Shells
-
ఊహించని ఝలక్: రష్యాకు రహస్యంగా ఉత్తరకొరియా ఆయుధ సరఫరా!
వాషింగ్టన్: మధ్య తూర్పు దేశం లేదా ఆఫ్రికాకు ఆయుధాలు రవాణా చేసే ముసుగులో ఉత్తర కొరియా రష్యాకు రహస్యంగా మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఉత్తర కొరియా ఆఫ్రికాకు సరఫరా చేస్తున్న ముసుగులో రష్యాకు గణనీయంగా ఆయుధ సామాగ్రిని పంపుతున్నట్లు యూఎస్ పేర్కొంది. అయితే రష్యా ఆ మందుగుండు సామాగ్రిని స్వీకరించిందో లేదో తెలియదు అని వైట్ హౌస్ జాతీయ ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. తాము ఆ మందు సామాగ్రి పర్యవేక్షించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క అమెరికా రష్యా ఉక్రెయిన్ మీద సాగిస్తున్న దురాక్రమణ చర్యకు ఆగ్రహంతో ఆంక్షలు విధించి ఉక్రెయిన్‌కి మిలటరీ సాయం అందిస్తోంది. మరోవైపు ఇదే సరైన సమయం యూఎస్‌పై పగ సాధించేందుకు అనుకుందో ఏమో ఉత్తరకొరియా పక్కగా వ్యూహా రచన చేసింది. దక్షిణ కొరియాతో యూఎస్ చేసిన సైనిక కసరత్తులకు ప్రతిగా ఇలా ఉత్తర కొరియా తన ప్రతీకారం తీర్చుకుంటోందో ఏమో! వేచి చూడక తప్పదు. (చదవండి: పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు) -
Fashion: అలంకరణకు కొన్ని గవ్వలు .. ధర రూ.100 నుంచి వెయ్యి వరకు!
సముద్ర తనయకు గవ్వలు అంటే ఎంతో ఇష్టం. అందుకేనేమో.. సౌందర్యాన్ని పెంచుకోవడంలో తరుణులు గవ్వలను ఎంచుకుంటున్నారు. బీచ్ జ్యువెల్రీగా పేరొందిన గవ్వల ఆభరణాలు ఇప్పుడు మన సంప్రదాయ పెళ్లి కూతురు వేడుకలోనూ అందంగా అమరిపోయాయి. ఆధునిక వస్త్రధారణ పైకి అంతే ఆధునిక కళను మోసుకొస్తున్నాయి. చీరకట్టుకు కొత్త సొగసును ఇస్తున్నాయి. ఏ వేడుకైనా అందుకు తగినట్టుగా ఇమిడిపోతున్న గవ్వల గమకాలు ఇక అందరూ ఒడిసిపట్టుకోవచ్చు. ఫ్యాషన్ జ్యువెలరీగానూ, సంప్రదాయ ఆభరణంగానూ గవ్వల స్థానం రోజు రోజుకూ పెరగుతుందనడానికి ఈ మోడల్సే ఓ ఉదాహరణ. ఎవరికి వారు వినూత్నంగా తమదైన సృజనతో డిజైన్ చేసుకోవచ్చు. పెళ్లి కూతురు పసుపు–మెహందీ వేడుకల్లో ఆభరణాలుగా పువ్వుల అలంకరణ చేస్తుంటారు. వీటి స్థానంలో గవ్వలు కూడా వచ్చి చేరి, మరింతగా కనువిందు చేస్తున్నాయి. రంగుతాళ్లతో దోస్తీ పెయింట్ చేసిన లాకెట్స్కు గవ్వలను చేర్చి, రంగు తాళ్లతో అమర్చితే అందమైన ఆభరణంగా మారిపోతుంది. ఇవి కాటన్ దుస్తుల మీదకు అందంగా నప్పుతాయి. మోడర్న్ డ్రెస్సుల మీదకు మరింత మోహనంగా అమరిపోతాయి. వరుసలు వరుసలు మెడలో హారాలుగానే కాదు, కొప్పులో మల్లెలుగానూ గవ్వలు కొత్త కళను తీసుకువస్తున్నాయి. కాసులపేరు వలె గవ్వలపేరు ఓ అందమైన అలంకరణ. దానికి కొన్నిపూసలు జోడీ కడితే అన్ని రంగుల కూర్పుతో