=కలెక్టర్ కిషన్
=‘కాకతీయుల వంశరహస్యం’ పుస్తకావిష్కరణ
సుబేదారి, న్యూస్‌లైన్ : కాకతీయుల కాలంలో మానవవిలువలు ఫరిడవిల్లాయని, మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలని కలెక్టర్ కిషన్ ఆకాంక్షించారు. డాక్టర్ తక్కెళ్ల బాలరాజు రాసిన కాకతీయుల వంశర హస్యం పుస్తకాన్ని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 పుస్తకాల ఆవిష్కరణ జరిగిందని, కాకతీయుల గూర్చి ఏది తెలిసినా... రాయాలని మేధావులు, చరిత్రకారులను కోరారు.
చరిత్రను భద్రపరచడం ద్వారా భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మాట్లాడుతూ కాకతీయుల చరిత్రను ప్రచురించడం సాహోసపేతమైన నిర్ణయం అన్నారు. కాకతీయుల మూలాలపై పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్ ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ పరిశోధన విమర్శకు గురవుతుందన్నారు.
అయితే పరిశోధనలో ఉన్న వాస్తవాలను గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాకతీయులు శూద్రులని, శైవ మతాన్ని ఆచరించారని పేర్కొన్నారు. కార్యక్రమానికి కళాపబ్లికేషన్స్ సంపాదకుడు, సీనియర్ జర్నలిస్ట్ బండి రవీందర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్,సురేంద్రకరణ్ పాల్గొన్నారు.
మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలి
Published Sun, Dec 8 2013 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement