంతారావు కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగాడు కాంతారావు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు పోషించి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎంతగానో ఆస్తులు పోగేశాడు. కానీ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 400 ఎకరాలను పోగొట్టుకున్నాడు. కాంతారావు కూతురు సుశీల రావు మాట్లాడుతూ.. 'నాన్నగారి చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు. దీంతొ నానమ్మ నాన్నను గారాబంగా పెంచింది. ఎవ్వరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవాడు. నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పారు, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమాల కోసం 400 ఎకరాలు అమ్మేశారు. అలా సినిమాలు నిర్మించి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని అనుకున్నారు. అప్పుడు కృష్ణ- విజయనిర్మలగారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఓ వేషం ఇప్పిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నా పెళ్లి కోసం కృష్ణగారు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నాన్నకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చచ్చేదాకా నటిస్తూ ఉండాలన్నదే ఆయన కోరిక. కాంతారావుకు ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారని ఓ రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. ఆయనకు సినిమాలు, ఇల్లు ఈ రెండే తెలుసు. ఏ హీరోయిన్‌కూ డబ్బులివ్వలేదు' అని క్లారిటీ ఇచ్చింది సుశీల. -
సీనియర్ నటుడు సుమన్‌కు అరుదైన పురస్కారం
సీనియర్ నటుడు సుమన్‌కు అరుదైన పురస్కారం దక్కింది. ఆయనకు కాంతారావు శత జయంతి పురస్కారం అందించనున్నట్లు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అగ్ర హీరోలుగా వెలుగుతున్న సమయంలోనే వారితో సమానంగా హీరోగా కాంతారావు పేరు సంపాదించారని తమ్మా రెడ్డి భరద్వాజ అన్నారు. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హీరోగా నిలదొక్కుకున్నా తర్వాత ఆయన సహాయ పాత్రల్లో నటించారని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. 'కాంతా రావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ సుందరీ సుబ్బారావులో ఆయనకు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మరో దర్శకుడు పీసీ ఆదిత్య మాట్లాడుతూ.. 'కాంతారావు బయో పిక్ తీసేందుకు వారి స్వ గ్రామం కోదాడ మండలం గుదిబండ వెళ్లి వచ్చినట్లు వివరించారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, కాంతారావు కుమారుడు, నటుడు రాజా పాల్గొన్నారు. -
అద్దె ఇంట్లో ఉంటున్నాం.. సాయం చేయండి: స్టార్ హీరో కొడుకు
అలనాటి హీరో కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు వందల సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాంతారావు దిగ్గజ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. తమకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కాంతారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన కుమారులు ఈ సందర్భంగా తమ దీనస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ సినిమాలు తీశారు. దీనివల్ల మేం ఆర్థికంగా చాలా నష్టపోయాం. నాన్న క్యాన్సర్ బారినపడినప్పుడు కూడా చికిత్స కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఒకప్పుడు మద్రాసులో బంగ్లాలో ఉన్న మేము ఇప్పుడు సిటీకి దూరంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. పరిశ్రమ నుంచి మాకెలాంటి సాయం అందలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి మాకు ఓ ఇల్లు కేటాయించి సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ కోరారు. -
ఫీజుల పై ప్రభుత్వం జారీ చేసిన జీవో తో అన్ని వర్గాలకు మేలు
-
ఫీజుల ఖరారు.. అందరి మేలు కోసమే
సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలందరి మేలును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజులు ఖరారుచేశామని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు తెలిపారు. తల్లిదండ్రులు, 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారన్నారు. కమిషన్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎ. విజయశారదారెడ్డి, సభ్యుడు అజయ్‌కుమార్, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో దశాబ్దాల నుంచి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. గత ఏడాదిలోనే ఫీజులను నిర్ణయించాలనుకున్నాం. కానీ, జీఓ–57 విడుదలైనా న్యాయవివాదంతో సస్పెండ్ కావడం, కరోనా పరిస్థితులవల్ల ముందుకెళ్లలేకపోయాం. ఇప్పుడు వివిధ వర్గాల వారందరితో చర్చించి ప్రాంతాల వారీగా ఆయా విద్యాసంస్థల నిర్వహణకయ్యే వాస్తవిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ, పట్టణ, నగర ప్రాంతాల వారీగా కొన్ని ప్రమాణాలను అనుసరించి ఫీజులు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా స్కూళ్లు, 2,500కు పైగా కాలేజీలున్నాయి. సంస్థల వారీగా ఫీజులు నిర్ణయించడం సాధ్యంకాదు కనుక ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్ సానుకూల పరిష్కారం చూపిస్తుంది. చదవండి: డ్రోన్ల ఆపరేషన్ సులభతరం అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు కనీస సదుపాయాల్లేకుండా అధిక ఫీజులు వసూలుచేసే సంస్థలపై చర్యలు తప్పవు. మూడేళ్ల వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు కమిషన్ నిర్ణయించిన ఫీజులు మాత్రమే చెల్లించాలి. ఎవరైనా ఒత్తిడి చేస్తే కమిషన్‌కు సంబంధించిన 9150381111 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి. గత ఏడాదిలో నిబంధనలు పాటించని 120 విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నాం’.. అని జస్టిస్ కాంతారావు వివరించారు. విద్యారంగంలో మార్పు తెచ్చేందుకే.. వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ ఎ. విజయశారదారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో విద్యారంగ పరిస్థితిని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిలో మార్పు తెచ్చేందుకు కమిషన్‌ను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు ప్రాంతాల వారీగా నిర్ణయించిన ఫీజులను వివరించారు. ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించడమే కాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని.. నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, విద్యకానుక తదితర కార్యక్రమాల గురించి చెప్పారు. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! ప్రైవేట్ సంస్థలు జీతాలివ్వడంలేదు కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలుచేస్తున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సీఎం దీనిపై దృష్టిపెట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తూనే ప్రైవేటు సంస్థలపైనా నియంత్రణను పెట్టారని తెలిపారు. విద్యార్థిపై వెచ్చించే మొత్తం ఆధారంగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలి కానీ అలా జరగడంలేదని.. దీనినే కమిషన్ అమలుచేస్తుందని చెప్పారు. చాలా ప్రైవేటు సంస్థలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడంలేదని.. కనీసం అపాయింట్మెంటు ఆర్డర్ కూడ ఇవ్వడంలేదని ఆయన చెప్పారు. సర్వీసు రూల్సు అసలు లేవని.. వారికి ఇకపై సర్వీసు రూల్సు పెట్టనున్నట్లు సాంబశివారెడ్డి వెల్లడించారు. అలాగే, రానున్న కాలంలో ఆయా సంస్థల ప్రమాణాలను అనుసరించి ర్యాంకులు, అక్రిడిటేషన్‌ను అమలుచేస్తామని అని తెలిపారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, విజయవాడ: మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు తెలిపారు. ఇప్పటివరకు 360 విద్యాసంస్థలు తనిఖీ చేశామని.. 50 కాలేజీలు, 25 స్కూళ్లపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష) ప్రభుత్వాదేశాలను కొన్ని కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అధిక ఫీజులు వసూలు చేశారు.అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీలు తిరిగి డబ్బును విద్యార్థులకు ఇచ్చేయాలి. అలా చేస్తే చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తే 91502 81111 కాల్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అధిక ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంతారావు హెచ్చరించారు. చదవండి: కదిలిన సంక్షేమ రథ చక్రాలు -
'ఏ సమాచారమైనా తెలుసుకునే అధికారం ఉంది'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికిగాను పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు ఏపీలోని ఏ విద్యాసంస్థల సమాచారం అయినా తీసుకునే అధికారం ఉందని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కమిషన్‌పై కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు సమాంతరంగా అమలవుతాయి. ఆంగ్ల విద్యపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఆంగ్ల విద్య కావాలని అభిప్రాయపడ్డారు. అన్ని విద్యాసంస్థలకు ఒకే ఆర్థిక పరిస్థితి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగానే విద్యా విధానాన్ని మార్చడానికి సీఎం జగన్ విశేష కృషిచేస్తున్నారు. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా లక్ష్యం' అంటూ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు వెల్లడించారు. చదవండి: 'సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల అభిమాని' -
కత్తిలా బతికి వెళ్లిపోయారు...
ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు తెలుగు సినిమాకు రెండు కళ్లు. కాని కాంతారావు ఆ మెడలో మెరిసే చంద్రహారం. కత్తి వీరుడు కాంతారావుగా జానపద చిత్రాలు చేసి సగటు ప్రేక్షకుడికి ఆయన చేరువయ్యారు. సాంఘిక చిత్రాలలో బలమైన పాత్రలు చేసి పెద్ద హీరోలను ఢీకొట్టారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటిని, ఇల్లాలి చేతి వంటని, పిల్లల బాల్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఆయన కనుమరుగై దాదాపు దశాబ్దం పైగానే గడిచింది. అయితేనేం చెన్నైలో ఉండే పెద్ద కుమారుడు ప్రతాప్, హైదరాబాద్ లో ఉండే నాలుగో కుమారుడు రాజా తండ్రి జ్ఞాపకాల పరిమళాలను ఎంతో సంతోషంగా సాక్షితో పంచుకున్నారు. రాజా: నాన్నగారికి మేం నలుగురు మగ పిల్లలం, ఒక ఆడపిల్ల. ప్రతాప్ పెద్దన్నయ్య, రెండో అన్నయ్య కేశవరావు, ఆ తరవాత అక్క సుశీల, నేను, నా తరవాత తమ్ముడు సత్యం. నాకు నాలుVó ళ్లు వచ్చేవరకు మాటలు రాలేదు. కుర్తాళంలో ఉన్న జలపాతం నీటికి ఔషధ గుణాలు, మహిమలు ఉన్నాయని తెలిసినవారు చెప్పటంతో నన్ను అక్కడకు తీసుకువెళ్లారు. జలపాతం నీళ్లు నా మీద పడేలా తన భుజాల మీద ఎక్కించుకున్నారు. నీటి మహిమో, యాదృచ్ఛి కమో గానీ, వారు చెప్పినట్టుగానే నాకు మాటలు రావడంతో నాన్నగారి ఆనందానికి అవధులు లేవు. ఆ సంఘటన తరచుగా చెబుతుండేవారు. నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం పెనవేసుకుంది. ఆయనతో మాకు ఎన్నో తీపి అనుభవాలు ఉన్నాయి. పుట్టినరోజులు బాగా జరిపేవారు. పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లటంలాంటి అలవాట్లు ఆయనకు లేవు. అవకాశం వచ్చినప్పుడల్లా మాతో క్యారమ్స్, షటిల్ ఆడేవారు. వినాయకచవితికి మాతో పూజ చేయించేవారు. నాన్న ఊరు వెళ్తుంటే ఏడ్చేవాళ్లం. అప్పుడప్పుడు ఔట్‌డోర్ షూటింగ్‌కి తీసుకువెళ్లేవారు. మేం షూటింగ్ చూసిన మొట్టమొదటి సినిమా సతీ సులోచన. కోదాడ వెళ్లినప్పుడు అక్కడి పొలాలకు తీసుకువెళ్లేవారు. అక్కడ మమ్మల్ని చూసి ‘కాంతారావుగారి అబ్బాయి’ అని అందరూ అంటుంటే మాకు భలే సరదాగా ఉండేది. నాన్నగారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాక ఆయన బ్యాంకు పనులు చూడటం అలవాటు చేసుకున్నాను. హైదరాబాద్ వచ్చాక ఒకసారి నన్ను షూటింగ్‌కి తీసుకువెళ్లారు. వాళ్లు నన్ను ప్రొడక్షన్ బాయ్ అనుకుని, నేను అన్నం దగ్గర కూర్చున్న చోట నుంచి లేపి, మరోచోట కూర్చోమన్నారు. నాన్నగారు కోపంగా, ‘నాకు కూడా అక్కడే అన్నం పెట్టండి’ అన్నారు. ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు. ‘వాడు మా అబ్బాయి, మీ పని నాకు అవమానంగా ఉంది’ అన్నారు. మద్రాసులో వారికి నేనెవరో తెలుసు. కాని హైదరాబాద్‌లో ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల ఈ సంఘటన జరిగింది. మేం పెద్దగా చదువుకోకపోయినా, నాన్న ప్రేమను పరిపూర్ణంగా అందుకున్నాం. ‘సుడిగుండాలు’ చిత్రానికిగాను 1968లో అవార్డు అందుకున్నాను. అవార్డు వచ్చినందుకు సంతోషపడ్డారు కానీ, అటువంటి పాత్రలు ఎన్నడూ వేయద్దు, నా కొడుకు నా కళ్ల ముందరే ఉండాలి’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆ చిత్రంలో నేను వేసిన పాత్రలో చనిపోతాను. సినిమా రంగానికి దూరంగా ఉండమని చెప్పేవారు. హేమ ఫిలిమ్స్ పేరున మేం తీసిన ‘సప్తస్వరాలు’ చిత్రం ఫ్లాప్ కావటంతో, నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ‘మీ ప్రేమే నన్ను కాపాడుతుంది. అమ్మని బాగా చూసుకో రాజా’ అన్నారు. 1971 దాకా హీరోగా చేశారు. ‘గుండెలు తీసిన మొనగాడు’ నాన్న హీరోగా చేసిన ఆఖరి సినిమా. ‘నేరము – శిక్ష’ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. నవంబరు 16వ తేదీన నాన్నగారి పుట్టినరోజు. ఆ రోజు నాన్నగారు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే నాన్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు న్నారు. అక్కడ కొద్దిసేపు ఉండి, ఇంటికి బయలుదేరుతూ, అందరి ఎదుట, ‘నాన్నా రాజా! ఇంక నాకు ఈ కర్ర అవసరం లేదు. నువ్వే నా కుడిభుజం. అమ్మని జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పారు. చివరికి అదే నిజం చేస్తూ ఏడాదికల్లా నాన్న కన్ను మూశారు. ప్రతాప్: నాన్నగారి స్వస్థలం తెలంగాణలోని కోదాడ. రజాకార్ మూవ్మెంట్ టైమ్‌లో అక్కడనుంచి చెన్నై మకాం మార్చేశారు. నాన్నగారిది ప్రేమ వివాహం. అమ్మది జగ్గయ్యపేట. అమ్మ మీద నాన్నకు విపరీతమైన అభిమానం. అమ్మ చేతి కాఫీతోనే నాన్న నిద్ర నుంచి లేచేవారు. ఇంటి వ్యవహారమంతా అమ్మే చూసుకునేది. అమ్మ సింపుల్‌గా ఉండటమే కాదు, మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఇంట్లో రెండు కార్లు ఉన్నా రిక్షాలోనే వెళ్లేది. మేం కూడా సైకిల్ లేదా బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఒకసారి షూటింగ్‌కి వెళ్లిపోతే వారం పదిరోజుల దాకా ఆయనను చూడటానికి కుదిరేది కాదు. ప్రతి రోజూ మూడు షిఫ్టులు పనిచేసేవారు. సంవత్సరానికి పన్నెండు సినిమాలు చేయాలనుకునేవారు. 1960 – 1971 మధ్యకాలంలో ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఆయన కాల్షీట్లు చూడటానికి ఇద్దరు సెక్రటరీలను పెట్టుకునేంత! రోజుకి మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. మా చిన్నతనంలో తిరుపతి వెళ్లినప్పుడు నాకు గుండు కొట్టించారు. నేను కుదురుగా ఉండకపోవటంతో కొలనులోకి దొర్లిపోయాను. నాన్నగారు వెంటనే చూడటంతో బతికి బయటపడ్డాను. మద్రాసులో సినిమా వాళ్ల పిల్లలంతా కేసరయ్య స్కూల్లోనే చదివేవారు. మేం కూడా అక్కడే చదువుకున్నాం. ఆ తరవాత రామకృష్ణ మిషన్‌లో చదివాం. కాలేజీలో నా అంతట నేనే చేరాను. తమ్ముళ్లని మాత్రం నాన్న చేర్పించారు. 1957లో అనుకుంటాను. పెళ్లికి వెళ్లి, తిరుపతి నుంచి తిరిగి వస్తున్నాం. అప్పుడు నాకు ఏడేళ్లు. ముందు సీట్లో నాన్న ఒళ్లో పడుకున్నాను. ఆయన నా మెడ మీద చేయి వేసి పడుకోబెట్టుకున్నారు. బాగా వాన పడుతుండటంతో రాణీ పేట దగ్గర కారు చక్రం స్కిడ్ కావటంతో యాక్సిడెంట్ అయ్యింది. కుడివైపు చెట్టుకి కొట్టుకుని వెనక్కి వచ్చి మళ్లీ కొట్టుకుంది. అద్దాల ముక్కలు తలలో పడ్డాయి. సరిగ్గా అప్పుడు నాన్న నన్ను కిందకి తోసేసి, తను కూడా దూకేశారు. డ్రైవర్ జంప్ చేశాడు. చెట్టు కొట్టుకోవటం వల్ల, ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారు కండిషన్ చూసినవారంతా మేం ఎలా బతికి బయటపడ్డామా అనుకున్నారు. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల బతికాం అని నాన్న చెప్పేవారు. 1968లో సప్తస్వరాలు సినిమా స్వయంగా నిర్మించి అందులో నటించారు. ఆ సినిమాకి కావలసిన వస్తువులు కొంటూ నాకు 150 రూపాయలు పెట్టి సీకో వాచీ కొన్నారు. ఆ వాచీ చాలా సంవత్సరాలు వాడాను, అది పాడైపోయాక మళ్లీ చాలాకాలం వాచీ కొనుక్కోలేదు. 1974లో సింగపూరు వెళ్లినప్పుడు వాచీ కొని తెచ్చుకున్నాను. గడియారం కాలాన్ని ఎంత ముందుకు తోస్తున్నా మేము మాత్రం ఎప్పుడూ నాన్న జ్ఞాపకాల్లోనే ఉంటాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ అప్పటి నుంచి మాతోనే... నేను మొదటి నుంచి నాన్నగారి ప్రొడక్షన్స్ చూసుకునేవాడిని. ఎక్కడా ఉద్యోగం చేయలేదు. చెన్నైలో ఉన్నన్ని రోజులు నాన్నగారు మా దగ్గరే ఉండేవారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు. నాకు ముగ్గురు అబ్బాయిలు. సాయికిరణ్, కార్తిక్, గుణరంజన్. ముగ్గురూ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా భార్య లక్ష్మి. మా అత్తవారు మేము ఇరుగుపొరుగు వారం. నాన్నగారితో వియ్యమందుకున్నాక, మా మావగారు పి. చంద్రశేఖర్ మా ప్రొడక్షన్లో భాగస్వాములయ్యారు. – ప్రతాప్ నా దగ్గరే... నేను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. అమ్మ హైమవతి నా దగ్గరే ఉంది. నా భార్య ఉషశ్రీ. వాళ్లది తణుకు. మా అబ్బాయి సాయి ఈశ్వర్ బిటెక్ చదువుతున్నాడు. అమ్మాయి ప్రియాంకకు వివాహం అయ్యింది. అల్లుడు మెరైన్‌లో పనిచేస్తున్నాడు. – రాజా -
అలా చేస్తే విద్యార్థులను బదిలీ చేయాలి
సాక్షి, విజయవాడ: పాఠశాలల్లో ఓవైపు తనిఖీ చేస్తూనే మరోవైపు ఆయా స్కూళ్ల సమాచారాన్ని ఆన్లైన్ చేస్తామని పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు అన్నారు. ప్రతి జిల్లాలో వీలైనన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాకు 20 మంది బోధనేతర అధికార సిబ్బంది కావాలని కోరామన్నారు. పట్టణాలు, నగరపాలక సంస్థల, మేజర్ పంచాయతీలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్యాబోధన, ఫీజుల వసూళ్లు అన్నింటినీ పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకోసం ఓ పోర్టల్ ఏర్పాటు చేసి పాఠశాలల సమాచారం ఆన్లైన్ చేస్తామన్నారు. అలా చేస్తే విద్యార్థుల బదిలీ ప్రభుత్వం దిశ చట్టం ఏర్పాటు చేసినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చైర్మన్ కాంతారావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించడం నేర్పేలా పాఠాల రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. అంతేకాక విద్యార్థుల సామాజిక నేపథ్యం గురించి తెలుసుకుంటామన్నారు. లింగబేధంపై చిన్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. అఘాయిత్యాలకు పాల్పడే వారికి చాలా పెద్ద శిక్షలుంటాయని విద్యార్థులను తెలియజేయాలన్నారు. విద్యార్థులు ఇలాంటివి చేస్తే వారిని వేరే పాఠశాలకు బదిలీ చేయాలని సూచించారు. భారీగా ఫీజులు వసూలు చేసే పాఠశాలల సమాచారాన్ని అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టేందుకు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. టీఆర్ఎస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రేపు ఉదయం టీఆర్ఎస్లో చేరబోతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీలు, గిరిజనుల సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు. పోడు, గిరిజన భూములకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని.. కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని రేగా కాంతారావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుద్దామనుకున్న కాంగ్రెస్‌కు.. ఇద్దరి ఎమ్మెల్యేల రాజీనామాతో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. -
మహానటి చిత్రం చూసిన తరువాత..!
తమిళసినిమా: ఇప్పుడు సినీరంగంలోబయోపిక్ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఒక పక్క దివంగత దివంగత నేత వైఎస్ఆర్ జీవిత చరిత్రతో యాత్ర అనే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర కథానాయకుడు పేరుతో తెరకెక్కుతోంది. ఆయన బయోపిక్‌తోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో చిత్రానికి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఎంజీఆర్ జీవిత చరిత్ర నిర్మాణంలో ఉంది. జయలలిత బయోపిక్ కోసం ముగ్గురు, నలుగురు దర్శకులు రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి సమకాలీన నటుడు, కత్తి వీరుడుగా పేరు గాంచిన దివంగత నటుడు కాంతారావు జీవిత చరిత్రను వెండితెరకెక్కించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీన్ని చంద్రాధిత్య ఫిలిం ఫ్యాక్టరి పతాకంపై పీసీ. ఆదిత్య స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఈయన కాంతారావు ప్రధాన పాత్రలో నటించిన పిల్లలు కాదు పిడుగులు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 10 చిత్రాలు చేశారు. అందులో ది స్పైసెస్ ఆఫ్ లిబర్టీ అనే ఆంగ్ల చిత్రం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథతో కూడిన వైఎస్ ప్రజాప్రస్థానం వంటి చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. అంతే కాదు 100 రోజుల్లో 100 లఘు చిత్రాలు చేసి లిమ్కా బుక్‌లోకి ఎక్కిన దర్శకుడీయన. తొలి చిత్రంతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్న పీసీ.ఆదిత్యకు కాంతారావుతో సుమారు 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఆ అభిమానంతోనే ఆయన బయోపిక్‌ను నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో రాకుమారుడు పేరుతో తెరకెక్కించనున్నట్లు ఆయన సాక్షికి తెలిపారు. ఆ వివరాలు ఆయన తెలియజేస్తూ కాంతారావు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సమాకాలీన నటుడన్నారు. అలాంటి గొప్ప నటుడి జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయన్నారు. కాంతారావు జీవితం సమాజానికి మంచి సందేశానిచ్చేదిగా ఉంటుందన్నారు. కాంతారావు రాసుకున్న ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఆయన సినీరంగ ప్రవేశం నుంచి, తుది శ్వాస విడిచినంత వరకూ చిత్ర కథ నడుస్తుందన్నారు. కాంతారావు జీవితంలోని వెలుగు చీకటిలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాకుమారుడు పేరుతో తెరకెక్కించనున్న ఇందులో ఆయన సమకాలీన నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పాటు తమిళనటుడ ఎంజీఆర్, నటి రాజశ్రీ,కృష్ణకుమారి లాంటి ప్రముఖ నటుల పాత్రలు చోటు చేసుకుంటాయని తెలిపారు. మహానటి చిత్రం చూసిన తరువాత కాంతారావు బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన తనకు కలిగిందన్నారు. వంద చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన కాంతారావు, ఆ తరువాత చిత్ర నిర్మాణం చేపట్టి అపజయాల పాలయ్యారన్నారు. ఆయన వారసులు చేయాల్సిన ఈ చిత్రాన్ని ఒక దత్తపుత్రుడిగా తాను మహా యజ్ఞంగా తన భుజస్కంధాలపై వేసుకున్నానని అన్నారు. తెలుగు సినిమాకు రామారావు ,నాగేశ్వరరావు రెండు కళ్లు అయితే మధ్యలో తిలకం కాంతారావు అని ప్రఖ్యాత రచయిత సి.నారాయణ రెడ్డి ఒక సందర్భంలో అన్నారన్నారు. అలాంటి నటుడు కాంతారావు బయోపిక్‌ను ఆయన జయంతి రోజు ఈ నెల 16న చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఆయన వర్ధంతి సందర్భంగా మార్చి 22న తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందులో కాంతారావు పాత్రకు అఖిల్సన్ని అనే నవ నటుడిని పరిచయం చేస్తున్నామని, అదేవిధంగా ఎన్టీఆర్ పాత్రకు భాస్కర్ అనే నటుడిని, ఎంజీఆర్ పాత్రకు చెన్నైకి చెందిన సురేశ్‌కుమార్ అనే నటుడిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏఎన్ఆర్ పాత్రకు నటుడిని ఎంపిక చేయాల్సి ఉందని చెప్పారు. -
కాంతారావు పేరిట స్మారక మందిరం
బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: అలనాటి సినీ హీరో టీఎల్ కాంతారావు పేరిట స్మారక మంది రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి చేసింది. కాంతారావు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన పేరిట అవార్డులను ప్రదా నం చేయాలని కోరింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కాంతారావు వర్ధంతి సభలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతా సాంబమూర్తి, డా.జి.మనోహర్ రెడ్డి, సీవీఎల్ నర్సింహారావు, మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీరాజా, సినీనటుడు సురేశ్ పాల్గొన్నారు. కాంతారావు కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాంతారావు కుటుంబానికి తగిన సహా య సహకారాలు అందేలా చూస్తామని లక్ష్మణ్ తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున కాంతారావు కుటుంబాన్ని ఆదు కుంటామని శివాజీరాజా చెప్పారు. -
కొడుకులే కాలయములై..
మద్యం మత్తు మానవత్వాన్ని మంటగలిపింది.అనుబంధం.. ఆత్మీయతలనే కాదు.. పేగుబంధాల్ని సైతం తెంపేసింది. కొడుకు కఠినాత్ముడైనా.. ఇద్దరు భార్యలూ అతన్ని వదిలేసినా.. మమకారాన్ని చంపుకోలేక అతడి ఆలనాపాలనా చూస్తూ వేళకు అన్నం పెడుతున్న తల్లిని కొడుకే పొట్టనపెట్టుకున్నాడు. మరో ఘటనలో తాగి వచ్చాడన్న కారణంగా తండ్రిని కన్నకొడుకు కర్రతో కొట్టి చంపేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు మనసున్న ప్రతివారిని కంటతడి పెట్టించాయి. ఆరవలిల(అత్తిలి) : మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడన్న కారణంతో కన్న తండ్రిని తనయుడే కర్రతో కొట్టి చంపిన ఘటన అత్తిలి మండలం ఆరవల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఆరవల్లి ఎస్సీ కాలనీకి చెందిన మేడిద కాంతారావు (46) రోజూ తాగివచ్చి తరచూ కుటుంబ సభ్యులతో ఘర్షణ పడుతుంటాడు. ఎప్పటిలా శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన కాంతారావు తన రెండో కుమారుడైన నాగబాబు(20)తో గొడవ పడ్డాడు. ఓ దశలో కత్తితో కుమారుడిపై దాడి చేశాడు. దీంతో నాగబాబు కత్తులకు పదునుపెట్టే కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతారావు అక్కడికక్కడే మృతి చెందాడు. కాంతారావు కొబ్బరి కాయలు దింపు, ఒలుపు పనులకు వెళుతుండగా, కుమారుడు వ్యవసాయ పనులకు వెళుతుంటాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుని భార్య కాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. దొండపూడి (గోపాలపురం) :కన్నతల్లిని అతికిరాతకంగా చంపిన తనయుడి ఉదంతమిది. గోపాలపురం మండలం దొండపూడిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలవరం సీఐ జీఆర్ఆర్ మోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నారుు. దొండపూడికి చెందిన దోలి వీర్రాజుకు రెండు వివాహాలయ్యూరుు. మొదటి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఇద్దరు సంతానం. అతడి దుందుడుకు వైఖరిని తట్టుకోలేక వారిద్దరూ అతన్ని వదిలేసి పిల్లలలో వేర్వేరుగా బతుకుతున్నారు. వీర్రాజు దొండపూడి గ్రామంలో సిమెంట్ వరలు, దిమ్మెలు తయూరు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో తల్లి సుబ్బలక్ష్మి (60) బాగోగులు చూస్తోంది. వేరే ఇంట్లో తన బతుకు తాను బతుకుతున్న సుబ్బలక్ష్మి రోజూ వంటచేసి మధ్యాహ్నం, సాయంత్రం క్యారేజీలో భోజనం తీసుకెళ్లి కుమారుడికి పెడుతోంది. మద్యానికి బానిసైన వీర్రాజు తరచూ ఆమెనూ దూషిస్తూ, చీటికిమాటికీ విరుచుకుపడుతుండేవాడు. ఇదిలావుండగా, సుబ్బలక్ష్మి పెద్దకుమారుడు, వీర్రాజుకు అన్న అరుున వెంకటేశు కుమార్తెకు ఈనెల 15న వివాహమైంది. అన్నదమ్ములిద్దరికీ మాటలు లేకపోవడంతో అన్న కుమార్తె వివాహానికి వెళ్లొద్దని తల్లి సుబ్బలక్ష్మికి వీర్రాజు హుకుం జారీ చేశాడు. అతడి స్వభావం గురించి తెలిసిన తల్లి సుబ్బలక్ష్మి ఆ మాటలను పట్టించుకోకుండా మనుమరాలి పెళ్లికి వెళ్లింది. శనివారం రాత్రి ఎప్పటిలా వీర్రాజుకు భోజనం తీసుకెళ్లింది. తాగిన మైకంలో ఉన్న వీర్రాజు ఆ పెళ్లికి ఎందుకు వెళ్లావంటూ ఒక్క ఉదుటున తల్లిపై విరుచుకుపడ్డాడు. తల్లి జట్టుపట్టుకుని ఆమె తలను సిమెంట్ అరుగుకు వేసి పదేపదే బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై వీఆర్వో వి.వల్లభాచార్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడు వీర్రాజును ఎస్సై డి.హరికృష్ణ అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
భీమారం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ రేంజ్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐజీ కాంతారావు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రేంజ్ పరిధిలోని వరంగల్ అర్బన్, రూరల్‌తోపాటు ఖమ్మం జిల్లాలో 24,315 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వరంగల్(అర్బన్)లో 3,648, వరంగల్(రూరల్)లో 6,580, ఖమ్మం జిల్లాలో 8,174 మంది పోలీస్ సిబ్బందితో పాటు 2,412 మంది హోంగార్డులు, 2,510 మంది ఇతర శాఖల సిబ్బంది, 991 మంది డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులను నియమించామన్నారు. వరంగల్ రేంజ్ పరిధిలో 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి అధికారితో పాటు నలుగురి నుంచి ఆరుగురు సీఐలు, ఎనిమిది నుంచి పన్నెండు మంది వరకు ఎస్సైలతో పాటు మరో 1,100 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వరంగల్(అర్బన్), వరంగల్(రూరల్), ఖమ్మం పరిధిలో 362 కేసులు నమోదైనట్లు వివరించారు. అలాగే ఎన్నికల నిబంధనల మేరకు రేంజ్ పరిధిలో రూ.5.50కోట్లు పట్టుకున్నట్లు డీఐజీ తెలిపారు. అలాగే 989 ఫుల్‌బాటిళ్లు, 1,303 హాఫ్బాటిళ్లు, 26,945 క్వార్టర్లు, 4,884 బీర్లు, 113 హాఫ్బీర్లు, 1,343 (90ఎంఎల్ నిబ్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. వీటితోపాటు 12,574 లీటర్ల గుడుంబా, లక్ష కిలోల బెల్లం, 22.501 కిలోల పటిక, 2.77 కిలోల బం గారం, 4.5 కిలోల వెండిని పట్టుకున్నట్లు చెప్పారు. 23,241 మంది బైండోవర్... ఎన్నికలను పురస్కరించుకుని ముందు జాగ్రత్త కింద 23,241 మందిని బైండోవర్ చేసినట్లు డీఐజీ వివరించారు. ఇందులో వరంగల్(రూరల్)లో 5,486 మంది, వరంగల్(అర్బన్)లో 4,312, ఖమ్మంలో 13,443 మందిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి, ట్రెయినీ డీఎస్పీ శీరిష రాఘవేంద్ర, సీఐలు దేవేందర్‌రెడ్డి, సదయ్య, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గీత దాటారు..
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల కోడ్ కూసినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వారు గీత దాటారు. కోడ్‌కు తాము అతీతులమంటూ ఆయా నియోకజవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ‘రాజకీయం’ చేశారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క తమ నియోజవర్గాల్లో హడావిడిగా పనులకు ప్రారంభోత్సవాలు చేసి కోడ్ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గమైన మధిర మండలంలో ఉదయం నుంచి రాత్రి వరకు పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పరంపర కొనసాగింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే మండలంలోని నిదానపురం, జూలిముడి, మడుపల్లి, చిలుకూరు గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఖాజీపురంలో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. రాత్రి 7 గంటల సమయంలో ఇదే మండలం నాగవరప్పాడు గ్రామంలో రూ.7 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నిధులతో వైరా మండలం పుణ్యపురంలో రూ.3 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ పుల్లమ్మతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఇక పినపాక మండలం కరకగూడెం పంచాయతీ రాయన్నపేట -1, రాయన్నపేట -2 గ్రామాల్లో రూ. 8 లక్షలతో చేపట్టాల్సిన పనులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు కోడ్ అమల్లోకి వచ్చాకే శంకుస్థాపన చేశారు. ఇంత జరుగుతున్నా, కోడ్ అమల్లో ఉందని తెలిసినా అధికారులు తమకేమీ తెలియదన్నట్లుగా ఎమ్మెల్యేల ఆదేశాలకు జీహుజూర్ అంటూ కళ్లుమూసుకోవడం గమనార్హం. తుమ్మలపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు.. ఖమ్మం పట్టణంలో రూ. 11 కోట్లతో నిర్మించిన ప్రకాశ్‌నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా .. బ్రిడ్జిని ప్రారంభించి కోడ్ ఉల్లంఘించారని నేరుగా ఎన్నికల కమిషనర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు ఆర్వీఎస్ఎన్ (కూల్‌హోం) ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాకుండా ఫ్యాక్స్ ద్వారా కమిషనర్‌కు తుమ్మలపై ఫిర్యాదు లేఖ పంపినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఈ విషయమై విచారణ జరిపి.. వాస్తవమని తేలితే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ప్రజాప్రతినిధులు హడావిడిగా పనులకు శంకుస్థాపనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లకు గాలం వేసేందుకే రూ. లక్షల పనులకు ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో శంకుస్థాపన చేశారని పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు సమస్యల పట్ల స్పందించని ఎమ్మెల్యేలు.. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయడంపై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. స్పష్టంగా చెప్పినా... రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయయే నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉదయం 10.30 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా(మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలతో పాటు జరగని ప్రాంతాలలోనూ) ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. అయినా ఇదేమీ పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఉదయం నుంచి రాత్రి వరకు తమ నియోకజవర్గాలలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు, నూతనంగా చేపట్టే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంలో పోటీ పడ్డారు. ఎన్నికల కోడ్ వెలువడిన అనంతరం పౌరులంతా సమానమే అని చట్టం చెబుతున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం వాటిని తోసిరాజని తమ ‘పనులను’ ఆదరబాదరగా చక్కబెట్టడం గమనార్హం. -
క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్
డీఐజీ కాంతారావు ముగిసిన ఏపీఎస్పీ నాలుగో బెటాలియన్ వార్షిక క్రీడలు మామునూరు, న్యూస్‌లైన్ : క్రీడల్లో రాణించే పోలీసులకు మంచి భవిష్యత్ ఉంటుందని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు అన్నారు. మామునూరు ఏపీఎస్పీ నాలుగో బెటాలియన్‌లో మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక క్రీడలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా డీఐజీ కాంతారావు, కమాండెంట్ నటరాజు పోలీసు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురయ్యే పోలీసులు క్రీడలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పోలీస్‌శాఖ క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. పోలీసు వ్యవస్థలో కీలకమైన కానిస్టేబుళ్ల విధులతోపాటు క్రీడల్లో రాణిస్తూ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. నాలుగో బె టాలియన్ కమాండెంట్ నటరాజు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని చెప్పారు. పోలీసులు ప్రతి రోజు కొంత సమయం క్రీడలకు కేటాయించి దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం కానిస్టేబుళ్లు, జవహర్ నవోదయ విద్యాలయ, పాత్ ఫైండర్ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా, కబడ్డీ, వాలీబాల్, పరుగు పందెం, టగ్‌ఆఫ్‌వార్‌లో గెలుపొందిన వారికి డీఐజీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, ఏజీపీ నారాయణ, డీఎస్పీలు రాజేశ్వర్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఆర్ఎస్సైలు నహీమ్, నున్న రాజు, శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలి
=కలెక్టర్ కిషన్ =‘కాకతీయుల వంశరహస్యం’ పుస్తకావిష్కరణ సుబేదారి, న్యూస్‌లైన్ : కాకతీయుల కాలంలో మానవవిలువలు ఫరిడవిల్లాయని, మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలని కలెక్టర్ కిషన్ ఆకాంక్షించారు. డాక్టర్ తక్కెళ్ల బాలరాజు రాసిన కాకతీయుల వంశర హస్యం పుస్తకాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 పుస్తకాల ఆవిష్కరణ జరిగిందని, కాకతీయుల గూర్చి ఏది తెలిసినా... రాయాలని మేధావులు, చరిత్రకారులను కోరారు. చరిత్రను భద్రపరచడం ద్వారా భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మాట్లాడుతూ కాకతీయుల చరిత్రను ప్రచురించడం సాహోసపేతమైన నిర్ణయం అన్నారు. కాకతీయుల మూలాలపై పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్ ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ పరిశోధన విమర్శకు గురవుతుందన్నారు. అయితే పరిశోధనలో ఉన్న వాస్తవాలను గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాకతీయులు శూద్రులని, శైవ మతాన్ని ఆచరించారని పేర్కొన్నారు. కార్యక్రమానికి కళాపబ్లికేషన్స్ సంపాదకుడు, సీనియర్ జర్నలిస్ట్ బండి రవీందర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్,సురేంద్రకరణ్ పాల్గొన్నారు.