బెంగళూరు : కర్ణాటకలో కొలువుదీరిన బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల నిర్వహణను రద్దు చేసింది. ఈ వేడుకల కారణంగా రాష్ట్రంలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయని.. ఇటువంటి సున్నితమైన అంశాలు మరింత వివాదాస్పదం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు.. ‘ వివాదాస్పద, మత కల్లోలాలకు కారణమవుతున్న టిప్పు జయంతిని మా ప్రభుత్వం రద్దు చేసింది’ అని కర్ణాటక బీజేపీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది.
కాగా బ్రిటిషర్లకు చుక్కలు చూపించిన టిప్పు సుల్తాన్ గౌరవార్థం గత కాంగ్రెస్ ప్రభుత్వం 2015 నుంచి ఆయన జయంతి వేడుకల నిర్వహణను ప్రారంభించింది. సిద్ధరామయ్య హయాంలో ప్రారంభమైన ఈ వేడుకలను బీజేపీ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తూ యెడ్డీ సర్కారు మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇక సోమవారం జరిగిన బలపరీక్షలో 106 మంది సభ్యులు తమకు అనుకూలంగా ఓటు వేయడంతో యెడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో సునాయాసంగా నెగ్గిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment