Conference Hall
-
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
సెంటినరీకాలనీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సెంటినరీకాలనీలోని రాణీరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించే యోగా కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఆర్జీ-3, ఏపీఏ జీఎంలు ఎంఎస్ వెంకట్రామయ్య, చం ద్రశేఖర్ కోరారు. స్థానిక జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవారం మాట్లాడా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న మధ్యాహ్నం 3 గంటలకు సేవా భవనం నుంచి క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహిస్తామని, 4 గంటలకు మెగా యోగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, పాఠశాలల విద్యార్థులు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. యైటింక్లయిన్‌కాలనీ :అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యైటింక్లయిన్‌కాలనీలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్జీ-2 జీఎం విజయపాల్‌రెడ్డి తెలిపారు. జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉ దయం 7 నుంచి 8గంటల వరకు సీఈఆర్ క్లబ్లో యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి సీఈఆర్ క్లబ్ వరకు ర్యాలీ ఉం టుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా డెరైక్టర్ మనోహర్‌రావు హాజరవుతారని చెప్పారు. అనంతరం సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన మల్టీజిమ్‌ను డెరైక్టర్ ప్రారంభిస్తారని తెలి పారు. సమావేశంలో అధికారులు రవీందర్, రాజేశ్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 14న నిర్వహించే అంబేడ్కర్ జయంతి వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్ అంబేడ్కర్ జయంతి వేడుకల నిర్వహణపై అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అప్పగించిన భాధ్యతలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. పాత బస్టాండులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమానికి హజరయ్యేవారికి మంచినీరు, మజ్జిగ సరఫరా చేయాలని మున్పిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. స్టేజీ,షామియానాల ఏర్పాటు బాధ్యతను కర్నూలు ఆర్డీఓ రఘుబాబుకు అప్పగించారు. జయంతి రోజు రుణాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని సాంఘికసంక్షేమ శాఖ డీడీని ఆదేశించారు. సమావేశంలో జేసీ-2 రామస్వామి పాల్గొన్నారు. -
జయంతి వేడుకలకు పక్కా ఏర్పాట్లు
► జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జయంతి పై కలెక్టర్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): మహనీయుల జయంతి వేడుకలను పండుగలా నిర్వహించాలని, ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని దళిత సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ .. కాన్పరెన్స్ హాల్లో దళిత, యువజన, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. మహనీయల జయంతి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలన్నారు. ఇందు కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీని ఆదేశించారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌లో పరిష్కరించిన అంశాలపై విజయగాథలను సభకు తీసుకరావాలన్నారు. ప్రతి నాయకుడు కనీసం 5 మంది కార్యకర్తలను సమావేశానికి తీసుకరావాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ర్యాలీ నిర్వహించడం లేదని చెప్పిన కలెక్టర్.. సభను ఉదయం 9గంటలకే ప్రారంభిస్తామన్నారు. 8.45కే అందరూ సభ నిర్వహించే 5 రోడ్ల కూడలికి చేరకోవాలన్నారు. 12 గంటలకు ఉపన్యాసాలు ముగించిన తర్వాత బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జేసీ, జేసీ-2 తో సమావేశమై జయంతి వేడుకల ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. వేదికపై ఎవరెవరు కూర్చోవాలో నిర్ణయించాలని, ఈ విషయంలో గత ఏడాది చోటుచేసుకున్న పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ దళితుల అభున్నతికి చేసిన కృషిని సమాజానికి తెలిసే విధంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు తదితరవాటిని ముద్రణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జయంతి వేడుకలను నిర్వహ ణలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా పలువురు దళిత నేతలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఒక్కో అసోసియేషన్ నుంచి ఒకరిని మాత్రమే వేదిక పైకి పిలవాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసీ-2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ప్రసాద్‌రావు, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత, ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
మమేకమై పనిచేస్తా..
కడప అర్బన్ : తాను ప్రజలతో మమేకమై పనిచేస్తానని, తద్వారా శాంతి భద్రతలను పటిష్టం చేస్తామని నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నవీన్ గులాఠి చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన ఛాంబరుకు చేరుకున్నారు. ఏఎస్పీ అడ్మిన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్డి ఆపరేషన్స్ ఏవి రమణ ఎస్పీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమవంతు శ్రమిస్తామన్నారు. మొదట జిల్లా నేరచరిత్రను అధ్యయనం చేస్తామన్నారు. టాఫిక్ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజల శాంతియుతంగా జీవించటానికి తమవంతు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తామన్నారు. పోలీసు, ప్రజల మధ్య సమన్వయం పెంపొందించే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఎన్నికల కారణంగా దోపిడీ, దొంగతనాల రికవరీ సరిగా జరగలేదనేది వాస్తవమేనన్నారు. పోలీసులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలను యదావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రజలు, మీడియా వారు తమకు తెలిసిన సమాచారాన్ని నేరుగా తనకు తెలుపవచ్చన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి ప్రజలకు న్యాయం జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని పోలీసు అధికారులతో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పరిధిలోని అధికారులతో మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారిని గౌరవంగా చూడాలన్నారు. అవినీతికి పాల్పడే పోలీస్ సిబ్బందిని ఎటువంటి పరిస్థితిలలో సహించేది లేదని హెచ్చరించారు. -
మంత్రులపై ఎమ్మెల్యేల కన్నెర్ర
పట్టించుకోవడం లేదని ఆవేదన ఫోన్ చేసినా స్పందన లేదంటూ ఆక్రోశం జిల్లాల పర్యటనలు లేవని మండిపాటు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా మంత్రుల్లో మార్పు రావడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఫోన్లోనూ దొరకడం లేదు. మంత్రులే మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక అధికారులు మా మాటకు విలువ ఇస్తారా’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. విధాన సౌధలోని కాన్ఫరెన్స్ హాలులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ప్రృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రుల తీరును తూర్పారబట్టారు. కన్నడ, సాంృస్కతిక వ్యవహారాలు, ృహ నిర్మాణ, విద్యుత్, ప్రజా పనులు, వ్యవసాయ శాఖల మంత్రులు తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. వీరంతా మద్దతుదారుల మాటకు మాత్రమే విలువనిస్తున్నారని విమర్శించారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేల విన్నపాలపై స్పందించడం లేదన్నారు. జిల్లాల పర్యటనలకు కూడా రావడం లేదని ఆరోపించారు. అభిృద్ధి పనులను సమీక్షించడం లేదన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తమ పనులు ఎలా చేయించుకోవాలని నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. పాలక పార్టీలో ఉండి కూడా పనులు కావడం లేదంటే, నియోజక వర్గం ప్రజల ముందు తమ పరువేం కావాలని వాపోయారు. శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం. ఇబ్రహీంను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడుగా నియమించడంపై అసంృప్తి వ్యక్తం చేశారు. ఇంకొంత కాలం ఆగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యేలను అనునయించడానికి ప్రయత్నించారు. అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నించిన తన వైపు వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున, పార్టీలో ఐక్యత అవసరమని సూచించారు. గురువారం మంత్రులందరూ ఎమ్మెల్యేలకు రెండు గంటల పాటు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను ఆలకించి పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొని ఉంటే, ఉత్తమ ఫలితాలను సాధించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘ఉక్కై’పె సెయిల్ అధికారుల సమీక్ష
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం జిల్లా పర్యటనకు వచ్చిన 8 మందితో కూడిన సెయిల్ నిపుణుల కమిటీ శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదనలో ఉన్న మూడు ప్రాంతాల గురించి కలెక్టర్ శశిధర్ వివరించారు. కొప్పర్తి వద్ద 2927 ఎకరాలు, జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద 10,760 ఎకరాలు, మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద 4386 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఈ ప్రదేశాల సమీపంలో విద్యుత్, నీరు, ఎయిర్‌పోర్టు, రైల్వే లైన్, నేషనల్ హైవే, స్టేట్ హైవేలు ఉన్నాయన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు గల దూరం గురించి తెలిపారు. జిల్లాలోనేకాక చుట్టుప్రక్కల ఉన్న ఖనిజ లభ్యత గురించి సెయిల్ అధికారులు ఆరా తీశారు. వీటి వివరాలు సేకరించి అందజేస్తామని కలెక్టర్ వారికి చెప్పారు. సోమశిల ప్రాజెక్టు ద్వారా నీటి ఏర్పాటుకు 20 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని తెలిపారు. అలాగే అంబవరం, కంబాలదిన్నె ప్రాంతాలకు మైలవరం రిజర్వాయర్ నుంచి నీటి లభ్యత ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సెయిల్ డీజీఎంలు ఆర్కె సిన్హా, ఏ మైథి, బి.సర్కార్, ఎ.కుమార్, కెఎస్ సావర్నీ, ఎస్.సింగ్, అడిషనల్ మేనేజర్లు ఆర్.బెనర్జీ, డి.సాహులతోపాటు జాయింట్ కలెక్టర్ రామారావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.గోపాల్, విధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేడు ఓట్ల లెక్కింపుపై శిక్షణ
నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ ఆఫీసర్, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ జె.శంకరయ్య తెలిపారు. మోతీ లాల్, రామకృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఐదుగురు అధికారులకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. -
జిల్లాలో కోడ్ కూసింది
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వరుస ఎన్నికల షెడ్యూళ్లు విడుదలైన నేపథ్యంలో జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కలెక్టర్ కాంతి లాల్‌దండే ప్రకటించారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు అధికారులుగా ఎంపీడీఓలు వ్యవహరిస్తారని స్పష్టం చేశా రు. కోడ్ ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని, ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా రాజకీయ పక్షాలు ప్రార్థనా మందిరాలు, చర్చిలు, దేవాలయాలు, మసీదులు, ర్యాలీలలో లౌడ్ స్పీకర్లు, సదస్సులు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని వీడియో కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా యంత్రాంగంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారానికి సభలు, సమావేశాలు నిర్వహించే ముందు తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతిలేని మద్యం దుకాణాలను, బెల్టుషాపులను మూసి వేయించాలని ఆదేశించారు. ఈ నెల 5 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, ఫొటోలు, పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మార్చి 5వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ వారీగా వెలువరించాలని సూచించారు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ల వద్ద తాగునీరు, విద్యుత్, వీడియోగ్రఫీకి అవసరమయ్యే ప్లగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఓటర్లు క్యూలో వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది, బందోబస్తు నియామకానికి, ఎన్ని కల సామగ్రి తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రణాళికలను తయారు చేయాలన్నారు. వెబ్కాస్టింగ్కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించాలని వీటికి ఇన్చార్జిగా జిల్లా సంయుక్త కలెక్టర్ వ్యవహరిస్తారని తెలి పారు. ప్రతి రిటర్నింగ్ అధికారి వారి ప్రణాళికలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరచాలని స్పష్టం చేశారు. అనుకూలంగా లేనిపోలింగ్ కేంద్రాల మార్పునకు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. ఈ ఎన్నికలకు ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, డిప్యూటీ ఎలక్టోరల్ అధికారులుగా, తహశీల్దార్లు సహాయ ఎలక్టోరల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. మున్సిపల్ప్రత్యేక అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్‌ను తనిఖీ చేసి ఎన్నికలు ముగిసే వరకు వాటిని పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, సూక్ష్మ పరిశీలకులను, వీడియోగ్రాఫర్లను నియమించుకోవాలని తెలిపారు. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు వర్తించే నియమావళి మున్సిపల్ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22నుం చి 27 వరకు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు. మిగిలిన స్లిప్పులను పోలింగ్ రోజున అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రజిత్‌కుమార్ సైనీ, సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ఎస్. వెంకటరావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎన్.మోహనరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 5వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ రావచ్చని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ తెలిపారు. లబ్ధిదారులకు వ్యక్తిగత పథకాలు అందించడంతో పాటు అంగన్వాడీ, పంచాయతీ, ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం రాత్రి ఒంగోలు డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి యుద్ధప్రాతిపదికన పంపిణీ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా భూసేకరణ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల శ్మశాన భూముల కోసం భూమి సేకరించాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద చెట్టు పట్టాలు మంజూరు చేయాలని చెప్పారు. అక్షర విజయంలో భాగస్వాములు కావాలి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు నిర్వహిస్తున్న ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు భాగస్వాములు కావాలని కోరారు. 6లక్షల 15వేల మంది నిరక్షరాస్యులను గుర్తించామని, ఈనెల 9వ తేదీన జరగనున్న అర్హత పరీక్షకు వారిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 5వ తేదీన మోడల్ పరీక్ష నిర్వహించాలని.. 10వ తేదీన అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని కోరారు. ఫలితాల తరువాత అభినందన సభలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, సీపీఓ మూర్తి, డీఆర్డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ పోలప్ప, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, ఒంగోలు ఆర్డీఓ ఎంఎస్ మురళి పాల్గొన్నారు. -
తాబేలు తలకాయ
సృజనం .‘విపంచి’ ఫోన్ మాట్లాడుతూ, కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టాను. అప్పటికే మిగిలినవాళ్లంతా వచ్చి ఉన్నారు. ఇంకా సమావేశం ప్రారంభం కాలేదు కాబట్టి, ఎవరి దారినవాళ్లు నోట్‌బుక్‌తో, లాప్టాప్తో, కొంతమంది మొబైల్ ఫోన్లతో హడావుడి పడుతున్నారు. వెంటనే నేను నా వై-ఫై ఆన్ చేశాను. ఒకతను నావైపు తిరిగి- ‘‘పాస్వర్డ్ చెప్పరా?’’ అనడిగాడు. నేను చెప్పాను. చాలామంది తమ పర్సనల్ నెట్ నుంచి డిస్ కనెక్ట్ అయి, వై-ఫై మీద పడ్డారు. నిజం చెప్పాలంటే మేమెవరమూ సాఫ్ట్వేర్ కాదు. ఓ చాక్లెట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాం. మూడు నెలలకోసారి జరిగే సమీక్షా సమావేశం అది. ఒకోసారి ఒకో టూరిస్ట్ ప్లేస్‌లో పెడుతుంటారు. మూడు నెలల అమ్మకాలు, అందులో ఎగుడుదిగుడుల గురించి చాలామటుకు తలంటి, అడపాదడపా మెచ్చుకుని ఓ రెండు రోజులు జరిపిస్తారు. మూడో రోజు ఆటవిడుపు - మందు పార్టీ, దగ్గర్లో ఏదన్నా చూడదగ్గ ప్రదేశం ఉంటే చిన్న ట్రిప్. మూడు నెలలకోసారి కలుసుకునే అందరికీ ముఖపరిచయమే. అంతకుమించి ఎక్కువ మాట్లాడుకోం. బాగున్నారా? మీ ఏరియాలో ఎలా ఉన్నాయి సేల్స్?... ఇలాంటి పొడి పలకరింపులు, మధ్యమధ్యలో ‘ఎండ దంచేస్తుంది బాసు- మధ్యాహ్నం లంచ్‌తో పాటు బీర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా- బీరు దాతా సుఖీభవ’ - లాంటి కామెంట్స్. అంతకుమించి మాటలేవీ ఉండవు. నెట్లో మాత్రం రెగ్యులర్ టచ్‌లోనే ఉంటాం. చాలామంది ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఆసక్తికరమైన సూక్తులు, ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం, షేర్ చేసుకోవడం చేస్తుంటాం. సాధారణంగా ఏది అప్లోడ్ చేసినా సెకన్లలో లైక్ చేస్తుంటాం. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి శుభాకాంక్షలు- ఎవరైనా చనిపోతే రిప్ (రెస్ట్ ఇన్ పీస్) చెబుతుంటాం. ఇక్కడికొచ్చేంతవరకూ- ఇంకా చెప్పాలంటే, ప్రయాణంలోని అడుగడుగు సంఘటనలు- (రైలులో వెజ్ బిర్యానీ ఛండాలంగా ఉంది- ఎదురు సీట్లో అమ్మాయి బాగుంది- అర్ధరాత్రి రైలాగినప్పుడు యాక్సిడెంట్ కాదుగా అని భయంతో కూడిన కామెంట్స్) అప్డేట్ చేస్తూనే ఉన్నాం. నేనిప్పుడు సరదాగా ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేసి చూశాను. నా కొలీగ్ ఒకతను, ‘మేము అమ్మే చాక్లెట్స్ తియ్యగా ఉంటాయి. కానీ మేము హాజరైన మీటింగ్ మాత్రం చేదుగా ఉంటుంది’ అని కామెంట్ పోస్ట్ చేశాడు. అప్రయత్నంగానే పెదవుల మీద చిరునవ్వు ముంచుకొచ్చింది. వెంటనే లైక్ క్లిక్ చేశాను. చూస్తుండగానే ఆ కామెంట్‌కి చాలా లైక్స్ వచ్చాయి. అందరమూ తలలు దించుకుని, నెట్ చూసుకుంటూ- ఎవరి దారినవాళ్లు చిరునవ్వులు చిందిస్తున్నాం. ఈలోగా సౌతిండియా రీజనల్ మేనేజర్ కరియప్ప వచ్చాడు. ‘‘మన మార్కెటింగ్ టీమ్ ఒక్కచోట చేరామంటే- గలగలా నవ్వులు... సరదా కబుర్లు ఉంటాయనుకున్నాను. అందరూ ఏంటి ఇంత సీరియస్‌గా ఉన్నారు?’’ అన్నాడు కరియప్ప. ‘‘మాటలన్నీ మార్కెట్లో అమ్మేశాం సార్. మా దగ్గర ఏమీ లేవు’’ అన్నాను. ‘‘అదా సంగతి? చాక్లెట్ల బదులు మాటలు అమ్మిన సంగతి సేల్స్ తగ్గడంలోనే తెలుస్తుంది’’ అని సమావేశం ప్రారంభించాడు కరియప్ప. ఏరియా వారీగా ఒక్కొక్కరికి క్లాసులు, సమాధానాలు నడుస్తున్నాయి. ఈ మీటింగ్స్ రొటీన్ అయిపోవడం వల్ల ఏమో - కరియప్ప తిట్టినా, మనసు మందం అయిపోయి, ఒంటికి పట్టదు. ఎట్టకేలకు అతి భారంగా రెండురోజుల మీటింగ్ ముగిసింది. మూడో రోజు దగ్గర్లో ఉన్న కాఫీ తోటలకి వెళ్లాం. కాఫీ గింజలు అమ్ముతుంటుంటే కొన్నాం. ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాత శివాలయం దర్శించుకున్నాం. యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతాల్లో స్నానం చేశాం. ఫొటోలు దిగాం. వెంటనే అవి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాం. కాఫీ గింజల ఫొటో చూసి- ‘మీ ఇంటికి రేప్పొద్దున కాఫీకి వస్తున్నాం’ అని వాల్ మీద రాసేవాళ్లు కొంతమంది -జలపాతం చూసి, ‘లవ్లీ స్పాట్’, ‘యూ ఆర్ లక్కీ’, ‘నెక్స్ట్ టైమ్ గాళ్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లడం మిస్ కాకు’ అని కామెంట్స్ - రెండు రోజుల టెన్షన్ ఆ కామెంట్స్‌తో పోయింది. మనసుకి తెలీని రిలాక్సేషన్ అనిపించింది. నా కొలీగ్ శేఖర్ మాత్రం, ‘‘కరియప్పగాణ్ని బండబూతులు తిట్టాలని ఉంది. కాని ఫేస్బుక్లో పోస్ట్ చేయలేం’’ అన్నాడు. జలపాతం దగ్గరకి వెళ్లి, ‘‘కరియప్పా! నీయబ్బా’’ అని గట్టిగా అరిచాడు. ఆ కొండ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. నా కొలీగ్స్ చాలామంది నవ్వారు. ఒకరిద్దరు మాత్రం ‘కరియప్ప కూడా ఈ స్పాట్ వచ్చి ఉంటే?’ అని భయపడ్డారు. ఆ ఆలోచన... వచ్చిన కొద్దిపాటి ఆనందాన్ని ఆవిరి చేసింది. అక్కడి నుంచి బయల్దేరాం. మళ్లీ ఎవరి ఊళ్లు వాళ్లు, ఎవరి మార్కెట్లోకి వాళ్లు, ఎవరి టార్గెట్ మీద వాళ్లు. ఎవరెవరి చిన్ని ప్రపంచాల్లోకి వాళ్లం వెళ్లిపోయాం. గాలి పేజీల మీద ఉబుసుపోని కబుర్లు పంచుకుంటున్నాం. ఎప్పుడన్నా, ఎవరన్నా డీలర్ గురించో, స్టాక్ గురించో మాట్లాడుకోవాల్సి వస్తే, ఫోన్లు చేయడం తప్ప మిగిలిన కుశల సమాచారాలన్నీ నెట్లోనే. మళ్లీ మూడు నెలలు అయితే గానీ ముఖాముఖీ కలుసుకోం. అయితే అనుకోకుండానే అందరమూ కలుసుకోవలసి వచ్చింది. విజయవాడలోని ఓ స్టాకిస్ట్ చనిపోయాడు. దాదాపు మా కంపెనీలోని రిప్రజెంటేటివ్లందరికీ ఆయన బాగా తెలిసిన వ్యక్తి. అందువల్ల పెద కర్మకి వెళ్లాల్సి వచ్చింది. విజయవాడ బస్టాండ్‌లో బస్ దిగగానే ఆయన ఇంటి అడ్రెస్ కోసం ఎవరికి ఫోన్ చేయాలా అనుకుంటే బస్టాండ్ ఎదురుగానే ఓ వినైల్ కనపడింది. స్టాకిస్ట్ సత్యనారాయణ ఫొటో - అటూ ఇటూ రెండు దీపాలు. ‘మీరు లేని మా జీవితం చంద్రుడు లేని నల్లటి ఆకాశం - మీ జ్ఞాపకాలు మాకు దారి చూపించే మణి దీపాలు- ఇట్లు ’ అని కింద కుటుంబ సభ్యుల పేర్లు. పెద కర్మ ఫలానా తేదీ ఫలానా గంటలకు ఫలానా చిరునామాలో అనే వివరాలున్నాయి. ఆయన ఇంటికి చేరుకోవడం చాలా సులువయ్యింది. కృష్ణలంకలోని ఆయన ఇంటికి వెళ్తుంటే- రకరకాల వినైల్స్, ఫ్లెక్సీలు కనపడ్డాయి. వాడెవడో అశుతోష్ బాబట (ఆ పేరేంటో) అతని పుట్టినరోజు సందర్భంగా అశుతోష్ యూత్ సర్కిల్ శుభాకాంక్షలు-ఇంకెవరో అమ్మాయి - పుష్పవతి అయ్యిందట. ఆ వేడుక గురించి ఆ అమ్మాయి ఫొటోతో వినైల్స్ -మరెవరిదో పెళ్లి - ఆ జంట ఎంగేజ్మెంట్ ఫొటోతో ఫ్లెక్సీలు - సందు సందుకి అర డజను వినైల్స్ అలాంటివి ఉన్నాయి. శేఖర్ వాటిని ఆశ్చర్యంగా చూశాడు. ‘‘చాలా టూమచ్ కదా - పుట్టినరోజుకీ చావుకీ పెద్దమనిషి అయినందుకూ పెళ్లి కుదిరినందుకు - ప్రతిదానికీ పబ్లిసిటీయేనా?’’ అయినా వాళ్ల స్నేహితులకి, చుట్టాలకి ఉత్తరాలు రాసో, ఫోన్లు చేసో చెప్పుకోవచ్చు కదా! ఈ డప్పేంటో? అసహ్యంగా లేదూ?’’ అన్నాడు. నాకూ విచిత్రంగానే ఉంది అదంతా. ఎందుకు ఇలా అన్నీ బయటపెట్టుకుంటారు? దినం భోజనాలైపోయాక- సత్యనారాయణ కొడుకు ఆ వినైల్స్ అతనికి డబ్బులిస్తున్నాడు. ‘‘అన్ని సెంటర్లలో పెట్టాం. బాగానే రెస్పాన్స్ వచ్చిందా అండీ?’’ అనడుగుతున్నాడు ఆ వినైల్ అతను. నేను డైనింగ్ హాల్ని ఒకసారి చూశాను. కనీసం వందమంది కూడా లేరు. సత్యనారాయణ దగ్గరి బంధువులు. మాలాంటి వ్యాపార సంబంధీకులు తప్పితే, అక్కడ ఎవరూ లేరు. ఎవరి కళ్లల్లో పెద్దగా నీళ్లు కూడా లేవు. కొంతమంది అయితే భోజనాల్లో తగ్గిన ఉప్పు కారాల గురించి మాట్లాడుతున్నారు. రెస్పాన్సా? అని నవ్వొచ్చింది. సత్యనారాయణ కొడుకు చెబుతున్నాడు - ‘‘జనం రెస్పాన్స్ గురించి పెట్టలేదు. నాన్న చనిపోయాడనగానే గుండెలు బరువెక్కిపోయాయి. ఆ దిగులు, బాధ ఎలా దించుకోవాలో, ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. అందుకే ఈ వినైల్స్. ఎక్కడో ఏ మూలనో ఏ దూరపు చుట్టమో, మాకు తెలీని మా నాన్న స్నేహితుడో, ఈ బాధని పంచుకుంటాడని’’ అన్నాడు. ఒక్కసారిగా నాకు మా అందరి జీవితాల మీద స్పష్టత వచ్చింది. తాబేలు తన డిప్పలోకి తలదూర్చి బతికేసినట్లు, మేమందరమూ ఎవరి ఇళ్లల్లో వాళ్లు, ఎవరి ఇరుకు బతుకుల్లో వాళ్లున్నాం. మాకు బాధ, కోపం, సంతోషం అన్నీ వస్తుంటాయి. పంచుకోవడానికి ఎవరూ లేరు. అందుకే సోషల్ నెట్వర్కింగ్ పేజీల్లో ప్రతి చిన్నా పెద్దా ముచ్చట్లు షేరింగులు, లైకింగులు, కామెంట్స్... ఇలా బయటి ప్రపంచంలో వినైల్స్, ఫ్లెక్సీలు, హోర్డింగులు... మనిషి తన ఒంటరి జీవితంలో నుంచి బయటి ప్రపంచానికి ఓ వంతెన ఎప్పటికప్పుడు వేద్దామని చూస్తున్నాడు. కాని ఎప్పటికైనా అవతలి వైపుకి చేరుకుంటాడో- లేదో? సత్యనారాయణ దగ్గరి బంధువులు. మాలాంటి వ్యాపార సంబంధీకులు తప్పితే, అక్కడ ఎవరూ లేరు. ఎవరి కళ్లల్లో పెద్దగా నీళ్లు కూడా లేవు. కొంతమంది అయితే భోజనాల్లో తగ్గిన ఉప్పు కారాల గురించి మాట్లాడుతున్నారు. -
మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలి
=కలెక్టర్ కిషన్ =‘కాకతీయుల వంశరహస్యం’ పుస్తకావిష్కరణ సుబేదారి, న్యూస్‌లైన్ : కాకతీయుల కాలంలో మానవవిలువలు ఫరిడవిల్లాయని, మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలని కలెక్టర్ కిషన్ ఆకాంక్షించారు. డాక్టర్ తక్కెళ్ల బాలరాజు రాసిన కాకతీయుల వంశర హస్యం పుస్తకాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 పుస్తకాల ఆవిష్కరణ జరిగిందని, కాకతీయుల గూర్చి ఏది తెలిసినా... రాయాలని మేధావులు, చరిత్రకారులను కోరారు. చరిత్రను భద్రపరచడం ద్వారా భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మాట్లాడుతూ కాకతీయుల చరిత్రను ప్రచురించడం సాహోసపేతమైన నిర్ణయం అన్నారు. కాకతీయుల మూలాలపై పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్ ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ పరిశోధన విమర్శకు గురవుతుందన్నారు. అయితే పరిశోధనలో ఉన్న వాస్తవాలను గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాకతీయులు శూద్రులని, శైవ మతాన్ని ఆచరించారని పేర్కొన్నారు. కార్యక్రమానికి కళాపబ్లికేషన్స్ సంపాదకుడు, సీనియర్ జర్నలిస్ట్ బండి రవీందర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్,సురేంద్రకరణ్ పాల్గొన్నారు. -
సర్వీసు ఏరియాల్లోనే సేవలందించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గతంలో నక్సల్స్ ప్రభావం కారణంగా పట్టణాల్లో ఏర్పాటు చేసిన బ్యాంకుల సర్వీసులను తిరిగి పాత(సర్వీస్ ఏరియా) ప్రాంతాల్లోనే కొనసాగించాలని జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రూరల్ ప్రాంతాల్లో ఉండాల్సిన 31 బ్యాంకులు తిరిగి ఆయా ప్రాంతాల్లోనే సర్వీసులు కొనసాగించేలా చర్యలు తీసుకోవడానికి ఆమోదించారు. ఈ సందర్భంగా వివేక్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ఖరీప్‌లో రైతులకు రూ.1,260 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంకాగా రూ.751 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. సీజన్ పూర్తయ్యేనాటికి రుణాల లక్ష్యం పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు. 13,813 మంది కౌలు రైతులకు రుణఅర్హత కార్డులివ్వగా 189 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారని, మిగతావారికి కూడా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 648 స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు రూ.17కోట్ల 37లక్షలు రుణాల రూపంలో ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పూర్తికావడానికి అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి దాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ దత్, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ విజయగోపాల్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.