ఇంద్రధనుసును మెడలో వేసుకున్నట్టే ఉంటుంది. ఎంబ్రాయిడరీలో మేటి బ్లౌజ్‌కు, లెహంగాలకు చేసే ఎంబ్రాయిడరీలో గవ్వలు జత చేరి మరింత ఆకర్షణీయంగా కనువిందుచేస్తున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రూ.100 నుంచి గవ్వల అలంకరణ బట్టి వేయి రూపాయల వరకు పలుకుతున్న ఈ ఆభరణాలు అలంకరణలో అదుర్స్ అనిపిస్తాయి. అద్దాలతో జోడీ డిజైనర్ డ్రెస్సుల గురించి మాట్లాడుకునే సందర్భాలలో మిర్రర్ వర్క్ గురించిన సందర్భం వస్తుంటుంది. ఈ అద్దాల అలంకరణనే ఆభరణాలలోకి తీసుకుంటే ఫ్యాబ్రిక్ మెటీరియల్– గవ్వలతో మరింత ఆకర్షణీయమైన జ్యువెల్రీని రూపుకట్టవచ్చు. ఇక్కడా ఓ లుక్కేయండి: Cannes 2022 Look: కాన్స్.. మన తారల లుక్ అదుర్స్! డ్రెస్ ఎంపికలోనే అంతా! -
ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’
‘మనసుంటే మార్గమూ ఉంటుంది’ అనే నానుడి మరోసారి నిజమైంది. కేరళ, త్రిశూర్ అమ్మాయి మారియా కురియాకోస్ ఎంబీఏ చేసింది. ముంబయిలో ఒక సోషల్ ఎంటర్ ప్రైజ్‌లో ఉద్యోగం చేసింది. ‘తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించలేకపోతే జీవితానికి పరమార్థం ఏముంటుంది?’ అని కూడా అనుకుంది. ఉద్యోగం మానేసి సొంతూరు త్రిశూర్కి వచ్చేసింది. ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలనే స్పష్టత రావడం లేదు. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయి? అలా ఊరంతా తిరిగి నలుగురిని చూస్తే కదా తెలిసేది... అనుకుంది. త్రిశూర్‌లో ఏమున్నాయి? ఏమి లేవు అనేది కూడా తెలుసుకోవాలి కదా! అనుకుంటూ త్రిశూర్‌లోని రోడ్లన్నీ చుట్టిరావడం మొదలుపెట్టింది. తనకు తెలిసిన ఊరే అయినా, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఒక కొబ్బరి నూనె మిల్లు కనిపించింది. కేరళ అమ్మాయికి కొబ్బరి నూనె మిల్లును చూడడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆమె దృష్టిని ఆకర్షించింది కొబ్బరి నూనె కాదు, నూనె కోసం కొబ్బరి వలిచిన తర్వాత మిగిలిన ఖాళీ కొబ్బరి చిప్పలు. రాశులుగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారని అడిగింది. పొయ్యిలో వంటచెరకుగా వాడతారు, ఇటుకలను కాల్చడానికి బట్టీల్లో వాడతారని తెలుసుకుంది. అంత గట్టి మెటీరియల్ బొగ్గుగా కాలిపోవడమేంటి? వీటిని ఉపయోగించే తీరు ఇది కాదు, మరింత ఉపయుక్తంగా ఉండాలని ఆలోచించింది మారియా. కోకోనట్ కప్ కొబ్బరి చిప్పలు కిందపడినా పగలవు. ఇంకేం! సెంటెడ్ క్యాండిల్ తయారు చేయడానికి గాజు కుండీలకంటే కొబ్బరి పెంకులే మంచి బేస్ అనుకుంది మారియా. సూప్ తాగడానికి కూడా పింగాణీ కప్పుల కంటే కొబ్బరి పెంకు కప్పులే సేఫ్. అంతే కాదు, హ్యాంగింగ్ గార్డెన్‌కి కూడా కొబ్బరి కుండీలే. ఫోర్క్‌లు, స్పూన్లు కూడా. మన్నిక ఓకే, మరి కొబ్బరి పెంకును అందంగా తీర్చిదిద్దడం ఎలా? తండ్రి మెకానికల్ ఇంజనీర్. రిటైరయ్యాడు కాబట్టి ఆయన కూతురికి అవసరమైన యంత్రాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. పూర్వం స్టీలు గరిటెలు, గిన్నెలు లేని రోజుల్లో గరిటలుగా కొబ్బరి చిప్పలనే వాడేవారని తెలుసుకున్న తర్వాత మారియా ఆ వృత్తి పని వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పని అన్నానికి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ఇతర ఉపాధి పనులకు మారిపోయారు. త్రిశూర్, కొట్టాయం, వయనాడుల్లో విస్తృతం గా సర్వే చేసి, ఆ వృత్తిదార్లను సమీకరించింది. ఇప్పుడామెతో కలిసి పదిమంది పని చేస్తున్నారు. గతంలో అయితే కొబ్బరి చిప్పలను ఉలి సహాయంతో చేత్తోనే నునుపుగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మారియా డిజైన్ చేయించుకున్న మెషీన్‌తో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ‘తెంగ’ పేరుతో ఆమె రిజిస్టర్ చేసుకున్న పరిశ్రమ ఇప్పుడు స్థిరమైన రాబడినిస్తోంది. తెంగ ఉత్పత్తులకు కేరళతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లకు పేర్లు ముద్రించి ఇవ్వడం ఆమె ఎంచుకున్న మరో చిట్కా. అమెజాన్ ద్వారా జర్మనీలో అమ్మకాలకు కూడా రంగం సిద్ధమైంది. కేరళలో కొబ్బరి వలిచిన ఖాళీ కొబ్బరి చిప్పలు సూప్ బౌల్స్‌గా జర్మనీకి చేరనున్నాయి. తండ్రితో మారియా కురియాకోస్ -
పసుపు గవ్వలు
♦ సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో రకరకాలు ఉంటాయి. వైకుంఠపాళి వంటి ఆటల్లో, జూదక్రీడల్లో వీటిని ఉపయోగిస్తారనే సంగతి తెలిసినదే. వీటిలో కొంత అరుదుగా దొరికే పసుపు గవ్వలకు విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది ♦ ఇవి లేత పసుపురంగులో కాస్త చిన్నగా ఉంటాయి. పసుపు గవ్వలతో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగుతుంది ♦ జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు, రాహు కేతు దోషాలు ఉన్నవారు పసుపు గవ్వలను పూజమందిరంలో ఉంచి, వాటికి ధూప దీపాలను సమర్పించడం వల్ల ఉపశమనం దొరుకుతుంది ♦ ఎలాంటి పూజల్లోనైనా పసుపు గవ్వలను బేసి సంఖ్యలో ఉపయోగించడమే మంచిది ♦ పదకొండు పసుపు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి, శుక్రవారం రోజున పూజించి, ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచినట్లయితే ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది. – పన్యాల జగన్నాథ దాసు -
పాడుపడిన బావిని తవ్వితే..
బెంగళూరు : టిప్పు సుల్తాన్ భారతదేశ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిన చక్రవర్తి. ఆంగ్లేయులను గడగడలాడించిన ఈ యుద్ధ వీరునికి సంబంధించిన అరుదైన సంపద శిమొగ్గ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఒక పురాతన బావిలో వెలుగు చూసింది. క్రీస్తుశకం 18 వ శతాబ్దంలో మైసూర్ యుద్ధంలో వాడిన అరుదైన యుద్ధ సామగ్రి బయటపడింది. ఉప్పరివారు ఒక పురాతన బావిని తవ్వుతుండగా ఈ చారిత్రక సంపద వెలుగులోకి వచ్చినట్లు కర్ణాటక ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ విషయం గురించి ఆర్కియాలజి డిపార్ట్మెంట్ అధికారి ఆర్ రాజేశ్వర నాయక ఈ పురాతన బావి నుంచి గన్ పౌడర్ వాసన రావడంతో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ బావిలో ‘మైసురియన్ రాకెట్లు’గా ప్రసిద్ధి గాంచిన 1000 రాకెట్లు, గుళ్లు లభించాయి. వీటిని యుద్ధాలలో వినియోగించడం కోసం ఇక్కడ భద్రపరిచి ఉంటారు. ఈ రాకెట్ల పొడవు 23 - 26 సెంమీల పొడవు ఉన్నాయి. అంతేకాక ఇవి నెపోలియన్ చక్రవర్తి ఉపయోగించిన రాకెట్ల మాదిరిగానే ఉన్నాయి’ అని తెలిపారు. వీటిని వెలికి తీయడం కోసం 15 మంది ఆర్కియాలిజిస్ట్‌లు, పనివారు మూడు రోజుల పాటు శ్రమించారన్నారు. టిప్పు సుల్తాన్ 1799లో జరిగిన చివరి ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో వీర మరణం పొందారు. ఈ యుద్ధల సమయంలోనే టిప్పు సుల్తాన్ మైసూరియన్ రాకెట్లుగా ప్రసిద్ధి పొందిన ఈ ఆయుధాలను తయారు చేసి, వినియోగించేవారని చరిత్రకారులు అభిప్రాయాపడుతున్నారు. ఆర్కియాలజిస్టుల రికార్డుల ప్రకారం ప్రస్తుతం శిమొగ్గలో ఉన్న కోట టిప్పు సుల్తాన్ కాలానికి చెందినది. -
రాతిగుండు రహస్యం చెప్పేనా?
చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల వేట రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్న విషయం విదితమే. ఆదివారం.. ఎనిమిది రాతి గుండ్లు, గదుల ఆకారంలో రెండు గుంతలు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పట్టువదలకుండా ఇక్కడ తవ్వకాలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా, చెన్నంపల్లి (తుగ్గలి): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో 36 రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో ఆదివారం రాతి గుండ్లు బయటపడ్డాయి. గుప్త నిధులు, నిక్షేపాలంటూ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 13న కోటలో తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఇటుకలు, ఎముకలు, ఇనుప ముక్కలు బయటపడ్డాయి. తరువాత జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారుల సూచన మేరకు.. ఈనెల 3న తవ్వకాలు పునఃప్రారంభించారు. ఆదివారం ఎనిమిది గుండ్రటి రాతి గుండ్లు బయట పడ్డాయి. వీటిని ఫిరంగి గుండ్లుగా భావిస్తున్నారు. గదుల ఆకారంలో రెండు గుంతలు ఉండడం, రాతి గుండ్లు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికా రులు భావిస్తున్నారు. జీఎస్ఐ అధికారులు మూడు చోట్ల తవ్వకాలు జరపాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు అధికారులు తవ్వకాలు జరుపనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. -
గవ్వల సముద్రం..
ఎక్కడైనా సముద్ర తీరం అంటే ఎలా ఉండాలి? తీరం మొత్తం ఇసుకతో కప్పి ఉండాలి. కానీ ఈ ఫొటోలో చూడండి ఇసుక ఇసుకంతయినా కనిపించదు... ఎందుకంటే ఇక్కడ మొత్తం గవ్వలతో నిండిపోయింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ గవ్వల సముద్ర తీరం ఉంది. చాలా ఏళ్లుగా ఈ సముద్ర తీరం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సుమారు 70 కిలోమీటర్ల మేర అక్కడక్కడ 10 మీటర్ల లోతులో ఈ గవ్వలు సముద్ర తీరాన పరుచుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వేల సంవత్సరాల క్రితమే సముద్ర తీరంలో ఈ గవ్వలు ఏర్పడ్డాయి. తొలుత ఇవి చాలా చిన్నగా మిల్లీ మీటర్ల పరిమాణంలో కొద్ది దూరంలో మాత్రమే విస్తరించి ఉండేవి. కానీ కాలానుక్రమంగా చాలా పెద్ద గవ్వలుగా మారడమే కాకుండా కిలో మీటర్ల కొద్దీ విస్తరించి ఉన్నాయి. ఇంత విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వీటిని 19, 20వ దశకాల్లో ప్రజలు ఇళ్లు, రెస్టారెంట్లు, చర్చిల నిర్మాణంలో విరివిగా ఉపయోగించేవారు. ఆ తర్వాత దీన్ని 1991లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడంతో గవ్వల వినియోగాన్ని నిషేధించారు. దీంతో ఈ విధంగా సముద్ర తీరం మొత్తం కోట్ల సంఖ్యలో ఈ విధంగా పరుచుకుని చాలా అందంగా దర్శనమిస్తోంది. -
పిస్తా కవచాలపై గణనాథులు
ఓల్డ్ బోయిన్పల్లి: పిస్తా కవచాలు (సముద్రం వద్ద లభించే గవ్వలు) మీద 108 ఆకృతులతో అక్రలిక్ రంగులతో గణనాథులను 9 గంటలలో వేసి... వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న కాసుల పద్మావతిని పలువురు అభినందించారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని కార్యాలయంలో సంస్థ భారతదేశ ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి డాక్టరు గుర్రం స్వర్ణశ్రీ, దైవజ్ఞశర్మలు పద్మావతికి ధ్రువపత్రం అందజేశారు. -
సముద్రమంత అందం
సముద్ర తీరంలో దొరికే గవ్వలు... ఆల్చిప్పలను ఏరుకుని గర్వంగా దాచుకున్న తడి జ్ఞాపకం బాల్యంలో అందరి అనుభవం. ఆ అందమైన వాటిని దాచేయకుండా... చెవి లోలాకులా, మెడలో హారంలా అందరికీ షో చెయ్యొచ్చు. అవును సీషెల్స్‌ను ఒక్కసారి పరికించి చూడండి. ఒకదానితో ఒకటి పోటీపడే అందమైన రూపం. వాటితో తయారైన అద్భుతమైన కళాకృతులేలేటెస్ట్ ఫ్యాషన్! ఆల్చిప్పల్లాంటి కళ్లు అమ్మాయికి అందం. కానీ ఆల్చిప్పల్నే అమ్మాయిగా మలిస్తే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి సెట్స్ ఇప్పుడు ఎన్నో. ఆల్చిప్పలతో తయారైన అందమైన అమ్మాయి చేతిలో వీణ వాయిస్తున్న అందమైన చిత్రం చూస్తే మన మదిలో వీణలు మోగుతాయి. మెడలో ముత్యాలహారం... అందరికీ తెలిసిందే! ఆ ముత్యాలకు ఆల్చిప్పలు, గవ్వలు దండ గుచ్చి వేసుకుంటే చూసినవాళ్లు కళ్లప్పగించడం ఖాయం. ఇక ఆల్చిప్పలతో యునిక్‌గా డిజైన్ చేసిన హ్యాండ్ బ్యాగ్‌లూ రీసెంట్ పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి. ఫ్యాషన్ డిజైనర్లు సైతం ఇప్పడు సీషెల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ముత్యాలు, కుందన్ల స్థానంలో బట్టలకి రంగురాళ్లు, గవ్వలు, ఆల్చిప్పలను ఉపయోగిస్తున్నారు. ఇవేకాదు మగువల చేతికి గాజుల్లానూ, వాల్ హ్యాంగింగ్స్లోనూ అందంగా కొలువుదీరుతున్నాయి. షెల్స్‌తో తయారు చేసిన యాష్ ట్రేలు ఇప్పుడు టేబుల్‌పై దర్జా ఒలకబోస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన సీషెల్స్ కంటే సహజమైన ఫ్యాషన్ ప్రస్తుతం ఇంకేదీ లేదంటున్నారు డిజైనర్స్. ఆ ప్రకృతి ప్రసాదాలను టెక్నాలజీ సాయంతో అత్యద్భుతంగా తీర్చిదిద్ది గృహాలంకరణ నుంచి ఆభకరణాల వరకూ డిజైన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. - శిరీష చల్లపల్లి