కాంతారావు పేరిట స్మారక మందిరం
బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: అలనాటి సినీ హీరో టీఎల్ కాంతారావు పేరిట స్మారక మంది రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి చేసింది. కాంతారావు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన పేరిట అవార్డులను ప్రదా నం చేయాలని కోరింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కాంతారావు వర్ధంతి సభలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతా సాంబమూర్తి, డా.జి.మనోహర్ రెడ్డి, సీవీఎల్ నర్సింహారావు, మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీరాజా, సినీనటుడు సురేశ్ పాల్గొన్నారు.
కాంతారావు కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాంతారావు కుటుంబానికి తగిన సహా య సహకారాలు అందేలా చూస్తామని లక్ష్మణ్ తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున కాంతారావు కుటుంబాన్ని ఆదు కుంటామని శివాజీరాజా చెప్పారు.