అంబేడ్కర్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు | Ambedkar birth anniversary arrangements | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు

Published Tue, Apr 12 2016 4:19 AM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM

Ambedkar birth anniversary arrangements

అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 14న నిర్వహించే అంబేడ్కర్ జయంతి వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్ అంబేడ్కర్ జయంతి వేడుకల నిర్వహణపై అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అప్పగించిన భాధ్యతలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. 

పాత బస్టాండులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమానికి హజరయ్యేవారికి మంచినీరు, మజ్జిగ సరఫరా చేయాలని మున్పిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. స్టేజీ,షామియానాల ఏర్పాటు బాధ్యతను కర్నూలు ఆర్డీఓ రఘుబాబుకు అప్పగించారు. జయంతి రోజు రుణాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని సాంఘికసంక్షేమ శాఖ డీడీని ఆదేశించారు. సమావేశంలో జేసీ-2 రామస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement