- పట్టించుకోవడం లేదని ఆవేదన
- ఫోన్ చేసినా స్పందన లేదంటూ ఆక్రోశం
- జిల్లాల పర్యటనలు లేవని మండిపాటు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా మంత్రుల్లో మార్పు రావడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఫోన్‌లోనూ దొరకడం లేదు. మంత్రులే మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక అధికారులు మా మాటకు విలువ ఇస్తారా’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. విధాన సౌధలోని కాన్ఫరెన్స్ హాలులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశం బుధవారం జరిగింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ప్రృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రుల తీరును తూర్పారబట్టారు. కన్నడ, సాంృస్కతిక వ్యవహారాలు, ృహ నిర్మాణ, విద్యుత్, ప్రజా పనులు, వ్యవసాయ శాఖల మంత్రులు తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. వీరంతా మద్దతుదారుల మాటకు మాత్రమే విలువనిస్తున్నారని విమర్శించారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేల విన్నపాలపై స్పందించడం లేదన్నారు. జిల్లాల పర్యటనలకు కూడా రావడం లేదని ఆరోపించారు. అభిృద్ధి పనులను సమీక్షించడం లేదన్నారు.
పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తమ పనులు ఎలా చేయించుకోవాలని నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. పాలక పార్టీలో ఉండి కూడా పనులు కావడం లేదంటే, నియోజక వర్గం ప్రజల ముందు తమ పరువేం కావాలని వాపోయారు. శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం. ఇబ్రహీంను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడుగా నియమించడంపై అసంృప్తి వ్యక్తం చేశారు. ఇంకొంత కాలం ఆగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యేలను అనునయించడానికి ప్రయత్నించారు. అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నించిన తన వైపు వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున, పార్టీలో ఐక్యత అవసరమని సూచించారు.
గురువారం మంత్రులందరూ ఎమ్మెల్యేలకు రెండు గంటల పాటు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను ఆలకించి పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొని ఉంటే, ఉత్తమ ఫలితాలను సాధించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.