Hindutva agenda
-
గొడవలు చేయగల సత్తా నాకూ ఉంది : పవన్ కళ్యాణ్
విజయవాడ, సాక్షి: ఒక సనాతనవాదిగా, హిందువుగా బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా తనకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటున్నారు. హిందువులకు ఇతర మతాలపై విద్వేషం ఉండదని, కానీ, సెక్యులరిజం అనేది అన్ని వైపులా నుంచి రావాలని అన్నారాయన.మంగళవారం ఉదయం ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి పవన్ వచ్చారు. ఆపై తిరుమల లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్సీపీ సహా తన మీద పలువురు విమర్శలు చేయడంపై ఆయన స్పందించారు. ‘‘సాటి హిందువులే హిందుత్వాన్ని కించపరుస్తున్నారు. తోటి హిందువులను కించపరుస్తున్నారు. ఇష్టానికి మాట్లాడుతున్నారు. మరి మిగతా మతాల మీద జోకులేయరేం?. నన్ను పచ్చిబూతులు తిట్టినా మౌనంగా ఉన్నా. కానీ నన్ను విమర్శించేవాళ్లకు చెబుతున్నా. సనాతన ధర్మం జోలికి రావొద్దు. చేస్తే.. బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా నాకుంది... చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రిదాకా రామనామమే వినిపిస్తుంది. రామ భక్తులం మేం. అలాంటిది సనాతన ధర్మం మీద దాడి జరిగితే మాట్లాడొద్దంటే.. ఏమనాలి?. హిందువులుగా అది మీ బాధ్యత కాదా? ధర్మాన్ని పరిరక్షించరా?’’. .. తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌ను తానేం నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని, ఆ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలని మాత్రమే కోరుతున్నానని పవన్ అన్నారు... ‘‘భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా?. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయం. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి. మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడాలి. నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డూ గురించి మాట్లాడారు’’.తనను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడంపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. ‘‘అపవిత్రం జరిగిందనే నేను మాట్లాడాను తప్ప.. మరో మతాన్ని ఏమైనా నిందించానా?. ఆ మాత్రం దానికే గోల చేయకూడదని ప్రకాశ్ రాజ్ అంటున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా?. ఏం పిచ్చి పట్టింది మీకు? ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరంటే గౌరవం ఉన్నా.. అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను. .. ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు. మాకు ఇదంతా చాలా బాధ. మీ ఇష్టానికి సనాతన ధర్మం పై మాట్లాడుతున్నారు. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవి లపై జోకులు వేస్తారా?. ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టే సనాతన ధర్మం బోర్డు రావాలని తాను కోరుతున్నానని అన్నారు. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా?’’ అని పవన్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఈ పెద్దమనిషికి సనాతన ధర్మం అంటే తెలుసా? -
‘బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా.. హిందుత్వాన్ని వదులుకోలేదు’
ముంబై: బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా.. శివసేన (యూబీటీ) ఎప్పుడూ హిందుత్వాన్ని వదులుకోలేదని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ముంబైలో నివసిస్తున్న మరాఠీ ప్రజలు, ఉత్తర భారత ప్రజల మధ్య తామెప్పుడూ వివక్ష చూపలేదు, చూపబోమన్నారు. గత అపార్థాలను మనసులోంచి తొలగించుకోవాలని ఉత్తర భారత సమాజానికి విజ్ఞప్తి చేశారు. ముంబైలో ఉత్తర భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ఉద్దవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మోదీని కాపాడకపోయి ఉంటే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదన్నారు. హిందుత్వ అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను విభజించడం కాదని అన్నారు. ‘‘నేను బీజేపీతో విభేదించాను, కానీ నేను హిందుత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. బీజేపీ అంటే హిందుత్వ కాదు. ఒకరినొకరు ద్వేషించుకోవడం హిందుత్వం కాదు’’ అన్నారు. బీజేపీ హిందువుల మధ్య చీలికను సృష్టిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ 25-30 ఏళ్లు రాజకీయపరమైన స్నేహబంధాన్ని కాపాడిందని గుర్తు చేశారు. మతంతో సంబంధం లేకుండా భారత్‌ను ద్వేషించేవారికే బాలాసాహెబ్ వ్యతిరేకమని ప్రస్తావించారు. కానీ బీజేపీ మాత్రం తమని వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు. శివసేన, అకాలీదళ్‌తో ఉన్న సుదీర్ఘ బంధానికి బీటలు వారడాన్ని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు బీజేపీతో పొత్తు నుంచి వైదొలిగినట్లు ఠాక్రే చెప్పారు. ‘‘లేకపోతే ఇప్పుడు నా మనుషుల్లో కొందరు మారినట్లే.. నేనూ నా మెడకు బెల్టు పెట్టుకుని బానిసగా పడి ఉండేవాడిని’ అని శివసేన (శిండే) వర్గాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఉత్తర భారతీయులను లేదా ముస్లింలను కలిసినప్పుడల్లా, హిందుత్వంపై ప్రశ్నించినప్పుడల్లా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చదవండి: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో'.. ప్రారంభించిన మోదీ.. ‘మీతో నా భేటీపై విమర్శలు వచ్చాయి.. ముస్లింలను కలిస్తే హిందుత్వాన్ని వదులుకున్నాడని నాపై ఆరోపణలు చేస్తారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ముంబై వచ్చినప్పుడు ఎవరి వంటింటిలోకి వెళ్లాడు? నేనే అలా చేసి ఉంటే ఈ పాటికి హిందూ వ్యతిరేకిని అయిపోయేవాడిని. కానీ ప్రధానమంత్రి అలా చేస్తే మాత్రం ఆయనది చాలా పెద్ద మనసని చెబుతారు. ఇదేం ద్వంద్వ వైఖరి? బోహ్రా వర్గానికి వ్యతిరేకంగా మేం ఎప్పుడూ లేం. వారు మాతోనే ఉన్నారు’ అని ఉద్ధవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు మంచి రోజు ఇక భగత్‌సింగ్ కోశ్యారీ రాజీనామా ఆమోదంపై ఉద్ధవ్ స్పందిస్తూ... ఇది రాష్ట్రానికి మంచిరోజన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషికాన్ని ఉత్తర భారతదేశానికి చెందిన పూజారి జరిపించారని, ఈ రోజు శివాజీ మహరాజ్‌ను అవమానించిన వ్యక్తిని వెనక్కి పంపారని ఆయన అన్నారు. -
అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు తమ వ్యూహాన్ని మార్చేసి... మళ్లీ హిందుత్వ జపం చేస్తోంది. మొదట అభివృద్ధి మంత్రం పఠించి... ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే యూపీలో ప్రాంతాల వారీగా భారీ స్థాయిలో ప్రధాని చేత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించిన కమలదళం తీరా సెమీఫైనల్ (దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. దీన్ని సెమీఫైనల్‌గా అభివర్ణిస్తారు. భారత భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని యూపీ ఫలితాలు ప్రతిబింబిస్తాయనేది రాజకీయ పండితుల అభిప్రాయం) మొదలయ్యే నాటికి ఎందుకు రూటు మార్చేసింది. మళ్లీ హిందుత్వ ఎజెండాను ఎందుకు బలంగా ఎత్తుకుంది. అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని గట్టి సంకేతాలు అందాయా? అందుకే మళ్లీ పాతపాటే ఎత్తుకుందా? యూపీలో రెండు దశల ఎన్నికలు ముగిశాక తాజా పరిస్థితి ఎలా ఉందనే దానిపై సవివర కథనం... సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా 2013లో పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలో జాట్లు– ముస్లింలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. 60 మంది దాకా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. ముస్లిం వేధింపులు పెరగడంతో 2014–16 దాకా కైరానా నుంచి హిందూ కుటుంబాలు అభద్రతాభావంతో భారీగా వలసవెళ్లాయి. ఈ రెండు అంశాలనూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయవంతంగా వాడుకుంది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలు కాకుండా ఒక్క బీజేపీయే ఏకంగా 312 సీట్లతో జాక్‌పాట్ కొట్టింది. అయితే 2022 ఎన్నికలు ఆరు నెలల ముందు నుంచే యూపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. హిందుత్వ కార్డు ఈసారి పనికిరాదనుకున్న బీజేపీ.. ముందస్తు వ్యూహంతో అభివృద్ధి మంత్రాన్ని జపించింది. ఏకంగా సుమారు లక్ష కోట్లకు పైగా విలువైన పనులకు కొబ్బరికాయలు కొట్టింది. రహదారులు, ఎయిర్‌పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ఎరువుల కార్మాగారాలు దేన్నీ వదలకుండా ఓట్లను రాబట్టే ప్రధాన రంగాల్లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు రిబ్బన్కటింగ్లు చేసి, పునాదిరాళ్లు వేసింది. రెండు నెలల్లో యూపీలో 16 ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని గత ఏడాది అక్టోబర్ నుంచి జనవరి 8న ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా 16 పెద్ద ర్యాలీల్లో స్వయంగా పాల్గొని ఎన్నికల హీట్‌ను పెంచే ప్రయత్నం చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌లు ప్రతి మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలో ర్యాలీ లేదా రోడ్–షో నిర్వహించారు. అసెంబ్లీ స్థానాలపరంగా చూస్తే ఈ ముగ్గురూ యూపీలోని 403 సీట్లలో 68 శాతం సీట్లు అనగా 275 నియోజకవర్గాలను చుట్టేశారు.. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకుగాను 47 జిల్లాల్లో 112 సభలు, ర్యాలీలు జరగగా, అందులో మోదీ 16, అమిత్ షా 20, యోగి ఆదిత్యనాథ్ 76 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏక్ ఔర్ ధక్కా.. కుర్చీ పక్కా! çపశ్చిమ యూపీలో సమాజ్‌వాదీ– రాష్ట్రీయ లోక్‌దళ్ జట్టుకట్టడంతో ఈనెల 10వ తేదీన పశ్చిమ యూపీలో 58 స్థానాలకు జరిగిన తొలిదశ పోలింగ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. పశ్చిమ యూపీ 26 శాతానికి పైగా ముస్లింలు, 3.5 శాతం జాట్లు ఓట్లు ఉండటం, వీరికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 10 శాతం ఉన్న యాదవ ఓట్లలో సింహభాగంగా ఎలాగూ ఎస్పీ కూటమికే పడతాయి. దానికి ఓబీసీల్లోని కొన్నివర్గాలు తోడైతే బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా అవతరించిన ఈ కూటమికి 45 శాతం పైచిలుకు ఓట్లు సునాయాసంగా పడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే తొలి దశలో 62.4 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడంతో ప్రభుత్యానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు ఓటింగ్‌కు ముందుకు రాలేదని కొందరు వాదించారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా జరిగిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పశ్చిమ యూపీ రైతులు ఓటింగ్ వచ్చేసరికి ఆ స్థాయి పట్టుదలను చూపలేదని అభిప్రాయపడ్డారు. అయితే సోమవారం బీజేపీకి స్వల్ప మొగ్గున్న రెండోదశలోని 55 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లోనూ 60.44 ఓటింగ్ శాతమే నమోదు కావడం గమనార్హం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలతలు దాదాపు సమంగా ఉన్నట్లు భావించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ లేదా కూటమి కనీసం 2 నుంచి 3 శాతం అధిక ఓట్లు సాధిస్తే.. విజయతీరాలకు చేరే అవకాశాలుంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే ఎవరైతే మిగిలిన ఆరు దశల్లో సర్వశక్తులూ ఒడ్డి ‘ఏక్ ఔర్ ధక్కా’ అంటారో.. వారికి అధికార పీఠం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించొచ్చు. మొదటి దశ కాగానే.. హిందుత్వ వాడిని మరింత పెంచిన బీజేపీ మథురలో ఆలయం కడతామంటూ ఎన్నికలకు కొద్దినెలల ముందు కొత్త పల్లవి అందుకున్న బీజేపీ.. ఈ నెల 10çన తొలిదశ తర్వాత హిందుత్వ వాడివేడిని మరింతగా పెంచేసింది. గతంలో ఎస్పీ హయాంలో ‘అబ్బా జాన్ (ముస్లింను ఉద్దేశించి)’ అనే వారికే రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ అందేవని వ్యాఖ్యానించడం ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మతపరమైన ఎజెండాను మరింతగా ముందుకుతెచ్చారు. ఆపై 80–20 (ఉత్తరప్రదేశ్ జనాభాలో హిందువులు– ముస్లింల నిష్పత్తి) మధ్య యుద్ధంగా 2022 అసెంబ్లీ ఎన్నికలను అభివర్ణించారు. ప్రధాని మోదీ కూడా ఉత్తరాఖండ్ ప్రచారంలో శనివారం మాట్లాడుతూ... దేవభూమి అయిన ఈ రాష్ట్రంలో ముస్లిం యూనివర్శిటీని పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ఇలా హిందువుల ఓట్లను సంఘటితం చేయడానికి ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతలంతా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిఘా సమాచారం, కేంద్రంలోని ఇంటలిజెన్స్ బ్యూరో పకడ్బందీగా ఇచ్చే ఫీడ్‌బ్యాక్, వాస్తవ సరిస్థితులను ప్రతిబింబించే ఆర్ఎస్ఎస్ ఇచ్చే నివేదికలు, బీజేపీ పార్టీపరంగా అందే రిపోర్టులు, స్వతంత్ర సంస్థలతో చేయించే సర్వేలు.. ఇలా బీజేపీకి ఇన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో ఏం జరగుతోందనే సమాచారం అందుతుంది. వీటిల్లో అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని పక్కా సమాచారం ఉండటంతోనే మరోదారి లేక బీజేపీ మళ్లీ హిందుత్వ నినాదాన్ని (ఈసారి పనిచేయడం లేదని తెలిసీ) అందుకొని ఉండొచ్చనేది కొందరు రాజకీయ పండితుల అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
హిందుత్వని విడిచిపెట్టను
ముంబై: హిందుత్వ ఎజెండాను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడారు. ‘‘హిందుత్వ భావజాలాన్ని నేను విడిచిపెట్టలేను. నా నుంచి ఎవరూ దానిని దూరం చేయలేరు‘‘అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంలో లౌకికవాదాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రెండు, మూడు రోజుల్లోనే ఠాక్రే అసెంబ్లీ సాక్షిగా హిందూత్వపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘హిందు త్వని నిన్న అనుసరించాను. ఇవాళ అనుసరిస్తున్నాను. రేపు కూడా అనుసరిస్తాను’అని చెప్పారు. అర్ధరాత్రి ఏమీ చెయ్యను ఫడ్నవీస్‌పై కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఠాక్రే ప్రసంగం సాగింది. ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ మళ్లీ నేనే వస్తా అన్న నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ‘నేను ఎప్పుడూ మళ్లీ వస్తానని చెప్పలేదు. కానీ ఈ సభకు వచ్చాను. మహారాష్ట్ర ప్రజలకి, ఈ సభకి నేను ఒక హామీ ఇస్తున్నాను. రాత్రికి రాత్రి ఏమీ చెయ్యను’ అంటూ ఫడ్నవీస్‌పై సెటైర్లు వేశారు. బీజేపీ–శివసేన మధ్య చీలికలు తేవడానికి ఫడ్నవీస్ ప్రయత్నించి ఉండకపోతే, తాను సీఎంగా గద్దెనెక్కేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ 25 ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని, ఎప్పటికీ స్నేహితుడిగానే ఉంటారని చెప్పారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. స్పీకర్‌గా రైతు బిడ్డ మహారాష్ట్ర అసెంబ్లీలో అనూహ్యంగా బీజేపీ స్పీకర్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్ కఠోర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సె పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు పటోలెను సాదరంగా తోడ్కొని వచ్చి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. ఒకప్పుడు రైతు నాయకుడిగా పటోలె విశిష్టమైన సేవలు అందించారు. రైతు గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి స్పీకర్ పదవిని అందుకోవడం హర్షణీయమని ఠాక్రే వ్యాఖ్యానించారు. స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే రేసు నుంచి తప్పుకున్నట్టు బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. నానా పటోలె 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. కానీ ప్రధాని మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో విభేదాల కారణంగా 2017లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. విదర్భ ప్రాంతంలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటోలె ఇటీవల ఎన్నికయ్యారు. -
బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉమా భారతి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ఉమా భారతి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమా భారతి.. వచ్చే మే నెల నుంచి ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాననీ, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని పార్టీ నాయకత్వానికి సమాచారం అందించారు. దీంతో హిందుత్వవాదిగా పేరున్న ఉమా భారతికి పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. -
‘గుజరాత్’ ఫార్ములాతోనే కర్ణాటకలోకి!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టంలో మతం ప్రాతిపదిక ఎన్నికల ప్రచారం చేయడం వల్ల ఫలితాలు కలసి వచ్చాయని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో అతి పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు మతం ప్రాతిపదికన హిందూత్వ అస్త్రంతో ముందుకు వస్తోంది. అప్పుడే సంఘ్ పరివార్ సంస్థలు హిందూత్వ పేరిట ఓట్ల సమీకరణకు కర్ణాటక రాష్ట్రంలో తిష్టవేశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలోకి అడుగుపెడుతూనే మతం ప్రాతిపదిక ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో హిందువుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విఫలమయ్యారని, అసలు ఆయన హిందువే కాదని అమిత్ షా ఆరోపించారు. గోమాంసం గురించి మాట్లాడిన సిద్ధరామయ్య రాష్ట్రంలో గోమాంసాన్ని ఎందుకు నిషేధించడం లేదని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని హిందుత్వ వర్సెస్ ముస్లింలుగా చూసే సంఘ్ పరివార్ సంఘాలు రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఫలితంగానే మొన్న మంగళూరులో మత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘నేను ముస్లింలను ప్రేమిస్తాన’ని ఓ 20 ఏళ్ల యువతి వ్యాఖ్యానించినందుకు హిందూత్వ శక్తులు ఆమెను తీవ్రంగా కొట్టాయి. ఆ అవమానాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఫలితంగా కర్ణాటక ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి ఎజెండాను పక్కనపెట్టి మతం ప్రాతిపదికగానే ఎన్నికల ప్రచారంపై దృష్టి ఎక్కువ పెడితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని రాష్ట్రానికి చెందిన బీజీపీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టిప్పును కొలిస్తే హిందూ వ్యతిరేకులా?
సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు ముగిశాక కూడా వాటిపై వివాదం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఏడాది కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు ఈ అంశానికి హిందుత్వాన్ని అపాదించి పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా బీజేపీని ఉద్దేశిస్తూ హిందూయిజాన్ని లీజుకు తీసుకున్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘‘టిప్పు సుల్తాన్ హిందువులకు హని చేశారు. అయినా సిద్దరామయ్య టిప్పును కొలుస్తున్నాడు. అంటే ఆయన హిందువుల సరసన లేనట్లే లెక్క. అలాంటి వ్యక్తి హిందువుల సంరక్షణ గురించి ఆలోచిస్తాడనుకోవటం లేదు’’ అని బీజేపీ ఎంపీ వినయ్ కుమార్ కటియార్ ఢిల్లీలో తెలిపారు. ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యానాథ్ హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్‌ను ఆరాధిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయగా మొదలైన దుమారం.. సిద్దరామయ్య కౌంటర్ ట్వీట్లతో మరింత ముదిరిపోయింది. కేవలం బీజేపీ నేతలే హిందువుతా? మేం కాదా? హిందూయిజాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? నా పేరు సిద్దరామయ్య. సిద్ధూ, రామయ్య.. అన్ని మతాలకు గౌరవం ఇస్తేనే అది అసలైన హిందుత్వం అవుతుంది అని కన్నడ భాషలో వరుస ట్వీట్లతో ఆయన ఆదిత్యానాథ్‌కు చురకలు అంటించారు. పాత ఫోటోలతో కౌంటర్... యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చాడు. హనుమంతుడి నేలపై టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరుపుకోవద్దంటూ ఆదిత్యానాథ్ కన్నడ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ నేతలు టిప్పు జయంతి వేడుకలు, ఇఫ్తార్లలో పాల్గొన్న ఫోటోలతో ప్రకాష్ రాజ్ మీ ఎజెండా ఏంటసలు అని యోగిని ప్రశ్నిస్తూ ఓ సందేశం ఉంచారు. Yogi ji orders people of Karnataka “don’t celebrate tippu sultan in the land of hanuman” dear sir.. what’s your agenda again...#justasking pic.twitter.com/wwfErkW09e — Prakash Raj (@prakashraaj) December 22, 2017 -
ఆవు లెటర్ రాయడం చూశారా!
ఐపూర్/జైసల్మీర్: విద్యాసంస్థలకు రాజకీయ రంగు తప్పడం లేదు. బీజేపీ హిందూత్వ భావజాల ప్రభావమో, వ్యక్తిగత ఉద్దేశమో.. మరేదైనా కారణమో.. మొత్తానికి రాజస్థాన్ లో తొలిసారి పాఠ్యంశాల్లో గోవు పేరిట ఓ లేఖను చేర్చి అలాంటి పాఠం పెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అందులో గోవు ఓ తల్లి మాదిరిగా విద్యార్థులకు లేఖ రాసినట్లు పాఠ్యాంశాన్ని చేర్చగా దానిపై పలువురు పెదవి విరుస్తున్నారు. బీజేపీ తన హిందూత్వ భావజాలాన్ని వసుంధరా రాజేతో జొప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఐదో తరగతి హిందీ పుస్తకాల్లో ఓ చాప్టర్ లో రెండు ఆవుల ఫొటోలను ముద్రించి.. గోవును తమ తల్లిగా పూజిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఇందులో ఆ గోవు సంభాషణ విద్యార్థులతో ఎలా ఉందంటే.. 'నా కుమారుల్లారా.. కూతుర్లార.. నేను ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తాను. తెలివిని ఇస్తాను. సుదీర్ఘ ఆయుష్షును ఇస్తాను. నా గొప్పతనాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారో వారు కచ్చితంగా మంచి అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు. ఎవరు నన్ను తల్లిలాగా భావిస్తారో నేను వారిని నా బిడ్డలుగా భావిస్తాను. నేను పాలను, పెరుగును, నెయ్యిని ఇస్తాను. నా మలమూత్రములతో మెడిసిన్, ఫెర్టిలైజర్స్ తయారవుతాయి. నా సంతానమైన ఎద్దులు మీకు వ్యవసాయంలో సాయం చేస్తాయి. నా వల్ల వాతావరణం కూడా స్వచ్ఛంగా మారిపోతుంది' అంటూ లేఖ సాగింది. అయితే, గోవునుంచి పొందే లాభాలపై అవగాహన కల్పించేందుకే ఈ పాఠం పెట్టినట్లు మంత్రి ఓతారామ్ దేవాసి చెప్పారు.