యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
సెంటినరీకాలనీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సెంటినరీకాలనీలోని రాణీరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించే యోగా కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఆర్జీ-3, ఏపీఏ జీఎంలు ఎంఎస్ వెంకట్రామయ్య, చం ద్రశేఖర్ కోరారు. స్థానిక జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సోమవారం మాట్లాడా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న మధ్యాహ్నం 3 గంటలకు సేవా భవనం నుంచి క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహిస్తామని, 4 గంటలకు మెగా యోగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, పాఠశాలల విద్యార్థులు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.
యైటింక్లయిన్‌కాలనీ :అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యైటింక్లయిన్‌కాలనీలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్జీ-2 జీఎం విజయపాల్‌రెడ్డి తెలిపారు. జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉ దయం 7 నుంచి 8గంటల వరకు సీఈఆర్ క్లబ్‌లో యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి సీఈఆర్ క్లబ్ వరకు ర్యాలీ ఉం టుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా డెరైక్టర్ మనోహర్‌రావు హాజరవుతారని చెప్పారు. అనంతరం సీఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మల్టీజిమ్‌ను డెరైక్టర్ ప్రారంభిస్తారని తెలి పారు. సమావేశంలో అధికారులు రవీందర్, రాజేశ్, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.