ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆఫ్రికాలో భారతీయులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 30వ తేదీ ఆదివారం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా దారుసలెమ్ భారతీయ రాయబార కార్యాలయ ఉద్యోగి డాక్టర్ సౌమ్య చౌహన్ ఆధ్వర్యంలో టాంజానియా రాష్ట్రం ఎంబీఈఎఫ్వై టౌన్లో 9వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ మేరకు సౌమ్య చౌహన్ మాట్లాడుతూ.. "యోగా అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఇది అంతర్గత శాంతికి, స్వీయ-ఆవిష్కరణకు, ప్రకృతితో సామరస్యానికి ఒక మార్గం. "అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకుడు ఆంధ్రప్రదేశ్ తిరువూరు వాసి రామిశెట్టి వెంకట నారాయణ (సత్య) మాట్లాడుతూ ..." ప్రధాని మంత్రి మోదీగారు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయలు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు, సమగ్ర ఐక్యతకు యోగ ఒక మంచి సాధనమన్నారు.
రోజువారీ ఒత్తుడులు, వ్యక్తిగత జీవితాల తోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది" అని అన్నారు. ఈ యోగా అభ్యాసకులలో మానసిక ప్రశాంతతా, ఐక్యత భావాన్ని పెంపొందించి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతుందని యోగ సాధకుడు రోహిత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment