♦ సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో రకరకాలు ఉంటాయి. వైకుంఠపాళి వంటి ఆటల్లో, జూదక్రీడల్లో వీటిని ఉపయోగిస్తారనే సంగతి తెలిసినదే. వీటిలో కొంత అరుదుగా దొరికే పసుపు గవ్వలకు విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది
♦ ఇవి లేత పసుపురంగులో కాస్త చిన్నగా ఉంటాయి. పసుపు గవ్వలతో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగుతుంది
♦ జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు, రాహు కేతు దోషాలు ఉన్నవారు పసుపు గవ్వలను పూజమందిరంలో ఉంచి, వాటికి ధూప దీపాలను సమర్పించడం వల్ల ఉపశమనం దొరుకుతుంది
♦ ఎలాంటి పూజల్లోనైనా పసుపు గవ్వలను బేసి సంఖ్యలో ఉపయోగించడమే మంచిది
♦ పదకొండు పసుపు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి, శుక్రవారం రోజున పూజించి, ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచినట్లయితే ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది.
– పన్యాల జగన్నాథ దాసు
పసుపు గవ్వలు
Published Sun, Oct 28 2018 1:06 AM | Last Updated on Sun, Oct 28 2018 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment