రూ.100 కోట్ల ఆఫర్‌ వచ్చింది: ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల ఆఫర్‌ వచ్చింది: ఎమ్మెల్యే

Nov 19 2024 12:31 AM | Updated on Nov 19 2024 8:39 AM

-

శివాజీనగర: ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల పేరుతో మళ్లీ ఆపరేషన్‌ కమలం చేస్తున్నారని అధికార కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్న సమయంలో మండ్య జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవికుమార్‌ గణిగ మరో ఆరోపణ చేశారు. తమ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు కాదు, రూ.100 కోట్ల ఆఫర్‌ వచ్చిందని చెప్పారు. కిత్తూరు ఎమ్మెల్యే బాబాసాహేబ్‌ పాటిల్‌, చిక్కమగళూరు ఎమ్మెల్యే హెచ్‌.డీ.తమ్మయ్యలను బీజేపీ నాయకులు సంప్రదించారని చెప్పారు. అయితే తమతో ఎవరూ మాట్లాడలేదని పాటిల్‌, తమ్మయ్యలు తరువాత ప్రకటించడంతో గందరగోళం తలెత్తింది. రవికుమార్‌ వద్ద ఆడియో, వీడియో ఆధారాలు ఉంటే విడుదల చేయాలని పాటిల్‌ కోరారు.

సర్కారును కూల్చే కుట్ర: మంత్రి
తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారని మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఆరోపించారు. ఆపరేషన్‌ కమలం చేస్తున్నారనేందుకు సాక్ష్యాలున్నాయి, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పారిశ్రామికవేత్త అదానీ కూల్చారు. మా సర్కారును కూల్చాలంటే అది సఫలం కాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement