లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల విమర్శలు-ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా సిద్ధరామయ్యతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఓ వీడియోను విడుదల చేశారు.
మాట్లాడితే హిందువునని చెప్పుకునే సిద్ధరామయ్య.. తన హయాంలో జరిగే హిందువుల హత్యల గురించి ఎందుకు స్పందించరని ఆ వీడియోలో ఉంది. గత మూడేళ్లలో 12 మంది హిందువులు దారుణంగా హతమయ్యారంటూ బాధితుల ఫోటోలతోసహా వీడియోను విడుదల చేశారు. యోగి ప్రశ్నలు కురిపించినప్పుడల్లా.. తానో హిందువునని చెప్పుకునే సిద్ధరామయ్య ఈ దారుణాలపై ఏం సమాధానం చెబుతారని వీడియోలో ప్రశ్నించారు.
అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తావన కొస్తూ... గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఆయన ఆలయాలను సందర్శించటంపై విమర్శలు గుప్పించారు. మత రాజకీయాలతో దేశంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని రాహుల్ ప్రయత్నించాడని ఆరోపించారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ సిద్ధరామయ్య వైఫల్యాన్ని వీడియోలో ఎండగట్టారు. కాగా, ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్ బీజేపీ విభాగం ఈ వీడియోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
काम जो कर लिया होता 5 साल में तिनका भर, यूँ रेसिपी नहीं बना रहे होते कांग्रेस के राजकुंवर। pic.twitter.com/Ah0gmaZU39
— BJP Uttar Pradesh (@BJP4UP) January 13, 2018
Comments
Please login to add a commentAdd a comment