వాషింగ్టన్: మధ్య తూర్పు దేశం లేదా ఆఫ్రికాకు ఆయుధాలు రవాణా చేసే ముసుగులో ఉత్తర కొరియా రష్యాకు రహస్యంగా మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఉత్తర కొరియా ఆఫ్రికాకు సరఫరా చేస్తున్న ముసుగులో రష్యాకు గణనీయంగా ఆయుధ సామాగ్రిని పంపుతున్నట్లు యూఎస్ పేర్కొంది. అయితే రష్యా ఆ మందుగుండు సామాగ్రిని స్వీకరించిందో లేదో తెలియదు అని వైట్ హౌస్ జాతీయ ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.
తాము ఆ మందు సామాగ్రి పర్యవేక్షించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క అమెరికా రష్యా ఉక్రెయిన్ మీద సాగిస్తున్న దురాక్రమణ చర్యకు ఆగ్రహంతో ఆంక్షలు విధించి ఉక్రెయిన్‌కి మిలటరీ సాయం అందిస్తోంది. మరోవైపు ఇదే సరైన సమయం యూఎస్‌పై పగ సాధించేందుకు అనుకుందో ఏమో ఉత్తరకొరియా పక్కగా వ్యూహా రచన చేసింది. దక్షిణ కొరియాతో యూఎస్ చేసిన సైనిక కసరత్తులకు ప్రతిగా ఇలా ఉత్తర కొరియా తన ప్రతీకారం తీర్చుకుంటోందో ఏమో! వేచి చూడక తప్పదు.
(చదవండి: పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు)
Comments
Please login to add a commentAdd a comment