
సీనియర్ నటుడు సుమన్‌కు అరుదైన పురస్కారం దక్కింది. ఆయనకు కాంతారావు శత జయంతి పురస్కారం అందించనున్నట్లు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అగ్ర హీరోలుగా వెలుగుతున్న సమయంలోనే వారితో సమానంగా హీరోగా కాంతారావు పేరు సంపాదించారని తమ్మా రెడ్డి భరద్వాజ అన్నారు. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హీరోగా నిలదొక్కుకున్నా తర్వాత ఆయన సహాయ పాత్రల్లో నటించారని తెలిపారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. 'కాంతా రావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ సుందరీ సుబ్బారావులో ఆయనకు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మరో దర్శకుడు పీసీ ఆదిత్య మాట్లాడుతూ.. 'కాంతారావు బయో పిక్ తీసేందుకు వారి స్వ గ్రామం కోదాడ మండలం గుదిబండ వెళ్లి వచ్చినట్లు వివరించారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, కాంతారావు కుమారుడు, నటుడు రాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment