సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు ముగిశాక కూడా వాటిపై వివాదం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఏడాది కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు ఈ అంశానికి హిందుత్వాన్ని అపాదించి పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా బీజేపీని ఉద్దేశిస్తూ హిందూయిజాన్ని లీజుకు తీసుకున్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.
దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘‘టిప్పు సుల్తాన్ హిందువులకు హని చేశారు. అయినా సిద్దరామయ్య టిప్పును కొలుస్తున్నాడు. అంటే ఆయన హిందువుల సరసన లేనట్లే లెక్క. అలాంటి వ్యక్తి హిందువుల సంరక్షణ గురించి ఆలోచిస్తాడనుకోవటం లేదు’’ అని బీజేపీ ఎంపీ వినయ్ కుమార్ కటియార్ ఢిల్లీలో తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యానాథ్ హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్‌ను ఆరాధిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయగా మొదలైన దుమారం.. సిద్దరామయ్య కౌంటర్ ట్వీట్లతో మరింత ముదిరిపోయింది. కేవలం బీజేపీ నేతలే హిందువుతా? మేం కాదా? హిందూయిజాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? నా పేరు సిద్దరామయ్య. సిద్ధూ, రామయ్య.. అన్ని మతాలకు గౌరవం ఇస్తేనే అది అసలైన హిందుత్వం అవుతుంది అని కన్నడ భాషలో వరుస ట్వీట్లతో ఆయన ఆదిత్యానాథ్‌కు చురకలు అంటించారు.
పాత ఫోటోలతో కౌంటర్...
యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చాడు. హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరుపుకోవద్దంటూ ఆదిత్యానాథ్ కన్నడ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ నేతలు టిప్పు జయంతి వేడుకలు, ఇఫ్తార్‌లలో పాల్గొన్న ఫోటోలతో ప్రకాష్ రాజ్ మీ ఎజెండా ఏంటసలు అని యోగిని ప్రశ్నిస్తూ ఓ సందేశం ఉంచారు.
Yogi ji orders people of Karnataka “don’t celebrate tippu sultan in the land of hanuman” dear sir.. what’s your agenda again...#justasking pic.twitter.com/wwfErkW09e
— Prakash Raj (@prakashraaj) December 22, 2017
Comments
Please login to add a commentAdd a comment