
ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ బలగాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. అయితే.. అక్టోబర్ 7వ తేదీకి హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో హమాస్ దాడి మొదటి వార్షికోత్సవానికి ఒకరోజు ముందు ఇవాళ (ఆదివారం) మరోసారి.. ఉత్తర గాజా నుంచి పలు రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘‘అనేక రాకెట్లు ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించాం. అందులో ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. మిగిలినవి రాకెట్లు జనావాసాలు లేని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. ఇక.. హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తమ సైన్యం మరింత అప్రమత్తంగా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది.
🚨Sirens sounding along Israel’s coast🚨 pic.twitter.com/ebdBsj0vNT
— Israel Defense Forces (@IDF) October 6, 2024
గతేడాది అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి తమ పౌరులను విడిచిపెట్టే వరకు హమాస్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ టార్గెట్ ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 41, 900 మంది పాలస్తీనా పౌరులు మృత్యువాతపడ్డారు.