ఎక్కడైనా సముద్ర తీరం అంటే ఎలా ఉండాలి? తీరం మొత్తం ఇసుకతో కప్పి ఉండాలి. కానీ ఈ ఫొటోలో చూడండి ఇసుక ఇసుకంతయినా కనిపించదు... ఎందుకంటే ఇక్కడ మొత్తం గవ్వలతో నిండిపోయింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ గవ్వల సముద్ర తీరం ఉంది. చాలా ఏళ్లుగా ఈ సముద్ర తీరం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సుమారు 70 కిలోమీటర్ల మేర అక్కడక్కడ 10 మీటర్ల లోతులో ఈ గవ్వలు సముద్ర తీరాన పరుచుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వేల సంవత్సరాల క్రితమే సముద్ర తీరంలో ఈ గవ్వలు ఏర్పడ్డాయి. తొలుత ఇవి చాలా చిన్నగా మిల్లీ మీటర్ల పరిమాణంలో కొద్ది దూరంలో మాత్రమే విస్తరించి ఉండేవి. కానీ కాలానుక్రమంగా చాలా పెద్ద గవ్వలుగా మారడమే కాకుండా కిలో మీటర్ల కొద్దీ విస్తరించి ఉన్నాయి.
ఇంత విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వీటిని 19, 20వ దశకాల్లో ప్రజలు ఇళ్లు, రెస్టారెంట్లు, చర్చిల నిర్మాణంలో విరివిగా ఉపయోగించేవారు. ఆ తర్వాత దీన్ని 1991లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడంతో గవ్వల వినియోగాన్ని నిషేధించారు. దీంతో ఈ విధంగా సముద్ర తీరం మొత్తం కోట్ల సంఖ్యలో ఈ విధంగా పరుచుకుని చాలా అందంగా దర్శనమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment