బెంగళూరుకు వెళ్లనున్న చంద్రబాబు
హైదరాబాద్: రాయలసీమకు నీటి కేటాయింపుపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం బెంగళూరుకు వెళ్లనున్నారు.
రేపు కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో చంద్రబాబు భేటి కానున్నారు. రాయలసీమకు 32 టీఎంసీల నీటి విడుదలకు సహకరించాలని సిద్ధరామయ్యకు చంద్రబాబు విజ్క్షప్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.