
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సినీనటుడు బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర సినిమా సెల్ డిమాండ్ చేసింది. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు సెల్ కన్వీనర్ సీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బకాయిపడ్డ మొత్తాన్ని చెల్లించేలా ఎన్టీఆర్ స్టూడియోను ఆదేశించాలని, చెల్లించని పక్షంలో దాన్ని జప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment