Tippu Sultan
-
బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతో తెలుసా?
సాక్షి, అమరావతి: బ్రిటిష్ సామ్రాజ్యం.. దాని కాలనీలు మన దేశం సహా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి లెక్కలేనన్ని విలువైన కళాఖండాలను దోచుకెళ్లింది. 16వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా తన కాలనీలు, వలస రాజ్యాలు, రక్షిత ప్రాంతాలను స్థాపించింది. బ్రిటన్‌లోని పలు మ్యూజియాలలో ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న అనేక సాంస్కృతిక కళాఖండాలు వలస రాజ్యాల ప్రజల నుంచి దోచుకున్నవే. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆ దేశాలు కోరుతున్నా.. బ్రిటన్ పట్టించుకోవడం లేదు. కోహినూర్ వజ్రం నుంచి బెనిన్ కాంస్యాలు, పారి్థనాన్ మార్బుల్స్ వంటి 8 మిలియన్లకుపైగా కళాఖండాలు బ్రిటిష్ మ్యూజియంలలో ఉన్నట్టు అంచనా. వాటిలో అత్యంత విలువైనవి కొన్ని ఇవే. టిప్పుసుల్తాన్ ఉంగరం ఈస్టిండియా కంపెనీతో 1799లో జరిగిన యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోయిన తర్వాత.. బ్రిటిష్ దళాలు సుల్తాన్‌ను చంపి ఆయన ఖడ్గం, బొమ్మ పులి, చేతి వేలి నుంచి ఉంగరాన్ని తీసుకెళ్లారు. సుల్తాన్ ఉంగరంపై దేవనాగరి లిపిలో రాముడి పేరు చెక్కి ఉండేది. ఖడ్గాన్ని భారతదేశానికి తిరిగి రప్పించారు. 41 గ్రాముల ఈ ఉంగరాన్ని 2014లో వేలం వేయగా.. అంచనా ధర కంటే పది రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. టిప్పుసుల్తాన్‌కు చెందిన వేసవి రాజభవనం నుంచి తీసుకెళ్లిన బొమ్మ పులి ప్రస్తుతం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని భారతదేశం నుంచి బ్రిటిషర్లు తీసుకుపోయారు. 105.6 క్యారెట్లు, 21.6 గ్రాముల బరువున్న కోహినూర్ వజ్రాన్ని ప్రస్తుత ఏపీలోని కొల్లూరు గనిలో సేకరించారు. మొఘల్ చక్రవర్తులు నెమలి సింహాసనంపై దీన్ని ఉంచేవారు. మొదట దీన్ని సేకరించినప్పుడు 793 క్యారెట్లతో ఉండేది. ఆ తర్వాత దాన్ని కట్ చేశారు. 1849లో బ్రిటిషర్లు దాన్ని విక్టోరియా రాణికి అప్పగించారు. ఆమె దాన్ని పలు సందర్భాల్లో తన కిరీటంపై ధరించేవారు. ప్రస్తుతం ఇది లండన్ టవర్‌కి చెందిన జ్యువెల్ హౌస్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ ప్రపంచంలోనే పురాతన, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. ఎల్గిన్ మార్బుల్స్ ఎల్గిన్ మార్బుల్స్ పురాతన గ్రీకు శిల్పాల సమాహారం. గ్రీస్‌లోని పార్థినాన్ నుంచి 1801–1805 సంవత్సరాల మధ్య బ్రిటిషర్లు ఎథీనా దేవతకు అంకితం చేసిన ఈ శిల్పాలను తీసుకెళ్లారు. ఈ శిల్పాలు గ్రీకుల గొప్పతనం, వారి వారసత్వం, చరిత్రను తెలుపుతాయి. 1453 నుండి దాదాపు 400 సంవత్సరాల పాటు ఒట్టోమన్ సామ్రాజ్యం గ్రీకును పాలించింది. ఆ సమయంలో బ్రిటిష్ రాయబారి లార్డ్ ఎల్గిన్, పారి్థనాన్ శిథిలాల నుంచి ఈ శిల్పాలను సేకరించి తీసుకెళ్లారని చెబుతారు. బ్రెజిల్ రబ్బరు విత్తనాలు బ్రెజిల్‌కే సొంతమైన హెవియా బ్రాసిలియెన్సిస్ (రబ్బరు చెట్టు) 70 వేల విత్తనాలను 1876లో బ్రిటిష్ యాత్రికుడు హెన్రీ విక్హామ్ దొంగిలించాడు. ఇది చరిత్ర గతిని మార్చిన ఘటనగా పేర్కొంటారు. బ్రెజిల్‌లోని శాంటారెమ్ ప్రాంతంలోని 140 అడుగుల ఎత్తుకు పెరిగిన రబ్బరు చెట్టు విత్తనాలవి. అప్పటివరకు రబ్బరు పరిశ్రమపై బ్రెజిల్‌కు ఉన్న ఆధిపత్యం ఈ ఘటనతో చెదిరిపోయింది. ఈ విత్తనాలు ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్నాయి. రోసెట్టా స్టోన్ ఈజిప్టులోని రోసెట్టా ప్రాంతంలో దొరికిన పురాతన శాసనం ఇది. ఈజిప్టును పాలించిన టోలెమీ 196 బీసీలో నల్లటి బసాల్ట్ గ్రానైట్ రాయిపై ఈ శాసనాన్ని చెక్కించారు. మూడు విభిన్న ఈజిప్టియన్ భాషల్లో రాసిన ఈ శాసనం తన సామ్రాజ్యం, తాను చేసిన పనుల గురించి ఇందులో రాయించారు. 1799లో ఈ రాయిని కనుగొన్నారు. నెపోలియన్ బోనపార్టీ ఈజిప్టు నుంచి దీన్ని స్వా«దీనం చేసుకున్నారు. 1800 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యం ఓడిపోయిన తర్వాత బ్రిటిషర్లు దీన్ని స్వా«దీనం చేసుకుని బ్రిటన్‌కు తరలించారు. ప్రాచీన ఈజిప్టు సామ్రాజ్యం, గ్రీకుల సంస్కృతి, వారసత్వం గురించి తెలిపే అత్యంత విలువైన శాసనంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే దీన్ని తిరిగి ఇవ్వాలని ఈజిప్టు దేశం బ్రిటన్ను కోరినా పట్టించుకోలేదు. షాజహాన్ వైన్ జార్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ వైన్ తాగే జార్‌ను కూడా బ్రిటిషర్లు తీసుకెళ్లి అక్కడి మ్యూజియంలో పెట్టుకున్నారు. తెల్లటి కప్పులా ఉండే ఈ జార్ దిగువ భాగంలో కమలం, ఆకులను పోలి ఉండేది. హ్యాండిల్‌పై కొమ్ము, గడ్డంతో ఉన్న జంతువు ఉండేది. 19వ శతాబ్దంలో ఈ అందమైన వైన్ జార్‌ను కల్నల్ చార్లెస్ సెటన్ గుత్రీ దొంగిలించి బ్రిటన్‌కు పంపినట్టు చెబుతారు. 1962 నుంచి ఇది లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో ఉంది. బెనిన్ కాంస్యాలు ఒకప్పటి బెనిన్ రాజ్యమే ఇప్పటి నైజీరియా. 1897లో బ్రిటిషర్లు బెనిన్‌పై దాడిచేసి ఆ నగరాన్ని దోచుకుంది. అక్కడి రాజ భవనంలో ఉన్న చారిత్రాత్మక వస్తువులు, 200కిపైగా కాంస్య ఫలకాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. 1960లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి నైజీరియా పలుసార్లు ఈ కాంస్యాలను తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. ఇది కూడా చదవండి: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు -
‘టిప్పు వారసులకు తెల్లదొరల పింఛన్.. సాక్ష్యాలివిగో’.. బీజేపీ కౌంటర్
మండ్య: మైసూరు పులి టిప్పు సుల్తాన్ వంశానికి చెందినవారు బ్రిటిష్ వారి వద్ద నుంచి సుమారు 60 సంవత్సరాల పాటు పెన్షన్ తీసుకున్నారు, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని ఓ బీజేపీ నాయకుడు ప్రకటించారు. మరాఠా స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్ బ్రిటిష్‌వారితో ఒడంబడిక చేసుకుని పింఛన్ తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సమయంలో బీజేపీ నాయకులు ఈ ఆరోపణలు చేశారు. టిప్పు సుల్తాన్ 12వ కుమారుడు అయిన గులామ్ మహ్మద్ బ్రిటిష్ వారికి రాసిన లేఖను, ఆయన పింఛన్ పొందారనే పత్రాలను బీజేపీ మండ్య జిల్లా నేత సిటి మంజునాథ్ మంగళవారం మీడియా ముందు విడుదల చేశారు. విక్టోరియా రాణికి గులామ్ మహ్మద్ లేఖ రాశారని చెప్పారు. తద్వారా టిప్పు వంశస్తులు 60 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి వద్ద పింఛన్ తీసుకున్నట్లు ఇవే ఆధారాలని చెప్పారు. టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేశాడు తప్ప భారత స్వాతంత్య్రం కోసం కాదని అన్నారు. టిప్పును హత్య చేసింది బ్రిటిష్‌వారు కాదు, ఊరి గౌడ, దొడ్డనంజెగౌడ అయి ఉంటారని పేర్కొన్నారు. -
టిప్పు సుల్తాన్ పేరు తొలగించిన మహా సర్కార్
ముంబై: మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంలో ఉద్దవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని.. తాజాగా షిండే సర్కార్ రద్దు చేసింది. ముంబై మలాద్ ప్రాంతంలోని ఓ పార్క్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొలగిస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సకల్ హిందూ సమాజ్, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ మేరకు బీజేపీ నేత, ముంబై సబర్బన్ డిస్ట్రిక్ గార్డియన్ మినిస్టర్ మంగళ్ ప్రభాత్ పేరు తొలగింపునకు సంబంధించిన ఆదేశాలను కలెక్టర్‌కు జారీ చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ బ్యానర్‌ను తొలగించారు. అంతేకాదు.. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అసలు ఆ పేరు ఉండాలని ఎవరూ అక్కడ కోరుకోలేదని ఆయన అంటున్నారు. ఉన్నపళంగా గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, టిప్పు సుల్తాన్ పేరుతో ఓ బ్యానర్ వెలిసిందని, ఆ సమయంలో అక్కడ నిరసనలు జరిగాయని గుర్తు చేశారాయన. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, ప్రజాభీష్టాన్ని గౌరవించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్, బీఆర్ అంబేద్కర్.. ఇలాంటి మహనీయుల పేర్లను నిర్ణయించాలని బీజేపీ స్థానికులను కోరుతోంది. ఇదిలా ఉంటే.. ఈ నిర్ణయాన్ని ఎన్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు టిప్పు సుల్తాన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించిన సమయంలో బీజేపీ సైతం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోనూ టిప్పు సుల్తాన్ పట్ల వ్యతిరేకత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. Finally, victory of the Right! Ordered removal of name Tipu Sultan from the park in Malad after considering the protests by Sakal Hindu Samaj & demand by @iGopalShetty Ji in the DPDC meeting. Last year MVA govt had named the ground after Tipu Sultan and we had to protest it! pic.twitter.com/IRBgiAmfbZ — Mangal Prabhat Lodha (@MPLodha) January 27, 2023 -
‘సిలబస్’ పై వెనక్కి తగ్గిన కర్ణాటక సర్కార్
బెంగళూర్ : ఈ ఏడాది విద్యాసంవత్సరంలో సిలబస్‌లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక సర్కార్ వెనక్కి తగ్గింది.18వ శతాబ్ధపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ,హైదర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాలను తొలగిస్తూ చేసిన ప్రకటనను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదని, త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రానుందున విద్యా సంవత్సరం ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియదని, ఈ నేపథ్యంలో సిలబస్‌లో మార్పుల అంశంపై తుది వివరాలను వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపింది. (పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్ చాప్టర్ తొలగింపు) తొమ్మిది నుంచి పన్నెండో తరగతి సిలబస్‌ను కుదించే క్రమంలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనికి అనుబంధంగా కర్ణాటక సైతం సిలబస్‌ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల నుంచి మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చాప్టర్లను తొలగిస్తూ ప్రకటన జారీ చేసింది. మొఘల్, రాజ్‌పుత్‌ల చరిత్రకు సంబంధించిన అథ్యాయాలు, జీసస్, మహ్మద్ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజకీయ దుమారం తలెత్తడంతో సర్కార్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించింది. కాగా మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న సిలబస్ కుదింపు నిర్ణయం ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్ కుదింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకూ సాధారణ విద్యాసంవత్సరంలో 210-220 పనిదినాలు కాగా, ఈ ఏడాది మాత్రం 120-140 ఉండనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే సిలబస్‌ను కుదిస్తూ మార్పులు చేపట్టారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) -
యెడ్డీ సర్కారు సంచలన నిర్ణయం!
బెంగళూరు : కర్ణాటకలో కొలువుదీరిన బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల నిర్వహణను రద్దు చేసింది. ఈ వేడుకల కారణంగా రాష్ట్రంలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయని.. ఇటువంటి సున్నితమైన అంశాలు మరింత వివాదాస్పదం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు.. ‘ వివాదాస్పద, మత కల్లోలాలకు కారణమవుతున్న టిప్పు జయంతిని మా ప్రభుత్వం రద్దు చేసింది’ అని కర్ణాటక బీజేపీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. కాగా బ్రిటిషర్లకు చుక్కలు చూపించిన టిప్పు సుల్తాన్ గౌరవార్థం గత కాంగ్రెస్ ప్రభుత్వం 2015 నుంచి ఆయన జయంతి వేడుకల నిర్వహణను ప్రారంభించింది. సిద్ధరామయ్య హయాంలో ప్రారంభమైన ఈ వేడుకలను బీజేపీ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తూ యెడ్డీ సర్కారు మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇక సోమవారం జరిగిన బలపరీక్షలో 106 మంది సభ్యులు తమకు అనుకూలంగా ఓటు వేయడంతో యెడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో సునాయాసంగా నెగ్గిన విషయం తెలిసిందే. -
‘సుల్తాన్ ఉత్సవాలకైతే డబ్బులుంటాయి’
బెంగళూరు : సుల్తాన్ ఉత్సవాలు జరపడానికి వారి దగ్గర డబ్బులుంటాయి కానీ హంపి చరిత్రను గుర్తు చేసుకోవడానికి మాత్రం డబ్బు ఖర్చు చేయలేరని ప్రధాని నరేంద్ర మోదీ.. కుమారస్వామి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏడాది నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక వెళ్లిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ జేడీఎస్ కూటమిపై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నది 20 శాతం ప్రభుత్వమని.. దాని ప్రధాన ఉద్దేశం కమిషన్లు సేకరించడమేనని ఆరోపించారు. కర్ణాటకలో రాచరికం, అవినీతి ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తుందని.. ప్రజలంతా బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు జాతీయవాదులకు, రాచరికానికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కుమారస్వామి సైన్యాన్ని ఉద్దేశిస్తూ.. రోజుకు రెండు పూటలా భోజన దొరకని వారే.. ఆర్మీలో చేరతాని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన మోదీ దేశ భద్రత కోసం ప్రాణాలర్పించే వారి పట్ల ఇంత చులకన భావం ఉన్నవారు.. ప్రజలకు ఎలాంటి భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. -
వీరుడి చుట్టూ.. వివాదాల గుట్టు
సాక్షి, బెంగళూరు : మైసూర్ పులిగా పిలవబడే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లింలను ఆకట్టుకునేందుకే జేడీఎస్-కాంగ్రెస్ టిప్పు ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్తనాటకానికి తెరలేపిందని అన్నారు. టిప్పు పాలనలో హిందూవులను చిత్రహింసలకు గురిచేశారని, ఆయనను యాంటీ హిందూపాలకుడిగా బీజేపీ వర్ణించింది. యడ్యూరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఖండించారు. 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారిని ఎదురించిన గొప్ప పోరాడయోధుడు టిప్పుసుల్తానని, అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను జరుపుకోవడంలో తప్పేమీ లేదని వివరించారు. పోరాటయోధులను బీజేపీ ఎప్పుడూ గౌరవించలేదని.. టిప్పుపై రాజకీయం ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలనే ఏజెండాతో బీజేపీ ఈ ఆరోపణలకు దిగిందని అన్నారు. టిప్పు ఉత్సవాలను నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గతంలో అభినందిచినట్లు ఆయన గుర్తుచేశారు. గతంలో కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా టిప్పుపై వివాదం రేగింది. ప్రతి ఏడాది టిప్పు జయంతి, వర్థింతి వేడుకల సమయంలో రాజకీయంగా దుమారంరేగడం కన్నడలో సాధారణంగా మారిపోయింది. కాగా బ్రిటిష్ హయాంలో మైసూర్ పాలకుడిగా ఉన్న టిప్పు సుల్తాన్ వారితో వీరోచితంగా పోరాడి 1799 మే 4న 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారు. ముఖ్యంగా యుద్దంలో అనుసరించాల్సిన వ్యూహాలను రచించడంతో టిప్పును దిట్టగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఆధునిక చరిత్రలో యుద్దంలో తొలిసారిగా రాకెట్లను ఉపయోగించిన ఘనత టిప్పు సుల్తాన్‌కే దక్కుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయం తెలిసిందే. -
పాడుపడిన బావిని తవ్వితే..
బెంగళూరు : టిప్పు సుల్తాన్ భారతదేశ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిన చక్రవర్తి. ఆంగ్లేయులను గడగడలాడించిన ఈ యుద్ధ వీరునికి సంబంధించిన అరుదైన సంపద శిమొగ్గ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఒక పురాతన బావిలో వెలుగు చూసింది. క్రీస్తుశకం 18 వ శతాబ్దంలో మైసూర్ యుద్ధంలో వాడిన అరుదైన యుద్ధ సామగ్రి బయటపడింది. ఉప్పరివారు ఒక పురాతన బావిని తవ్వుతుండగా ఈ చారిత్రక సంపద వెలుగులోకి వచ్చినట్లు కర్ణాటక ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ విషయం గురించి ఆర్కియాలజి డిపార్ట్మెంట్ అధికారి ఆర్ రాజేశ్వర నాయక ఈ పురాతన బావి నుంచి గన్ పౌడర్ వాసన రావడంతో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ బావిలో ‘మైసురియన్ రాకెట్లు’గా ప్రసిద్ధి గాంచిన 1000 రాకెట్లు, గుళ్లు లభించాయి. వీటిని యుద్ధాలలో వినియోగించడం కోసం ఇక్కడ భద్రపరిచి ఉంటారు. ఈ రాకెట్ల పొడవు 23 - 26 సెంమీల పొడవు ఉన్నాయి. అంతేకాక ఇవి నెపోలియన్ చక్రవర్తి ఉపయోగించిన రాకెట్ల మాదిరిగానే ఉన్నాయి’ అని తెలిపారు. వీటిని వెలికి తీయడం కోసం 15 మంది ఆర్కియాలిజిస్ట్‌లు, పనివారు మూడు రోజుల పాటు శ్రమించారన్నారు. టిప్పు సుల్తాన్ 1799లో జరిగిన చివరి ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో వీర మరణం పొందారు. ఈ యుద్ధల సమయంలోనే టిప్పు సుల్తాన్ మైసూరియన్ రాకెట్లుగా ప్రసిద్ధి పొందిన ఈ ఆయుధాలను తయారు చేసి, వినియోగించేవారని చరిత్రకారులు అభిప్రాయాపడుతున్నారు. ఆర్కియాలజిస్టుల రికార్డుల ప్రకారం ప్రస్తుతం శిమొగ్గలో ఉన్న కోట టిప్పు సుల్తాన్ కాలానికి చెందినది. -
కర్ణాటక ఎన్నికలు.. పాక్ కుట్ర!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగిందనే అనుమానాలను బీజేపీ వ్యక్తం చేస్తోంది. టిప్పు సుల్తాన్ 218 వర్ధంతి సందర్భంగా పాక్ గవర్నమెంట్ అఫీషియల్ ట్వీటర్ అకౌంట్లో శుక్రవారం రెండు పోస్టులు వెలిశాయి. టిప్పు అరివీర భయంకరుడని పేర్కొంటూ పాక్ వాటిల్లో ప్రశంసలు గుప్పించింది. దీంతో కుట్రకు తెరలేచిందని బీజేపీ ఆరోపిస్తోంది. ‘టిప్పు సుల్తాన్ అంతులేని జ్ఞాన సంపద ఉన్న వ్యక్తి. పులినే తన అధికర చిహ్నంగా చేసుకున్న ధైర్యశాలి. మైసూర్ టైగర్. బ్రిటీష్ సైన్యం ఎదుర్కొన్న అతి గొప్ప శత్రు సారధుల్లో ఆయన ఒకరు. మైనార్టీలను టిప్పు దయతో చూసేవారు. ఫ్రెంచ్ వారికి చర్చి నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు. నక్కలాగా వందేళ్లు బతకటం కంటే.. సింహంలా ఒక్కరోజు బతికినా చాలని చాటిచెప్పిన వ్యక్తి. బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకునేందుకు సంధించబడ్డ చివరి బాణం’ అంటూ ప్రశంసలు గుప్పించింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని కూడా ట్వీటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది కుట్రే: బీజేపీ.. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది. ‘1947 ఆగష్టు 14 నుంచి తమ చరిత్ర మొదలైనట్లు పాకిస్థాన్ చెప్పుకుంటుంది. అలాంటిది ఉన్న పళంగా ఇంత ప్రేమ కురిపించటం ఏంటి? అన్నింటికి మించి భారతీయ చారిత్రక వారసత్వాన్ని పాక్ ఏనాడూ గుర్తు చేసుకోలేదు. కర్ణాటక ముస్లిం ఓటర్లను ప్రభావితం ఈ పని చేసిందనిపిస్తోంది’ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారు. కాగా, టిప్పు జయంతి ఉత్సవాల విషయంలో కాంగ్రెస్ పార్టీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. Revisiting an important & influential historical figure, Tiger of Mysore - Tipu Sultan on his death anniversary. Right from his early years, he was trained in the art of warfare & had a fascination for learning. #TipuSultan pic.twitter.com/Izts0HKdgD — Govt of Pakistan (@pid_gov) 4 May 2018 -
మాల్యాను వణికించిన ‘కత్తి’
న్యూఢిల్లీ : టిప్పు సుల్తాన్ ఖడ్గానికి చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. 1782 నుంచి 1799 వరకు మైసూరును పాలించిన యోధుడు టిప్పు సుల్తాన్ కరవాలం శత్రువులకు మృత్యుదేవతగా కనిపించేది. భారతదేశం నుంచి బ్రిటీష్ వారిని తరిమికొట్టడానికి ఉపయోగించిన ఈ చారిత్రాత్మక ఖడ్గం నేడు కనిపించటం లేదు. 2004లో లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఈ ఖడ్గాన్ని ఒక ప్రైవేటు వేలంలో రూ.1.5 కోట్లకు తన సొంతం చేసుకున్నాడు. అయితే తాను సొంతం చేసుకున్న ఈ ఖడ్గాన్ని విజయ్‌మాల్యా 2016లో వదిలించుకున్నట్టు తెలిసింది. ఈ ఖడ్గాన్ని పొందినప్పటి నుంచి తనకు కలిసి రావడం లేదని, వెంటనే దాన్ని వదిలించుకోమని కుటుంబ సభ్యులు సలహా ఇవ్వడంతో, ఈ ఖడ్గాన్ని ఎవరో తెలియని వ్యక్తులకు ఇచ్చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఖడ్గానికి మార్కెట్ విలువ సుమారు 1.8 కోట్లు ఉంటుందని తెలిసింది. దీన్ని ఆధారంగా చేసుకుని మాల్యాకు రుణాలిచ్చి మోసపోయిన 13 భారతీయ బ్యాంకుల తరఫున వాదిస్తున్న న్యాయవాది లండన్ హైకోర్టుకు ఒక విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని వదిలించుకున్న మాదిరిగా... మాల్యా తన మిగతా ఆస్తులను కూడా పంచిపెట్టే అవకాశం ఉందని న్యాయవాది తన పత్రంలో పేర్కొన్నారు. అదే జరిగితే మాల్యాకు అప్పు ఇచ్చిన బ్యాంకులు ఆ రుణాలను తిరిగి వసూలు చేసుకునే అవకాశం ఉండదని వాపోయారు. అంతేకాకుండా ఆస్తులను పంచిపెట్టేందుకు వీలు లేకుండా.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకున్న ఆస్తుల మీద కోర్టు జారీ చేసిన ఫ్రీజ్ ఆర్డర్‌ను (ఆస్తులను స్తంభింపచేసే ఆదేశాలను) ఎత్తివేయరాదని ఆయన అభ్యర్థించారు. ఇందుకు మాల్యా తరుఫు న్యాయవాది వివరణ ఇస్తూ వేల కోట్ల రుణాలను ఖడ్గం విలువతో పోల్చి చూడటం సరికాదన్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని మాల్యా తన ఆస్తులను అమ్ముకుంటున్నాడని లేదా దాస్తున్నాడని ఆరోపించటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 13 భారతీయ బ్యాంకుల నుంచి 9 వేల కొట్ల రూపాయలను రుణంగా పొంది... వాటిని తప్పుదోవ పట్టించిన మాల్యా లండన్‌కి పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాల్యాపై వివిధ కేసులు నమోదయ్యాయి. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుడుగా అభివర్ణించిన సీబీఐ, ఈ లిక్కర్ కింగ్‌ను భారత్‌కు రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం మాల్యాను దేశానికి ఎలా రప్పించాలా? అని మల్లగుల్లాలు పడుతోంది. -
టిప్పును కొలిస్తే హిందూ వ్యతిరేకులా?
సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు ముగిశాక కూడా వాటిపై వివాదం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఏడాది కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు ఈ అంశానికి హిందుత్వాన్ని అపాదించి పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా బీజేపీని ఉద్దేశిస్తూ హిందూయిజాన్ని లీజుకు తీసుకున్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘‘టిప్పు సుల్తాన్ హిందువులకు హని చేశారు. అయినా సిద్దరామయ్య టిప్పును కొలుస్తున్నాడు. అంటే ఆయన హిందువుల సరసన లేనట్లే లెక్క. అలాంటి వ్యక్తి హిందువుల సంరక్షణ గురించి ఆలోచిస్తాడనుకోవటం లేదు’’ అని బీజేపీ ఎంపీ వినయ్ కుమార్ కటియార్ ఢిల్లీలో తెలిపారు. ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యానాథ్ హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్‌ను ఆరాధిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయగా మొదలైన దుమారం.. సిద్దరామయ్య కౌంటర్ ట్వీట్లతో మరింత ముదిరిపోయింది. కేవలం బీజేపీ నేతలే హిందువుతా? మేం కాదా? హిందూయిజాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? నా పేరు సిద్దరామయ్య. సిద్ధూ, రామయ్య.. అన్ని మతాలకు గౌరవం ఇస్తేనే అది అసలైన హిందుత్వం అవుతుంది అని కన్నడ భాషలో వరుస ట్వీట్లతో ఆయన ఆదిత్యానాథ్‌కు చురకలు అంటించారు. పాత ఫోటోలతో కౌంటర్... యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చాడు. హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరుపుకోవద్దంటూ ఆదిత్యానాథ్ కన్నడ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ నేతలు టిప్పు జయంతి వేడుకలు, ఇఫ్తార్లలో పాల్గొన్న ఫోటోలతో ప్రకాష్ రాజ్ మీ ఎజెండా ఏంటసలు అని యోగిని ప్రశ్నిస్తూ ఓ సందేశం ఉంచారు. Yogi ji orders people of Karnataka “don’t celebrate tippu sultan in the land of hanuman” dear sir.. what’s your agenda again...#justasking pic.twitter.com/wwfErkW09e — Prakash Raj (@prakashraaj) December 22, 2017 -
టిప్పు సుల్తాన్‌ది వీరమరణం
సాక్షి, బెంగళూరు: 18వ శతాబ్దానికి చెందిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ యుద్ధ వీరుడనీ, ఆయనది వీర మరణంఅని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. కర్ణాటక విధాన సౌధ భవనాన్ని ప్రారంభించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాల్లో ఆ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి రామ్‌నాథ్ ప్రసంగించారు. ‘టిప్పు బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందారు. మైసూరు రాకెట్లను అభివృద్ధి చేయడంలోనూ, కదన రంగంలో వాటిని ఉపయోగించడంలోనూ ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. ఈ సాంకేతికతను తర్వాత ఐరోపావారు సొంతం చేసుకున్నారు’ అని రామ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. కోవింద్ ఉపన్యాసంలో టిప్పు పేరును చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని తన స్వార్థానికి వాడుకుని దుర్వినియోగం చేసిందని శాసన మండలిలో ప్రతిపక్ష బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. ఇలా మాట్లాడటానికి బీజేపీకి సిగ్గుండాలనీ ఆ ప్రసంగం స్వయంగా రాష్ట్రపతి కార్యాలయమే తయారు చేసింది తప్ప తాము కాదని రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్ గుండురావు చెప్పారు. ఎవరో రాసిచ్చిన దాన్ని రామ్‌నాథ్ ప్రసంగంగా చదివారని బీజేపీ అనడం, రాష్ట్రపతిని, ఆయన కార్యాలయాన్ని అవమానించడమేనని గుండురావు విమర్శించారు. నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించగా, బీజేపీ వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. ఆ ‘డీ’ ఉంటేనే ప్రజాస్వామ్యానికి సార్థకత చట్ట సభల్లో మూడు ‘డీ’లు అయిన డిబేట్ (చర్చ), డిస్సెంట్ (భిన్నాభిప్రాయం), డిసైడ్ (నిర్ణయం)తోపాటు నాలుగో డీ అయిన డీసెన్సీ (సభ్యత) కూడా ఉంటేనే ప్రజాస్వామ్యానికి సార్థకత ఉన్నట్లని కోవింద్ పేర్కొన్నారు. ఎటువంటి భేదాలు లేకుండా ప్రజలందరి కోరికలు, ఆశలకు ప్రతిరూపాలుగా నిలిచేవే చట్ట సభలని అన్నారు. -
టిప్పు లొల్లి.. షరా మాములే!
సాక్షి, బెంగళూర్ : కన్నడనాట మళ్లీ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల రగడ మొదలైంది. ప్రతీయేడూ లాగే ఈసారి కూడా టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని హిందుత్వ సంఘాలు పిలుపునిస్తుండగా.. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే లేఖతో ఈసారి అది మరింత రసవత్తరంగా మారింది. టిప్పును హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ... నవంబర్ 10న నిర్వహించబోయే జయంతి వేడుకలకు తననను ఆహ్వానించొద్దంటూ హెగ్డే కర్ణాటక ప్రభుత్వానికి ఈ యేడాది కూడా లేఖ రాశారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్త ఘాటుగా స్పందించారు. జయంతి వేడుకలను హేగ్డే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ శనివారం మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య మండిపడ్డారు. బ్రిటీష్ వారి వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడి విషయంలో ఇలాంటి రాద్ధాంతం చేయటం సరికాదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో భాగం అయి ఉండి ఆయన(హెగ్డే) ఇలాంటి పని చేయటం సరికాదు. ఆహ్వానాలు అందరికీ పంపుతాం. వాటిని తీసుకోవటం.. తీసుకోకపోవటం.. రావటం.. రాకపోవటం.. అనేది వాళ్ల ఇష్టం అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక బీజేపీ ఎంపీ శోభా కరందల్జే హెగ్డేకు మద్ధతు తెలిపారు. టిప్పు సుల్తాన్ ఓ కన్నడ వ్యతిరేకని.. హిందూ వ్యతిరేకని ఆమె తెలిపారు. టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని కన్నడ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. గతేడాది కూడా అనంతకుమార్ ఇదే రీతిలో తనను మైసూర్ సుల్తాన్ టిప్పు జయంతి వేడుకలకు ఆహ్వానించొద్దంటూ లేఖ రాశారు కూడా. విమర్శలు... భారతదేశపు మొట్టమొదటి మిస్సైల్ మ్యాన్ గా టిప్పు సుల్తాన్‌ను చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. కానీ, కొందరు విమర్శకులు మాత్రం ఆయన హిందువులను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తుంటారు. ముఖ్యంగా కొడగు, శ్రీరంగపట్నంలో ఈ నరమేధం ఎక్కువగా జరిగిందని చెబుతుంటారు. మోహన్‌దాస్ లాంటి విద్యావేత్తలు సదస్సులు నిర్వహించి మరీ విమర్శలు గుప్పిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉత్సవాల నిర్వహణలో వెనక్కి తగ్గటం లేదు. -
టిప్పు తుపాకీ దొరికింది
- ‘సాక్షి’ కథనంతో స్టోర్‌లో గాలించి గుర్తించిన అధికారులు - దుమ్ముకొట్టుకుపోయి వెలిసిపోయిన తుపాకీ - కొన్ని భాగాల్లో తుప్పు పట్టి అధ్వాన స్థితిలో ఉన్న వైనం - తుపాకీ చివరన కనిపించని పులి బొమ్మ - పురావస్తు శాఖ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సీరియస్ సాక్షి, హైదరాబాద్: దాదాపు 15 ఏళ్లుగా ‘కనిపించ’కుండా పోయిన టిప్పు సుల్తాన్ తుపాకీ దొరికింది! ‘టిప్పు తుపాకీ మాయం’ పేరిట ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో స్పందించిన అధికారులు... పురావస్తు శాఖ స్టోర్‌లో వెతికి ఆ తుపాకీని గుర్తించారు. కానీ అమూల్య చారిత్రక సంపద అయిన ఆ తుపాకీ దుమ్ముకొట్టుకుపోయి, తుప్పుపట్టి అధ్వాన స్థితిలో ఉంది. ఇక టిప్పు సుల్తాన్ తుపాకీ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో.. వెంటనే దానిని ప్రదర్శనకు పెట్టేందుకు వైఎస్సార్ స్టేట్ మ్యూజియం సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు.. అప్పట్లో ప్రదర్శన శాల నుంచి ఈ తుపాకీని తొలగించిన సిబ్బంది దానిని స్టోర్‌లో పడేశారు. తర్వాత అప్పటి అధికారులు, సిబ్బంది పదవీ విరమణ చేయడంతో అంతా దాన్ని మర్చిపోయారు. ఈ అంశాన్ని ‘టిప్పు తుపాకీ మాయం’ పేరిట మూడు రోజుల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు స్టోర్‌లో గాలించి టిప్పు తుపాకీని గుర్తించారు. దానిని ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టేట్ మ్యూజియంలో ఓ గ్యాలరీ ఏర్పాటు చేసి ఈ తుపాకీతోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న మరికొన్ని తుపాకులు, ఖడ్గాలు, డాగర్లు, ఇతర యుద్ధ సంబంధ వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అధికారుల తీరుపై సందేహాలు మ్యూజియంలో ప్రదర్శనకు ఎన్నో పురాతన వస్తువులున్నా.. సందర్శకులు ప్రత్యేకంగా దృష్టి సారించే వాటిలో టిప్పు సుల్తాన్ తుపాకీ ఒకటి. కానీ వేరే వస్తువులను ఏర్పాటు చేసేందుకంటూ అప్పట్లో టిప్పు తుపాకీని తొలగించారు. మరోచోటనైనా ప్రదర్శించకుండా స్టోర్‌లో పడేశారు. తర్వాత కూడా ఎవరూ దాని ఊసెత్తకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’లో కథనం ప్రచురితమయ్యేవరకు ఆ శాఖ మంత్రి కార్యాలయానికి కూడా టిప్పు తుపాకీ గురించిన సమాచారం లేదు. శాఖ ఉన్నతాధికారులకు కూడా మ్యూజియంలో టిప్పు తుపాకీ ఉన్న సంగతి తెలియక పోవడం గమనార్హం. దుమ్ముకొట్టుకుపోయి.. దాదాపు 15 ఏళ్లుగా ‘అదృశ్యం’గా ఉన్న టిప్పు సుల్తాన్ తుపాకీని పురావస్తు శాఖ స్టోర్‌లో దుమ్ము కొట్టుకుపోయిన స్థితిలో గుర్తించారు. దాన్ని భద్రపర్చిన పెట్టెలోంచి బయటకు తీసి శుభ్రపరిచారు. కానీ ఆ తుపాకీ మునుపటి మెరుపును కోల్పోయి ఉంది. కొన్ని చోట్ల తుప్పు పట్టింది కూడా. కనీసం ఈ తుపాకీకి సంబంధించిన చిత్రాలు కూడా లేకపోవడంతో... ఇప్పుడు ఫొటోలు తీసి భద్రపరిచే పని చేస్తున్నారు. అసలు టిప్పు సుల్తాన్ వద్ద అప్పట్లో ఐదు తుపాకులుండేవని చెబుతారు. వాటిని ఆయన వివిధ నమూనాల్లో పులి బొమ్మలు ఉండేలా చేయించారు. పురావస్తు శాఖ వద్ద ఉన్న తుపాకీ చివర (వెనుకవైపు కలపతో చేసిన భాగంపై) కూడా పులి బొమ్మ ఉండేది. కానీ అది దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. త్వరలో నిర్ణయిస్తాం.. ‘‘టిప్పు సుల్తాన్ తుపాకీ లాంటి చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను ప్రజల సందర్శనకు వీలుగా ప్రదర్శనకు ఉంచుతాం. ఆ తుపాకీని ప్రదర్శన నుంచి తొలగించి స్టోర్‌లో పెట్టిన విషయం నేపథ్యం నాకు తెలియదు. త్వరలోనే దాని ప్రదర్శనపై నిర్ణయం తీసుకుంటాం..’’ - పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి -
టిప్పు సుల్తాన్