పాడుపడిన బావిని తవ్వితే.. | Tippu Sultan Mysorean Rockets Found In An Abandoned Well | Sakshi
Sakshi News home page

పాడుపడిన బావిని తవ్వితే...

Published Sat, Jul 28 2018 3:17 PM | Last Updated on Sat, Jul 28 2018 3:26 PM

Tippu Sultan Mysorean Rockets Found  In An Abandoned Well - Sakshi

తవ్వకాల్లో బయటపడిన టిప్పు సుల్తాన్‌ కాలం నాటి యుద్ద రాకెట్లు

బెంగళూరు : టిప్పు సుల్తాన్‌ భారతదేశ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిన చక్రవర్తి. ఆంగ్లేయులను గడగడలాడించిన ఈ యుద్ధ వీరునికి సంబంధించిన అరుదైన సంపద శిమొగ్గ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఒక పురాతన బావిలో వెలుగు చూసింది. క్రీస్తుశకం 18 వ శతాబ్దంలో మైసూర్‌ యుద్ధంలో వాడిన అరుదైన యుద్ధ సామగ్రి బయటపడింది. ఉప్పరివారు ఒక పురాతన బావిని తవ్వుతుండగా ఈ చారిత్రక సంపద వెలుగులోకి వచ్చినట్లు కర్ణాటక ఆర్కియాలజిస్టులు తెలిపారు.

ఈ విషయం గురించి ఆర్కియాలజి డిపార్ట్‌మెంట్‌ అధికారి ఆర్‌ రాజేశ్వర నాయక ఈ పురాతన బావి నుంచి గన్‌ పౌడర్‌ వాసన రావడంతో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ బావిలో ‘మైసురియన్‌ రాకెట్లు’గా ప్రసిద్ధి గాంచిన 1000 రాకెట్లు, గుళ్లు లభించాయి. వీటిని యుద్ధాలలో వినియోగించడం కోసం ఇక్కడ భద్రపరిచి ఉంటారు. ఈ రాకెట్ల పొడవు 23 - 26 సెంమీల పొడవు ఉన్నాయి. అంతేకాక ఇవి నెపోలియన్‌ చక్రవర్తి ఉపయోగించిన రాకెట్ల మాదిరిగానే ఉన్నాయి’ అని తెలిపారు. వీటిని వెలికి తీయడం కోసం 15 మంది ఆర్కియాలిజిస్ట్‌లు, పనివారు మూడు రోజుల పాటు శ్రమించారన్నారు.

టిప్పు సుల్తాన్‌ 1799లో జరిగిన చివరి ఆంగ్లో - మైసూర్‌ యుద్ధంలో వీర మరణం పొందారు. ఈ యుద్ధల సమయంలోనే టిప్పు సుల్తాన్‌ మైసూరియన్‌ రాకెట్లుగా ప్రసిద్ధి పొందిన ఈ ఆయుధాలను తయారు చేసి, వినియోగించేవారని చరిత్రకారులు అభిప్రాయాపడుతున్నారు. ఆర్కియాలజిస్టుల రికార్డుల ప్రకారం ప్రస్తుతం శిమొగ్గలో ఉన్న కోట టిప్పు సుల్తాన్‌ కాలానికి చెందినది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement