న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ఉమా భారతి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమా భారతి.. వచ్చే మే నెల నుంచి ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాననీ, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని పార్టీ నాయకత్వానికి సమాచారం అందించారు. దీంతో హిందుత్వవాదిగా పేరున్న ఉమా భారతికి పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment