
బీజేపీ నేత విడుదల చేసిన కాగితాలు
మండ్య: మైసూరు పులి టిప్పు సుల్తాన్ వంశానికి చెందినవారు బ్రిటిష్ వారి వద్ద నుంచి సుమారు 60 సంవత్సరాల పాటు పెన్షన్ తీసుకున్నారు, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని ఓ బీజేపీ నాయకుడు ప్రకటించారు. మరాఠా స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్ బ్రిటిష్‌వారితో ఒడంబడిక చేసుకుని పింఛన్ తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సమయంలో బీజేపీ నాయకులు ఈ ఆరోపణలు చేశారు.
టిప్పు సుల్తాన్ 12వ కుమారుడు అయిన గులామ్ మహ్మద్ బ్రిటిష్ వారికి రాసిన లేఖను, ఆయన పింఛన్ పొందారనే పత్రాలను బీజేపీ మండ్య జిల్లా నేత సిటి మంజునాథ్ మంగళవారం మీడియా ముందు విడుదల చేశారు. విక్టోరియా రాణికి గులామ్ మహ్మద్ లేఖ రాశారని చెప్పారు. తద్వారా టిప్పు వంశస్తులు 60 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి వద్ద పింఛన్ తీసుకున్నట్లు ఇవే ఆధారాలని చెప్పారు. టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేశాడు తప్ప భారత స్వాతంత్య్రం కోసం కాదని అన్నారు. టిప్పును హత్య చేసింది బ్రిటిష్‌వారు కాదు, ఊరి గౌడ, దొడ్డనంజెగౌడ అయి ఉంటారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment