Actor Nellore Kantha Rao Wife Nirmala Reveals How Her Husband Died In An Latest Interview - Sakshi
Sakshi News home page

Nellore Kantha Rao Wife Interview: నా భర్త అలా చనిపోతాడనుకోలేదు.. నెల్లూరు కాంతారావు భార్య

Published Sat, Jul 22 2023 6:57 PM | Last Updated on Mon, Jul 24 2023 12:16 PM

Actor Nellore Kantha Rao Wife Nirmala Reveals How Her Husband Died In An Latest Interview - Sakshi

అలనాటి వెండితెర చిత్రాల్లో నటుడిగా, పహిల్వాన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు నెల్లూరు కాంతారావు. అయితే ఓ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఆయన నిండు ప్రాణాలు పోయాయి. తాజాగా కాంతారావు సతీమణి నిర్మల(80) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మాది ఉమ్మడి కుటుంబం. కాంతారావుకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేది. తనకు ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్సర్‌సైజ్‌ చేసేవాడు. మాకు కనకమహల్‌ అని థియేటర్‌ ఉండేది. దాన్ని కూడా ఆయనే బాగా చూసుకునేవాడు.

ముగ్గురిని చంపేశారంటూ పుకారు
ఓ సినిమా రిలీజైనప్పుడు ముగ్గురు పిల్లలు క్యూలైన్‌లో నిలబడకుండా ముందుకు వెళ్లారు. అక్కడున్న వాళ్ల ఆపుతుంటే వీళ్లు ఇంకా తిడుతూ రెచ్చిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన కాంతారావు కోపంతో వాళ్లను చెంప మీద ఒక్కటిచ్చాడు. వాళ్లు కింద పడటంతో ఏదైనా అయ్యిందేమోనని క్యాంటీన్‌కు తీసుకెళ్లి సోడా తాగించి మరీ సారీ చెప్పాడు. వాళ్లు కూడా తప్పు మాదే అని తిరిగి సారీ చెప్పారు. కానీ కాసేపటికి పోలీసులు వచ్చి ముగ్గురిని చంపి బాత్రూమ్‌లో వేశారంట అని అడిగారు. ఆ పిల్లలేమో మాకు తెలియకుండా అక్కడి నుంచి జారుకుని ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. అసలేం జరిగిందనేది బయటకు చెప్పడం లేదు.

కాంతారావు అరెస్ట్‌
ఇక కాంతారావు విద్యార్థులను హత్య చేశాడని ప్రచారం జరిగింది. విద్యార్థులు పెట్రోల్‌ తీసుకుని థియేటర్‌ దగ్గరకు వచ్చారు. రాళ్లు తీసుకుని థియేటర్‌ అద్దాలు పగలగొట్టారు. ఏం చేయాలో అర్థం కాక కాంతారావు అక్కడి నుంచి గోడ దూకి పారిపోయాడు. ఆయన్ను అరెస్ట్‌ చేసేవరకు రచ్చరచ్చ చేశారు. తర్వాత ఎలాగో బయటకు వచ్చాడు. ఆయన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. కానీ మేము చేసిన ఓ పని వల్ల ఆయన ప్రాణమే పోయింది.

పిల్లల కోసం ఆస్పత్రికి
అసలేమైందంటే.. మా పెదనాన్న కొడుక్కి పిల్లలు లేకపోతే మద్రాసులో ఓ డాక్టర్‌ దగ్గరకు వెళ్లారు. ఆయన ఇచ్చిన మందులతో వారికి పిల్లలు పుట్టారు. ఈయన ఓ నలుగురిని తీసుకెళ్తే వారికి కూడా పుట్టారు. మమ్మల్ని కూడా వెళ్లమని చెప్తూ ఉండేవాడు. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత మేము కూడా వెళ్లాం. అన్ని టెస్టులు చేశారు. మందులిచ్చారు, మళ్లీ రమ్మన్నారు. ఈసారి వెళ్లినప్పుడు కాంతారావుకు ఒక ఆపరేషన్‌ చేస్తామన్నారు.

మత్తుమందు వికటించి
అప్పుడు ఓ సినిమా చేస్తున్నందున అది పూర్తయిపోయాక వస్తానని చెప్పాడు. సినిమా రిలీజవగానే ఆస్పత్రికి వెళ్లాం. ఆపరేషన్‌ చేసేందుకు క్లోరోఫామ్‌(మత్తుమందు) ఇచ్చారు. ఈయన పహిల్వాన్‌ కావడంతో ఆక్సిజన్‌ మాస్క్‌లాంటివి పీకేస్తాడేమోనని బెడ్‌కు కట్టేశారు. కానీ మత్తు మందు వికటించి ఆయన చనిపోయారు. నా భర్త అలా చనిపోతాడని అనుకోలేదు' అని చెప్పుకొచ్చింది నిర్మల.

చదవండి: చిరంజీవి చెడామడా తిట్టేశాడు: కోట శ్రీనివాసరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement