learn
-
ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!
‘ఇక నీకు పూర్తిగా వచ్చేసినట్లే’ అని ఆంగ్లం ఎప్పుడూ అభయం ఇవ్వదు. ఆంగ్లభాషను ఎప్పటికప్పుడూ శోధిస్తూ పట్టు సాధిస్తూనే ఉండాలి... ఈ విషయంలో స్పష్టతతో ఉన్న యువతరం ఆంగ్ల మహాసముద్రంలో కలుస్తున్న నదులు, వాగులు, వంకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. నిత్యావసర భాష అయిన ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిట్‌కామ్స్ నుంచి చాట్‌జీపీటి టూల్స్ వరకు ఎన్నో దారులలో ప్రయాణిస్తోంది... సిట్కామ్ (సిచ్యువేషనల్ కామెడీ షో)తో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు అనేది పాత మాట. నవ్వుకోవడమే కాదు పదసంపద, నేటివ్ స్పీచ్‌పై పట్టు సంపాదించడానికి, పదాలతో ముడిపడి ఉన్న భావోద్వేగాల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిట్కామ్లలోని విజువల్ ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి అనేది నేటి మాట. అలాంటి సిట్కామ్స్లో కొన్ని... చీర్స్ (1982–1993) థీమ్ సాంగ్ ‘ఎవ్రీబడీ నోస్ యువర్ నేమ్’ నుంచి చివరి డైలాగ్ వరకు ఏదో ఒక కొత్తపదం పరిచయం అవుతూనే ఉంటుంది. రకరకాల సెట్లలో కాకుండా ఒకటే లొకేషన్లో చిత్రీకరించడం వల్ల ఒకేచోట పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు. ‘చీర్స్’లోని హాస్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రైజర్ (1993–2004) చీర్స్లోని ఎపిసోడ్లను అర్థం చేసుకున్నవారికి ఫ్రైజర్ కష్టమేమీ కాదు. ఈ సిట్కామ్లోని ప్రధాన పాత్రలైన ఫ్రైజర్, నీల్ మార్టిన్ల క్లీన్ యాక్సెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ‘ప్రైజర్’ నిండా ఇంటెలిజెంట్ హ్యూమర్ వినిపించి కనిపిస్తుంది. ది సింప్సన్స్ (1980) ది సింప్సన్ టీవీ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ యానిమేటెడ్ సిట్‌కామ్‌లో క్యారెక్టర్ల మధ్య నడిచే సంభాషణలు ఫ్యామిలీ టాపిక్స్‌పై ఉంటాయి. రియల్–లైఫ్ ఫ్రేజ్లపై అవగాహనకు ఉపయోగపడుతుంది. పుస్తకాల కంటే సహజమైన భాషను నేర్చుకోవచ్చు. ది వండర్ ఇయర్స్ (1988–93) మధ్యతరగతి కుటుంబానికి చెందిన కెవిన్ అర్నాల్డ్ అనే టీనేజర్ ప్రధాన పాత్రలో కనిపించే సిట్కామ్ ఇది. యువత మానసిక ప్రపంచానికి అద్దం పడుతుంది. కెవిన్ అతని ఫ్రెండ్స్ ఎదుర్కొనే రకరకాల సమస్యలతో యూత్ ఆటోమేటిక్‌గా రిలేట్ అవుతారు. యంగ్ పీపుల్ ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేసే పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్–ఎయిర్ (1990–1996) ఈ హిట్ కామెడీ షోలో ఎక్కువమందిని ఆకట్టుకునే క్యారెక్టర్ విల్ స్మిత్. ఫన్నీ డైలాగులు, జోక్స్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సోషల్ క్లాస్ స్పీకింగ్ ఇంగ్లిష్ నుంచి స్ట్రీట్ ఇంగ్లీష్ వరకు అవగాహన ఏర్పర్చుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాటర్స్ (1989–1998) ఈ సిట్‌కామ్‌లో కనిపించే రకరకాల ఎక్స్ప్రెషన్లు, గెశ్చర్ లెర్నర్న్కు ఉపయోగపడతాయి. స్పష్టమైన, సంక్షిప్తమైన యాక్సెంట్ వినిపిస్తుంది. కుటుంబ జీవితానికి సంబంధించి ఇళ్లల్లో వినిపించే ఇంగ్లిష్ ఇడియమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ది నానీ (1993–1999) రకరకాల యాక్సెంట్లను ఈ సిట్‌కామ్‌లో వినవచ్చు. సామాన్య ప్రజలతో పోల్చితే ధనవంతులు ఎలా మాట్లాడతారో చూడవచ్చు... ఇవి మచ్చుకు కొన్ని సిట్కమ్స్ మాత్రమే. ఎన్నో కోణాలలో భాషను మెరుగు పరుచుకునే సిట్కామ్లు ఎన్నో ఉన్నాయి. అప్–టు–డేట్ ఇంగ్లిష్ లెసన్స్ ఫ్లాట్‌ఫామ్ ‘సెన్సేషన్ ఇంగ్లిష్’పై కూడా యూత్ ఆసక్తి చూపుతుంది. ఇంటర్నేషనల్ న్యూస్ వీడియోలు, ఆర్టికల్స్ ద్వారా 5 లెవెల్స్‌లో భాషను మెరుగు పరుచుకోవచ్చు. ప్రాక్టీస్ యువర్ ఇంగ్లిష్ టుడే’ అంటోంది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ప్రోమోవ. మూడువేల పదాలతో కూడిన 40 థీమ్డ్ టాపిక్స్, ఇడియమ్స్, స్లాంగ్ వర్డ్స్, ఎవ్రీ డే ఎక్స్ప్రెషన్స్ ప్రోమోవలో ఉన్నాయి. లైవ్ లెసన్స్, కాన్వర్జేషన్ ఈవెంట్స్, ఏఐ ్ర΄ాక్టీస్ టాస్క్స్, సోషల్ లెర్నింగ్ గేమ్స్, లెర్నింగ్ జర్నీ తమ ప్రత్యేకతగా చెబుతుంది విజువల్ వరల్డ్స్ ఇమార్స్. లాంగ్వేజ్ లెర్నింగ్‌లో కీలక పరిణామం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). స్థానిక, స్థానికేతరులను భాష నైపుణ్యం మెరుగుపరుచుకోడానికి, పర్సనలైజ్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఉదా: లెర్నర్స్ బలాలు, బలహీనతల ఆధారంగా పర్సనలైజ్డ్ కరికులమ్‌ను, లాంగ్వేజ్ లెర్నింగ్ గేమ్స్‌ను రూపొందిస్తుంది. తప్పులను ఎత్తి చూపుతుంది. ఇంగ్లిష్ లిరిక్స్ వినడం ద్వారా కూడా భాషలో నైపుణ్యాన్ని పెపొందించుకునే ధోరణి పెరుగుతోంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రకరకాల యాక్సెంట్లను అర్థం చేసుకోవచ్చు. పదసంపద పెంచుకోవచ్చు. బెటర్ ప్రోనన్సియేషన్కు ఉపయోగపడుతుంది. అలనాటి ప్రసిద్ధ ఇంగ్లిష్ పాటల్లో ఎన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. ఎల్విన్ ప్రెస్లీ, మైకెల్ జాక్సన్ నుంచి నిన్న మొన్నటి కుర్రకారు సంగీతకారుల వరకు ఎంతోమంది పాత పదాలను కొత్తగా ప్రయోగించారు. ‘ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే మాటలు’ అంటూ ప్రతి సంవత్సరం కొన్ని పాటలను సిఫారసు చేస్తున్నారు ఆంగ్ల భాషా నిపుణులు. ‘ఇక నాకు అంతా వచ్చేసినట్లే’ అనే మాట ఆంగ్లం విషయంలో ఎప్పటికీ వినిపించదు. ఎందుకంటే... ఆంగ్ల భాష అనగానే వినిపించే ప్రసిద్ధ మాట... వర్క్ ఇన్ప్రోగ్రెస్. అందుకే ఆంగ్లంలో ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి యువతరం వివిధ మార్గాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే షాకవ్వడం ఖాయం!) -
పిల్లలంటే.చదువులు, మార్కులు, ర్యాంకులు..ఇంతేనా!
పిల్లలంటే కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు ఇంతేనా అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమి లేదా!. ఎప్పుడైనా గమనించారా! పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం. వారికి చదువులు, మార్కుల కంటే ప్రధానంగా తెలుసుకోవల్సినవేంటో గమనించారో. అసలు చదువు, మార్కులు ఇలాంటివేమి లేకుండానే మన పెద్దలు ఎంతో చాకచక్యంగా సమర్ధవంతంగా జీవించడమే గాక సమాజంలో నెగ్గుకొచ్చారు. అయినా మనం వాటిని గమనించకుండా పిల్లలను ఓ యంత్రాల్లా ఇలానే బతకాలంటూ.. నిర్దేశించేస్తున్నాం. వారు నేర్చుకోవాల్సి అతి ముఖ్యమైన, విలువైన జీవిత పాఠాలను నేర్పించలేకపోతున్నాం అవే వాళ్ల చివరి ఫోటోలు.. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మన హైదరాబాద్‌లో జులై 08, 2014న ఒక దారుణమైన సంఘటన జరిగింది. మీలో ఎవరికైనా గుర్తుందా? . తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు.. అక్కడ సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు.. అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు.. వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యామ్ గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను అలర్ట్ చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే). అంతంతా చదువులు చదివిన పిల్లలేనా.. అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది.. ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది.. రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు.. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.. ఇక్కడ మనం గమనించవలసింది, విజ్ఞాన్ ఇజనీరింగ్ కాలేజ్ లాంటి టాప్ కాలేజ్‌లో చదివిన వీళ్లకు, ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం.. వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం.. "చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..చూస్తే ఇంత పెద్ద చదువులు చదవిన పిల్లలేనా అనే సందేహం రావడం లేదా!. ఇక్కడ ఎందరు పిల్లలకు ఈత వచ్చు? ఈత అని మాత్రమే కాదు.. ఉన్నట్లుండి మీ ఇంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? అంతెందుకు ఎవరైనా పెద్దలకు సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చి..ఊపిరి ఆడకపోతే తక్షణమే ఎలా స్పందించాలో తెలుసా?..లేదా చెయ్యి తెగి.. రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? చెప్పగలరా. కనీసం అలాంటి సమయాల్లో ముందుగా చేయాల్సిన ప్రథమ చికిత్స ..ఎలా చేయాలో తెలుసా? . ముఖ్యంగా పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా!. కేవలం చదువు..చదువు.. చదువు, మార్కులు, ర్యాంకులు, ఇజనీరింగ్, మెడిసిన్ సీట్లు, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు.. ఇవే చెబుతున్నాం. ఆ చదువులు కూడా వాళ్లని షాపింగ్‌మాల్స్‌లో బ్రాండెడ్ డ్రెసెస్ వేసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు తినమని మాత్రమే చెబుతోంది. కామన్సెన్స్ నేర్పిస్తున్నామా.. ఆ చదువు సమస్య వస్తే ఎలా ఎదుర్కొని నిలబడాలో చెప్పడం లేదు. అసలు ప్రకృతి అందాలు చూడటమే కాదు. అది కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అలాగే రాజ్యాంగంలోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. ఎదుటి వాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి.. సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది.. అన్నింటికంటే ముందు "common sense" (ఇంగిత జ్ఞానము) అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే, ఇదుగో.. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి..... గమనించండి.... ఆలోచించండి.... ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి.. కొంతమందికి అయినా అవగాహన కల్పించి మన విద్యార్థుల విలువైన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. (చదవండి: పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!) -
యుద్ధం తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తాము తమ పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు. కాశ్మీర్ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దుబాయ్‌కి చెందిన అల్ అరేబియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ.."భారత ప్రధాని మోదీకి నా సందేశం ఏంటంటే?.. మన మధ్య చిచ్చు రేపుతున్న బర్నింగ్ పాయింట్లను పరిష్కరించడానికి టేబుల్‌పై కూర్చోని చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవిద్దాం. పరస్పరం కలిహించుకోవడంతో సమయం, వనరులు వృధా చేస్తున్నాం" అని అన్నారు. తాము భారత్‌లో చేసిన మూడు యుద్ధాల కారణంగా పాక్ ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వారంతా తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదీగాక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్ తమకు సాయం చేయమంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజలు ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా గోధుమపిండి కోసం ఘోరంగా ఆర్రుల చాజుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొంటోన్నారు. గతేడాది చివర్లోనే దేశ భద్రతా దళాలతో కాల్పులు విరమించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రధాని షెహబాజ్ పోరుగు దేశంతో ముక్కుసూటిగా నిజాయితీగా వ్యహిరిస్తాం అని పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యులు, ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారని, ఆ వనరులను ఉపయోగించుకుని శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మందుగుండు సామాగ్రి కోసం వనరులను దుర్వినియోగం చేయాలనుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ..పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, కాశ్మీర్లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. ఈ మేరకు తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ నేరుగా సంకేతాలిస్తోంది. (చదవండి: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన) -
అమ్మ వాటిని నేర్చుకోవడానికి చాలా కష్టపడింది! :ప్రియాంక
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురించి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన మహిళా కేంద్రీకృత సదరస్సులో మాట్లాడుతూ..తన తల్లి భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడిందని అన్నారు. ఆమెకు రాజకీయాలంటే ఇష్టం ఉండవంటూ చెప్పుకొచ్చారు. తాను ఇద్దరు ధైర్యవంతులైన, బలమైన మహిళల వద్ద పెరిగానని చెప్పారు. తన నానమ్మ ఇందిరా గాంధీ 33 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్నప్పుడూ తన వయసు ఎనిమిదేళ్లని ఆమె గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ పోయిన మరుసటి రోజే తన విధులను నిర్వర్తించేందుకు వెళ్లిపోయారని చెప్పారు. ఆమె చనిపోయే వరకు కూడా తన కర్తవ్యం పట్ల ఆమె అంతర్గత శక్తి అలానే ఉందని, చనిపోయేంత వరకు దేశ సేవ చేస్తూనే ఉన్నారని చెప్పారు. అంతేగాదు తన తల్లి సోనియా 21 ఏళ్ల వయసులో రాజీవ్‌గాంధీతో ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుని ఇటలీ నుంచి భారత్‌కు వచ్చారని అన్నారు. ఇక్కడకు వచ్చాక భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడిందని, ఆ తర్వాత తన నానమ్మమ ఇందిరా గాంధీ నుంచి ప్రతీది నేర్చుకున్నారని చెప్పారు. ఆమె సరిగ్గా 44 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిందని, రాజకీయాలంటే ఇష్టం లేకున్నప్పటకీ వచ్చి దేశ సేవ చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుని జీవితమంతా సేవ చేసిందని అన్నారు. అంతేగాదు తన తల్లి తన నానమ్మ నుంచి నేర్చుకున్న ముఖ్య విషయం గురించి చెబుతూ.."మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా లేదా ఎంత పెద్ద విషాదం లేదా సమస్యలో ఉన్నా అది ఇంట్లో లేదా పనిలోనైనా సరే నిలబడి సమర్ధవంతంగా ఎదుర్కొని మీ కోసం మీరు పోరాడగలగలిగే సామర్థ్యం కలిగి ఉండటం" అని చెప్పారు. (చదవండి: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్‌గా మేనిఫెస్టో!) -
మంచి మాట: రాజుకంటే బలవంతులు..?
ఎంతటి పండితులు, జ్ఞానులు అయినా తమకు అంతా తెలుసని చెప్పరు. ఆ అహంకారం.. లేదా భ్రమ.. భ్రాంతి వారి మాటల్లో ధ్వనించదు. చేతల్లో కూడా స్ఫురించదు. తాము తెలుసుకున్నది స్వల్పమని.. తెలుసుకోవాల్సింది అనంతమని వారికి తెలుసు. కనుకే వారిలో ఒదుగుదల.. వినయం.. సంయమనం. ఇదే వారిని అనుక్షణం అప్రమత్తుల్ని చేసి వారు జ్ఞానాన్వేషణ మీదే దృష్టి పెట్టేలా చేస్తుంది. మూర్ఖుడు అందుకు భిన్నం. తన మూర్ఖత్వం వల్ల పరిహాసాల పాలవుతుంటాడు. తనకంతా తెలుసనుకోవటమే అజ్ఞానం. అంతే కాదు. తనకు తెలిసిందే జ్ఞానమనుకునే అవివేకమే మూర్ఖత్వం. మూర్ఖత్వమంటే వెర్రి పట్టుదల, దుస్సాహసం, అసంబద్ధత, అహేతుకత. బాధ్యాతారాహిత్యం, దురహంకారం, అజ్ఞానం, కుసంస్కారం. వీటి మూర్తీభవత్వమే .. మూర్ఖుడు. తనకు అంతా తెలుసని.. తనకు తెలిసిందే సరైనదన్న ఆలోచన చేస్తాడు. వాస్తవాన్ని చూసే శక్తి లేకపోవటం, ఒకవేళ చూడగలిగినా పాక్షికంగానే చూడటం, పెద్దలను గౌరవించకపోవటం, అవాకులు.. చవాకులు పేలటం, ఇతరులను అకారణంగా నిందించటం.. ఈ గుణాల కలబోతే మూర్ఖుడు. మూర్ఖుడు తానే సర్వజ్ఞుడనని అనుకుంటాడు. ప్రతిదీ తనకే తెలుసని ఇతరులకేమీ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తాడు. నిజానికి ఇదే అజ్ఞానం కదా! దీనివల్ల ఇతరులు చెప్పేదేది తను విననవసరం లేదని భావిస్తాడు. వారికి ఆ శక్తే లేదని అతడి ప్రగాఢ విశ్వాసం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో కొత్త జ్ఞాన పాయలు వచ్చి చేరుతుంటాయి. దానిలో తను ఒడిసి పట్టుకున్నదెంత.. దాన్ని అర్థం చేసుకున్నదెంతన్న ఎరుక ఆవగింజంతైనా లేనివాడే మూర్ఖుడు. ఒకరకంగా కూపస్థ మండూకమే! ఈ అజ్ఞానంతో పెద్దల.. జ్ఞానుల మాటలను ఆలకించడు. ఆలోచించడు. ఈ అజ్ఞానం అతడి కళ్లను ఎప్పుడూ మూసే ఉంచుతుంది. మూర్ఖత్వం ఉన్నచోట విచక్షణ, వివేచన ఉండదని, వాగ్వివాదం, అర్థరహితమైన ఆవేశం ఉంటుందన్న విషయాన్ని కొన్ని పౌరాణిక ఉదంతాలు స్పష్ట చేస్తాయి. మూర్ఖుడికి రెండు అవలక్షణాలు. ఒకటి తనకు తెలియకపోవటం.. రెండోది ఇతరులు చెప్పే మంచిని చూడలేకపోవటం. పైగా, వారిని సంస్కరించే క్రమంలో వివేచనాపరులకు నిందలు.. అవమానం... చీదరింపు.. చీత్కారం.. ఎదురవుతాయి. మనసుకు బాధ కలుగుతుంది. అందుకే భర్తృహరి.. సృష్టిలో లేనివి... అసాధ్యమైనవి ప్రయత్నించి సాధించవచ్చేమో కాని, ఎటువంటి ప్రయత్నం చేసినా మూర్ఖుడి మనసు మెప్పించలేమని.. మార్చలేమని... ఏనాడో సిద్ధాంతీకరిస్తూ హెచ్చరించాడు. విలువైన సమయం వృథా అవుతుంది. ఈ శుష్కప్రయత్నం కన్నా అనేకమంది పామరులను పండితుల్ని చేయవచ్చు. అలాగే కొంచం తెలివితేటలు ఉన్నవాళ్ళకు .. ఎదుటివారు చెప్పేది వినే సంస్కారం ఉండి, ఆలోచించ గలిగే వారికి చెప్పినా ఉపయోగముంటుంది. మన మాటలోని అంతరార్థాన్ని గ్రహించి తమను సరిదిద్దుకోగలరు. మన పట్ల కృతజ్ఞతా భావం ఉంటుంది. మూర్ఖుడికి తన జ్ఞానం మీద అతివిశ్వాసం. దానివల్ల ఒక సమస్యను అన్ని కోణాలలో చూడలేడు. కొంతవరకే అర్థం చేసుకుని ప్రయత్నం చేసి అద్భుతమైన పరిష్కారం కనుగొన్నానని సంతోషంతో గెంతులేస్తాడు. తాను గొప్ప మేధావినని మురిసిపోతాడు. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించలేడు. పిడివాదం మూర్ఖుడి జీవలక్షణం. తన ఆలోచన.. తెలివిడితనం/ తెలివి... మార్గం... అందరికన్నా మెరుగైనవన్న వైఖరి. దాన్నే తన మాటల్లో.. వాదనలో.. చేతల్లో చూపించే తత్వం. అందుకే వివేకవంతుడు అతడితో వాదనకే దిగడు. అసలు సాధ్యమైనంతవరకు మాట్లాడే యత్నమే చెయ్యడు. మూర్ఖుడికి మంచి భావనలే రావు. సమయోచిత బుద్ధి.. ప్రవర్తన ఉండదు. అతడి ప్రవర్తన వింతగా. హాస్యాస్పదంగా ఉంటూ కొన్ని సందర్భాలలో నిర్ఘాంతులను చేస్తుంది. మరికొన్ని సమయాలలో అది ఊహించని విధంగా పరిణమించి ఎంతో విపత్తును.. నాశనాన్ని కలిగిస్తుంది. ఇంగిత జ్ఞానం మూర్ఖుడి దరిదాపుల్లో నివాసమే చేయదు. అతనికి మాటలకు ఒక స్థిరత్వం.. పరిస్థితులను ఆకళింపు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండనే ఉండవు. సహేతుక నిర్ణయాధికార శక్తి ఉండదు. కువిమర్శలు చేయటం అతని నైజం. స్వార్థం.. సంకుచిత బుద్ధి.. అధర్మ పద్ధతులలోనైనా తననుకున్నది సాధించాలనుకునే మొండి పట్టుదల అతడి కార్యసాధనకు సాధనాలు. మూర్ఖత్వం వ్యక్తి వికాసానికి పెద్ద అవరోధం. అది నాయకులకుంటే సమాజానికి చేటు. జాతినేతకు ఉంటే జాతికి ముప్పు. హిట్లర్.. ముస్సోలినీల మూర్ఖత్వానికి కొన్ని వర్గాలవారు ధన.. మాన.. ప్రాణాలు గడ్డిపరకల కన్నా ఎలా హీనమయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. మూర్ఖత్వాన్ని తప్పకుండా వీడాలి. అదెలా సాధ్యమవుతుందంటే..? తోటకూర నాడే అన్నట్టుగా పిల్లల్లో ఈ విపరీత లక్షణం గమనించిన పెద్దలు వెంటనే వారిని సంస్కరించే ప్రయత్నం చేయాలి. మంచి పుస్తకాలను చదివించాలి. మంచివారితో స్నేహం గరిపేటట్టు చూడాలి. అవసరమైతే గురువుల సహాయం తీసుకోవాలి. అప్పుడు అభిలషణీయమైన మార్పు చూస్తాం. అపుడే వ్యక్తికి.. కుటుంబానికి.. సమాజానికి.. జాతికి శ్రేయస్సు. మూర్ఖుడికి ఉచితానుచితాలు తెలియనే తెలియవు. సభామర్యాద తెలియదు. సంభాషణ తీరు ఉండదు. మాట్లాడే మాటలకు సందర్భశుద్ధి ఉండదు. తమ తప్పుల్ని.. పొరబాట్లను.. అనుచిత ప్రవర్తనను గుర్తెరగరు. ఒకవేళ తెలుసుకున్నా సరిదిద్దుకోరు. తమ పద్ధతిలోనే పయనిస్తారు. వివేకవంతులు తమ లోపాలను తెలుసుకున్న వెంటనే సరిదిద్దుంటారు. మార్పు వారి వ్యక్తిత్వంలో ఒక గొప్ప లక్షణం. ఇది వారిని మరింత వివేచనపరులుగా చేసే మార్గం. మూర్ఖత్వమంటే అసలు తెలియదని కాదు. తెలిసింది చాలా తక్కువ. అది కూడ అరకొరగానే. అదే గొప్పదన్న ఆలోచన. దానికే కన్ను, మిన్ను కానక ప్రవర్తిస్తుంటారు. వయోభేదం లేకుండా ఎవరినైనా ఏ మాటైనా అనగలరు. సంకోచం గాని.. వెరపు గాని ఉండదు. తన మాటల, వర్తన వల్ల ఎవరికైనా మనస్తాపం కలుగుతుందేమోనని యోచనే ఉండదు. తమకున్న మిడి మిడి జ్ఞానంతో, వివేచనపరులు ఈ పని చేయచ్చా... ఇలా మాట్లాడవచ్చో లేదో అని మీమాంసకు లోనైన సందర్భాలలో చొరవగా అన్నిచోట్లకు వెళ్ళగలరు .. ఏదైనా మాట్లాడగలరు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
Spoken English: ఇంగ్లిష్.. ఇలా సులువు!
ఇంగ్లిష్.. ఈ పేరు వినగానే తెలుగు మీడియం విద్యార్థులు హడలిపోతుంటారు. ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా.. తమకు ఇంగ్లిష్ రాదని బాధ పడుతుంటారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆందోళన చెందుతుంటారు. పొరపాట్లు మాట్లాడితే.. అవతలి వాళ్లు అపార్థం చేసుకుంటారని ఊహించుకొని వెనకడుగు వేస్తుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లిష్‌ను తలచుకొని ముందే భయపడిపోతుంటారు. అయితే ఇంగ్లిష్ భాషను మాట్లాడుతూ తేలిగ్గానే నేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంగ్లిష్‌ను నేర్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం... విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే.. మన విద్యార్థులు ఐఈఎల్టీఎస్, టోఫెల్ వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ సైతం తీసుకుంటారు. కానీ ఇది పరీక్ష వరకు ఉపయోగపడినా.. నిత్యం దైనందిన జీవితంలో మనగలగాలంటే.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు చక్కగా రాయడం రావాలి. ఇంగ్లిష్ సినిమాలు భాష ఏదైనా సులభంగా నేర్చుకునే మార్గాల్లో శ్రద్ధగా వినిడానికి మించిన సాధనం లేదు. ఇంగ్లిష్‌ను ఆసక్తిగా వినగలిగితే.. మాట్లాడటం నల్లేరుపై నడకే! ఇందుకు ఇంగ్లిష్ సినిమాలు సరైన మార్గం. సినిమాలంటే.. ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తినే సాధనంగా చేసుకొని.. ఇంగ్లిష్ చిత్రాలు చూడటం ద్వారా ఇంగ్లిష్‌ను మెరుగుపరచుకోవచ్చు. భాషను సహజంగా అర్థం చేసుకోవడానికి.. ఇంగ్లిష్ వ్యవహారిక, సంభాషణ రూపాలకు అలవాటు పడటానికి.. భాషతో అనుభూతి పొందడానికి ఇంగ్లిష్ సినిమాలు దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ చూడటం పరిపాటిగా మారింది. యూట్యూబ్‌లో ఇంగ్లిష్ స్పీకింగ్/లెర్నింగ్ వీడియోలు చూడటం ద్వారా.. భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. అలాగే, ఇంగ్లిష్ డాక్యుమెంటరీలు కూడా భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. న్యూస్ పేపర్లు–టీవీలు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పొందేందుకు నిత్యం ఇంగ్లిష్ పత్రికలు శ్రద్ధగా చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రామాణిక ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లు ఏకాగ్రతతో చూడటం, వినడం వంటివి చేయాలి. ఇంగ్లిష్ భాషలో వెలువడే వార్తా పత్రికలు, మ్యాగజైన్స్ మంచి భాషను నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. చేయి తిరిగిన జర్నలిస్టులు పత్రికల్లో రాసే వార్తలు, వ్యాసాల ద్వారా ఎక్కడ ఎలాంటి పదాలు వాడాలో తెలుస్తుంది. అది పరీక్షల్లో సమాధానాలు రాయడంతోపాటు..ఇంటర్వ్యూలో మాట్లాడటంలోనూ ఉపయోగపడతుంది. అంతేకాకుండా ఇంగ్లిష్ వొకాబ్యులరీ మెరుగవుతుంది. ఇంగ్లిష్ పత్రికలు చదవడం, టీవీ ఛానళ్లను చూడటం ద్వారా స్పెల్లింగ్స్, ఉచ్ఛరణ, వాక్య నిర్మాణం వంటివి నేర్చుకోవచ్చు. (నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు) వొకాబ్యులరీని ఒడిసిపట్టండిలా భాషను చక్కగా, అద్భుతంగా మాట్లాడాలంటే.. ముందు పదజాలం(వొకాబ్యులరీ)పై పట్టు సాధించాలి. అందుకు ఇంగ్లిష్ పత్రికల్లోని పదాలను అర్థాలతో సహా ఒక నోట్స్‌లో రాసుకోవాలి. దీంతోపాటు ప్రతి రోజూ ఉపయోగించే పదాలు, పదబంధాల జాబితాను తయారు చేయడం ప్రారంభించాలి. కొత్త పదం ఎప్పుడు ఎదురైనా.. దానిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఆయా పదానికి సంబంధించిన పర్యాయపదాలు, వ్యతిరేకార్థాలు, పద బంధాలను సైతం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో ఏ పదాన్ని ఎలా వాడాలో రాసుకోవాలి. ఇంగ్లిష్‌లో సంభాషణ వినడం,చదవడంతోపాటు తరచూ మాట్లాడం ద్వారా ఇంగ్లిష్‌ను త్వరగా నేర్చుకోవచ్చు. ప్రతి సందర్భంలోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. సొంతంగా మాట్లాడే నైపుణ్యాలను పెంచుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారితోగాని, ఇంగ్లిష్ అప్పటికే బాగా వచ్చిన వారితోగాని స్నేహం చేయాలి. ఈ రెండూ కుదరకపోతే అద్దం ముందు నిల్చొని.. సొంతంగా మాట్లాడం ప్రాక్టీస్ చేయాలి. లేదా ఏదైనా ఒక టాపిక్‌పై ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. దాన్ని రికార్డ్ చేసుకొని వినాలి. దీనిద్వారా భాషపై పట్టు సాధించడంతోపాటు లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. ప్రాక్టీస్.. ప్రాక్టీస్ ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచుకునేందుకు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. రోజుకు ఒక పదంతో మొదలుపెట్టి.. పదుల సంఖ్యలో పదాలు, అర్థాలు, పదబంధాలు నేర్చుకునే స్థాయికి వెళ్లాలి. కేవలం పదాలను, పదబంధాలను చదివి గుర్తు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఆయా పదాలు ఏయే సందర్భాల్లో వినియోగించాలో కూడా తెలుసుకోవాలి. సాధ్యమైనంత తరచుగా ఆయా పదాలను వాడటానికి ప్రయత్నించాలి. సందర్భాలను కల్పించుకొని..అందు కు తగ్గట్టుగా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. ఇది నిత్యం దీర్ఘకాలం పాటు కొనసాగాలి. దీనివల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం సొంతమవుతుంది. సరదా.. సరదాగా.. ఇంగ్లిష్‌ను నేర్చుకునేటప్పుడు తొలుత కొంత శ్రమతో కూడుకున్నదిగా, భారంగా అనిపించొచ్చు. దానివల్ల త్వరగా ఆసక్తి కోల్పోయే ఆస్కారముంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిరంతరం ప్రేరణనిచ్చుకుంటూ ముందుకు సాగాలి. కొత్త భాషను నేర్చుకోవడాన్ని ఆస్వాదించాలి. మీ ఆలోచనలను గౌరవించే స్నేహితులతో ‘వర్డ్ గేమ్స్’ ఆడటం, ఇంగ్లిష్ పజిల్స్ పూర్తిచేయడం వంటివి చేయాలి. దానివల్ల ఇంగ్లిష్ సరదాగా నేర్చుకున్నట్లు అవుతుంది. భాషను నేర్చుకునే క్రమంలో.. ఇంగ్లిష్‌లో ఆలోచించడం, ఇంగ్లిష్‌లో సంభాషించడం మేలు చేస్తుంది. గ్రామర్ అధ్యయనం కొత్త భాష కావడం వల్ల తొలుత అదో బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. ఇంగ్లిష్ గ్రామర్ చదవడం చాలామందికి విసుగు పుట్టిస్తుంది. గ్రామర్‌ను స్కూల్ స్థాయిలో చదివే ఉంటాం. కాబట్టి మరోసారి గ్రామర్ రూల్స్ అధ్యయనం చేస్తే.. పొరపాట్లు లేకుండా ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం అలవడుతుంది. విషయాన్ని చక్కగా కమ్యూనికేట్ చేయాలంటే.. భాష తీరుపై సంపూర్ణ అవగాహన అవసరం. అందుకు గ్రామర్ ఉపయోగపడుతుంది. టోఫెల్ వంటి పరీక్షల్లోనూ, ఉన్నత స్థాయి ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ.. గ్రామర్ తప్పులు లేకుండా రాయడం, మాట్లాడటం తప్పనిసరి. అందుకు వ్యాకరణ నియమాలు దోహదం చేస్తాయి. వీలైనంతగా మాట్లాడాలి చాలామంది ఎదుటివారు ఏమనుకుంటారోనని భయపడి.. ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు జంకుతుంటారు. తమను తాము కంఫర్ట్ జోన్లో ఉంచేసుకుంటారు. నిజానికి మాట్లాడటం ద్వారానే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడితే అంత బాగా మన మనసు, మెదడు ఇంగ్లిష్ పదాలకు అలవాటు పడతాయి. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రక్రియగా భావించాలి. కేవలం వారం, నెల రోజుల్లోనే నేర్చేసుకుందామనుకుంటే.. అది సాధ్యమయ్యే పనికాదని గుర్తించాలి. ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలంటే.. భాషకు అంకితం అవ్వాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితాలను సాధించగలం!! -
రండి.. ఇంగ్లిష్ నేర్చుకుందాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలవాలన్నా, గెలవాలన్నా ఇంగ్లిష్ తప్పనిసరి. పట్టు లేకున్నా కనీస పరిజ్ఞానం లేకుంటే కష్టమే. అందుకే మార్కెట్లో 30 రోజుల్లో ఆంగ్లం వంటి పుస్తకాలు, స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్‌లు, ఆన్లైన్ శిక్షణ కోర్సులు వంటివెన్నో వచ్చాయి. వీటిల్లో ఏదైనా సరే ఇంగ్లిష్ పదాలు, ఉచ్చారణ, వ్యాఖ్య నిర్మాణం మినహా ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు తగిన భాష నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది కింగ్స్ లెర్నింగ్. ఎన్‌గురు యాప్ ద్వారా 12 భారతీయ, 16 అంతర్జాతీయ భాషల నుంచి ఇంగ్లిష్ నేర్చుకునే సేవలను అందిస్తుంది. మరిన్ని వివరాల్ని కంపెనీ ఫౌండర్ అర్షన్ వకిల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... 28 భాషల్లో ఇంగ్లిష్.. ప్రస్తుతం తెలుగు, మరాఠీ, హిందీ, గుజరాతీ వంటి 12 భారతీయ భాషలు, నేపాలీ, కొరియన్, అరబిక్, థాయ్, స్పానిష్ వంటి 16 అంతర్జాతీయ భాషల్లో ఇంగ్లిష్ నేర్చుకునే వీలుంది. స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసుల్లాగా రోజు వారీ ఇంగ్లిష్ పదాల ఉచ్ఛారణ, వ్యాఖ్య నిర్మాణం వంటివే కాకుండా ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణమైన భాష నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు. ప్రస్తుతం జనరల్ ఇంగ్లిష్ కోర్సుతో పాటూ రిటైల్, హోటల్, బీపీఓ, ఈ–మెయిల్ రైటింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇంగ్లిష్ భాష అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది కాబట్టి యూజర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. 2.5 కోట్ల మంది యూజర్లు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఇందులో 78 శాతం యూజర్లు 34 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వాళ్లే. 32 శాతం మహిళలు ఉన్నారు. తెలంగాణ నుంచి 5.75 శాతం మంది యూజర్లున్నారు. నెలకు 2 లక్షల మంది వినియోగిస్తున్నారు. బీ2సీలో ప్రీమియం కోర్సులు, లైవ్ క్లాస్‌లు, మాక్ ఇంటర్వ్యూ వంటివి ఉంటాయి. ప్రారంభ ధర రూ.149. బీ2బీలో కంపెనీ ఉద్యోగులకు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ధర రూ.1,500. ఇప్పటివరకు బీ2బీలో టీసీఎస్, ఒబెరాయ్ గ్రూప్, గోద్రెజ్ నేచర్ బ్యాస్కెట్ వంటి సంస్థల్లో 100కు పైగా శిక్షణ శిబిరాలను నిర్వహించాం. రూ.17 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 50 మంది ఉద్యోగులున్నారు. రూ.17 కోట్ల నిధులను సమీకరించాం. మిశెల్ అండ్ సుసన్ డెల్ ఫౌండేషన్, విలేజ్ క్యాపిటల్‌లు ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ముగింపు నాటికి మరో విడత నిధులను సమీకరించాలని నిర్ణయించాం. ఎంత మొత్తంలో సమీకరించేది ఇన్వెస్టర్ల గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అర్షన్ తెలిపారు. -
వృత్తి విద్యకోసం ఉద్యోగాలొదిలేస్తున్నారు!
ఇప్పటిదాకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలకోసం పోటీపడ్డ యువత... ఇటీవల కార్యాలయాల్లో కూర్చొని చేసే మూస ఉద్యోగాలను వదిలేసి మరీ... వృత్తి విద్యను నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. దాదాపు పదిలో ఎనిమిది మంది వృత్తి విద్యను నేర్చుకుంటున్నారని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. డబ్బు ముఖ్యం కాదని, యువత వృత్తి విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారని బాల్వెనీ విస్కీ అందించిన నివేదికల్లో వెల్లడైంది. ఉద్యోగాలను వదిలేసి మరీ వృత్తి విద్యను నేర్చుకునేందుకు నేటి యువత ఇష్టం చూపిస్తున్నారని బాల్వెనీ విస్కీ తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీ చదువులను, ఉద్యోగాలను వదిలిపెట్టి 77శాతం మంది ప్రజలు ప్రాచీన కళలు, వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అభివృద్ధి విషయంలో క్రాఫ్ట్ భారీ సమయం తీసుకుంటుందన్న అపోహలను వదిలి, నిజానిజాలను నిర్థారించుకొంటున్నారు. పదివేలమందిపై చేసిన సర్వేలో ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, కుండల తయారీ వంటి వృత్తులు అగ్రస్థానంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే వృత్తి విద్యను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలపాలని ప్రశ్నించినపుడు మాత్రం... అదో ప్రతిభావంతమైన విద్య అని, చికిత్సా పద్ధతిగా కూడ పని చేస్తుందని, కార్యాలయాల్లో కూర్చొని పనిచేసే సాధారణ ఉద్యోగాల కంటే.. వృత్తి విద్య ఒత్తిడిని సైతం నివారిస్తుందని కనుగొన్నట్లు తెలిపారు. దీనికి తోడు చెఫ్, జ్యువెలరీ డిజైన్, తోటపని వంటి ఇతర కళాత్మక విద్యలు కూడ జాబితాలో అత్యధికంగా నిలుస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కళాత్మక వృత్తుల్లోకి అడుగిడిన యువత... వారి జీవితంలో పూర్తిశాతం గాని, కనీసం సగభాగమైనా వృత్తి కళలు నేర్చుకునేందుకు సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో ఫొటోగ్రఫి 12 శాతం, ఛెఫ్, బేకింగ్ 7 శాతం, సంగీతం 6 శాతం, గార్డెనింగ్ కు 3 శాతం, ప్రాధాన్యత పెరిగిందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఎక్కువశాతం సెక్యూరిటీ అటెండెంట్స్, ఐటి కన్సల్టెంట్స్, అకౌంటెంట్లు తమ ఉద్యోగాలను వదిలి వృత్తి విద్యల్లో చేరుతున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. .బాల్వెనీ విస్కీ సిరీస్ లో భాగంగా కళాకారుడు డిన్నర్ రూపొందించిన లఘు చిత్రం ప్రారంభం సందర్భంగా ఈ కొత్త విషయాలను వెల్లడించారు. -
ఆ మహిళలు.. అసమానతను గెలిచారు..!
వీపుపై వెదురు బుట్టలు కట్టుకొని పచ్చని ప్రకృతి మధ్య టీతోటల్లో ఆకులు తుంచుతూ కనిపించే ఆ మహిళలను చూస్తే మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ.. కానీ వారి జీవితాల్లో బాధలు ఆగాధాల్లా పేరుకొన్నాయి. వారికి అంతులేని వేదనలు మిగులుస్తున్నాయి. అయితే ఏళ్ళదరబడి జీవన పోరాటంలో గెలిచేందుకు వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు విజయవంతమైంది. టీ తోటల్లో కనిపించని కష్టాలను గట్టెక్కేందుకు నెరపిన ఉద్యమం ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా మారింది. రాజకీయాలకు అతీతంగా, పురుషుల అండదండలు అవసరం లేకుండా యాజమాన్యాలపై పోరాడి అనుకున్నది సాధించారు. కన్నన్ దేవన్ హిల్స్ టీ తోటల్లోని మహిళలు తమ సత్తా చాటుకున్నారు. కేరళరాష్ట్రం మున్నార్ కొండప్రాంతం టీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసే మహిళా కూలీల శ్రమను మాత్రం దశాబ్దాలు గడుస్తున్నా గుర్తించేవారే లేకుండా పోయారు. దీంతో మహిళలంతా ఒక్కటయ్యారు. మేం బుట్టలను వీపుపై కట్టుకొని టీ ఆకులు కోస్తాం.. మీరు ఆ బుట్టల్లోంచి డబ్బు దండుకుంటున్నారు.... అంటూ టీ తోటల్లో మొదలైన మహిళల ఉద్యమం రోడ్డుపైకి చేరింది. కనీసం తమ నిరసనల్లో రాజకీయ నాయకులను, పురుషులను అనుమతించలేదు. ఎటువంటి సంఘాలను జోక్యం చేసుకోనివ్వలేదు. యూనియన్ నాయకులు యాజమాన్యాలతో కుమ్మక్కై వారి బోనస్ ను తగ్గించడాన్ని నిరసించారు. నాలుగు నుంచి ఆరువేల మంది మహిళలు తొమ్మిది రోజులపాటు.. యాజమాన్యాలతో అధిక బోనస్ కోసం పోరాడి చివరికి కేవలం మహిళా శక్తితో గెలుపు సాధించారు. పార్టీలకు ప్రభావితమైన యూనియన్ లీడర్లు, ఆధిక్యం ప్రదర్శించే పురుషులకు దీటుగా... ఉద్యమించిన మహిళా శక్తి నేడు ఈ ప్రాంతంలోని పలు ఎస్టేట్స్ లోని మహిళా కూలీలకు, ఉద్యోగినులకు స్ఫూర్తిగా మారింది. దీంతో వీరంతా ఇప్పుడు వేతనాలకోసం పోరాటాన్ని ప్రారంభించారు. ఒక్క టీ తోటల్లోనే కాదు వరి చేలల్లోనూ, అగరబత్తి, బీడీ రోలింగ్, రొయ్య పొట్టు, పట్టు పురుగు పెంపకం, జీడి గింజల ఫ్యాక్టరీల్లోనూ ఈ మహిళా గళం ప్రతిధ్వనించింది. ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ మహిళలు సమానంగా పనిచేస్తున్నా పురుషులకంటే తక్కువ వేతనాలు ఇవ్వడం, పురుష ఆధిక్యతతో ఉండటం ఎందుకు జరుగుతోందంటూ వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మున్నార్ మహిళల తిరుగుబాటు ఒక్క వారి సమస్యలు సాధించేందుకే కాదు... ఏకంగా భారత ఆర్థిక వ్యవస్థ పైనే పడనుంది. కులం, రంగు, రాజకీయాలు మొదలైన అనేక వివక్షల్లో మార్పును తెచ్చేందుకు, అందరికీ సమన్యాయం జరిగేందుకు ఉపయోగ పడనుంది. ఇటువంటి స్త్రీ వాద ఉద్యమాలు సమన్యాయం జరిగేందుకు దోహదపడనున్నాయి. ఆర్థిక అసమానతలను తొలగించేందుకూ సహాయపడే అవకాశం ఉంది. ప్రస్తుత మున్నార్ ఉద్యమం ఓ చిన్న నిప్పు రవ్వ అగ్గిని రాజేసినట్లుగా ఇంతింతై.. మొత్తం ప్రపంచాన్ని తాకనుంది. అసురక్షిత కార్మికులు, శ్రామిక ఒప్పందాలు, యజమానుల ద్రోహం, వంటి అనేకమైన ఆర్థిక అంశాలను విమర్శించేందుకు తావునిచ్చింది. అనేక సమస్యలు స్త్రీలు పురుషులకంటే సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించింది. ఇండియా రాజధాని ఢిల్లీలో జరిగిన అభయ అత్యాచార ఘటనలోనూ మహిళా ఉద్యమం తారాస్థాయికి చేరి, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది. అప్పట్లో జరిపిన అతి పెద్ద ఉద్యమం ఏకంగా చట్టాల్లోనే కీలకమైన మార్పును తెచ్చాయి. అనంతర పరిణామంలో ఇటీవల లైంగిక హింసలపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. లైంగిక హింస కేసులు నమోదు చేసేందుకు ధైర్యం చేస్తున్నారు. అదే రీతిన మున్నార్ ఉద్యమం.. ప్రపంచంలోనే మహిళా వివక్షను ప్రశ్నించేందుకు ఓ స్ఫూర్తిగా మారనుంది. -
'వారు నేర్చుకోవడం లేదా.. అయితే నవ్వించండి'
లండన్: మీ చిన్నారులు ఏ కొత్త విషయాలు చెప్పినా అస్సలు నేర్చుకోవడం లేదని.. అలవాటు చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? వారికి పదే పదే అదే అంశాన్ని నేర్పించేందుకు ప్రాయసపడుతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి అలా చేయడానికి బదులు వారిని ఓసారి నవ్వించే ప్రయత్నం చేయండని చెబుతున్నారు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు. అలా నవ్వించడం ద్వారా వారు ఎలాంటి విషయాలు చెప్పినా ఇట్టే నేర్చుకొని అలవాటుపడిపోతారని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పేదిశగా ఏడాదిన్నర చిన్నారులను ప్రయోగానికి తీసుకున్న శాస్త్రవేత్తలు వారికి తలా ఓ బొమ్మ చేతికి ఇచ్చారు. అందులో కొందరు పిల్లలు ఆ బొమ్మతో ఆడుకోగా మరికొందరు మాత్రం తీసుకున్న వెంటనే నేలకేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇది చూసి మరో గ్రూపులో ఆడుకుంటున్న పిల్లలు నవ్వుకుంటూ తిరిగి తమ ఆటను కొనసాగించారు. దీని ప్రకారం నవ్వడం ద్వారా పిల్లలు రెట్టింపు ప్రశాంతతను పొంది ఏ అంశాన్నైనా తమలో ఇముడ్చుకునేందుకు కావాల్సిన శక్తిని పొందగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాలి
షాంఘై: యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్‌వా అన్నారు. కోహ్లీ తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనూహ్యంగా గత డిసెంబర్లో ధోని భారత టెస్టు క్రికెట్ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని స్వీకరించిన విరాట్ ఆధ్వర్యంలో ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా మరొకటి ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన స్టీవా.. 'కోహ్లీ ఇప్పటికే పరిణతి చెందాడు. అయితే ఈ ప్రపంచ కప్‌లో కొన్ని విషయాలు అతడిని కాస్తంత డిస్ట్రబ్ చేశాయి. వ్యక్తిగతం కావొచ్చు.. మరేవైనా కావొచ్చు.. అతడు కొంత అసహనంగా, చిరాకుగా, భావోద్వేగాలు ఎక్కువగా బయటపెట్టినట్లు కనిపించాడు. నాయకత్వం విషయంలో ధోని మంచి సమర్థుడు. ఎవరు ఏమన్నా అతడు పెద్దగా పట్టించుకోడు. స్పందించడు. అలాంటి ధోని తప్పకుండా కోహ్లీకి ఒక మంచి రోల్ మోడల్ కాగలడు. అందుకే ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది' అని స్టీవా చెప్పాడు. -
మంత్రులపై ఎమ్మెల్యేల కన్నెర్ర
పట్టించుకోవడం లేదని ఆవేదన ఫోన్ చేసినా స్పందన లేదంటూ ఆక్రోశం జిల్లాల పర్యటనలు లేవని మండిపాటు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా మంత్రుల్లో మార్పు రావడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఫోన్లోనూ దొరకడం లేదు. మంత్రులే మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక అధికారులు మా మాటకు విలువ ఇస్తారా’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. విధాన సౌధలోని కాన్ఫరెన్స్ హాలులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ప్రృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రుల తీరును తూర్పారబట్టారు. కన్నడ, సాంృస్కతిక వ్యవహారాలు, ృహ నిర్మాణ, విద్యుత్, ప్రజా పనులు, వ్యవసాయ శాఖల మంత్రులు తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. వీరంతా మద్దతుదారుల మాటకు మాత్రమే విలువనిస్తున్నారని విమర్శించారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేల విన్నపాలపై స్పందించడం లేదన్నారు. జిల్లాల పర్యటనలకు కూడా రావడం లేదని ఆరోపించారు. అభిృద్ధి పనులను సమీక్షించడం లేదన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తమ పనులు ఎలా చేయించుకోవాలని నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. పాలక పార్టీలో ఉండి కూడా పనులు కావడం లేదంటే, నియోజక వర్గం ప్రజల ముందు తమ పరువేం కావాలని వాపోయారు. శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం. ఇబ్రహీంను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడుగా నియమించడంపై అసంృప్తి వ్యక్తం చేశారు. ఇంకొంత కాలం ఆగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యేలను అనునయించడానికి ప్రయత్నించారు. అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నించిన తన వైపు వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున, పార్టీలో ఐక్యత అవసరమని సూచించారు. గురువారం మంత్రులందరూ ఎమ్మెల్యేలకు రెండు గంటల పాటు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను ఆలకించి పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొని ఉంటే, ఉత్తమ ఫలితాలను సాధించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
పెద్దలు ఖరారు
మండలికి ఐదుగురి పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుత గవర్నర్ హయాంలోనే ఆమోదం పొందే యత్నం చివరి నిమిషంలో మోహన్ కొండజ్జీ, ఇవాన్ డిసౌజా పేర్ల తొలగింపు! ఆ స్థానంలో ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌లకు ఛాన్స సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేయడానికి అధికార కాంగ్రెస్ కసరత్తును పూర్తి చేసింది. వివిధ రంగాలకు చెందిన వారు ఈ నెల 20న రిటైర్ కానుండడంతో ఆ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ ఈ నెల 29న రిటైర్ కానున్నారు. యూపీఏ హయాంలో నియమితులైన ఆయన స్థానంలో కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఎటూ తమ వారినే నియమిస్తుంది. గవర్నర్‌తో సత్సంబంధాలు లేకపోతే వివిధ రంగాలకు చెందిన వారిని నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపే సిఫార్సులను ఒక పట్టాన ఆమోదించే ప్రసక్తే ఉండదు. కనుక ఈ వారంలోనే నామినేటెడ్ సభ్యుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే అధిష్టానం వీఎస్. ఉగ్రప్ప, సినీ నటి జయమాల, మోహన్ కొండజ్జీ, ఇవాన్ డిసౌజా, అబ్దుల్ జబ్బార్ పేర్లను ఖరారు చేసింది. అయితే తుది నిముషంలో వచ్చిన ఒత్తిళ్ల కారణంగా కొండజ్జీ, డిసౌజాల బదులు ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో సరడగి రెండేళ్ల కిందట శాసన సభ నుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందున ఇండిపెండెంట్ భైరతి సురేశ్ గెలుపొందారనే ఆరోపణలు వచ్చాయి. ఉగ్రప్ప గతంలో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా పని చేశారు. కాగా ఐదుగురితో కూడిన జాబితాను ముఖ్యమంత్రి ఏ క్షణంలోనైనా రాజ్ భవన్‌కు పంపే అవకాశాలున్నాయి. గవర్నర్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అంతకు ముందే లేదా తిరిగి వచ్చిన తర్వాత ఈ జాబితాపై ఆమోద ముద్ర పడే అవకాశాలున్నాయి. బీజేపీ హయాంలో నియమితులైన డాక్టర్ ఎస్ఆర్. లీలా, డాక్టర్ దొడ్డ రంగే గౌడ, ప్రొఫెసర్ ఎంఆర్. దొరస్వామి, బీబీ. శివప్పలు రిటైర్ కానున్నారు. వీరితో పాటే అబ్దుల్ జబ్బార్ కూడా రిటైర్ కావాల్సి ఉంది. అయితే నెల కిందటే ఆయనను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆయనింకా శాసన మండలి సమావేశంలో పాల్గొనలేదు. అందువల్లే ఆయనను తిరిగి నామినేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దావణగెరె జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పని చేస్తున్న జబ్బార్ అనేక విద్యా సంస్థలకు అధిపతి కావడం గమనార్హం. -
బియాస్ విషాదం నుంచి మేల్కోవాలి
సిమ్లా: ప్రకృతి సౌందర్యానికి హిమాచల్ ప్రదేశ్ మారుపేరు. కొండలు, కోనలు, వాగులు, పర్వతాలు, జలపాతాలు, ఆహ్లాదకర వాతావరణంతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. అందుకే ఈ ఉత్తరాది రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అయితే అక్కడికెళ్లే పర్యాటకుల భద్రత గాలిలో దీపం వంటిది. ఇందుకు బియాస్ దుర్ఘటనే ఉదాహరణ. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు 24 మంది నదిలో గల్లంతయ్యారు. ఈ విషాదం నుంచైనా హిమాచల్ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. పర్యాటకుల తగిన భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. హిమాచల్‌లో సట్లజ్, బియాస్, యమున, చెనాబ్, రవి నదులు, వాటి ఉపనదులు ప్రవహిస్తాయి. ఇవి ఎక్కువగా జాతీయ, రాష్ట్ర రహదారులకు సమాంతరంగా ప్రవహిస్తాయి. కొన్ని చోట్ల కొండలోయల మధ్యన నదులు ప్రవహిస్తాయి. ఇలాంటి పర్వత ప్రాంతాల్లో భయంకరమైన మలుపు మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లోకే. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు అదుపు తప్పి లోయలు, నదుల్లోకి బోల్తాపడుతుంటాయి. తాజాగా హైదరాబాద్ విద్యార్థుల విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అయినా హిమాచల్ ప్రభుత్వం మేలుకొన్నట్టు లేదు. భద్రతకు సంబంధించి పర్యాటకులను హెచ్చరించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ చాలా మార్గాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. మనాలి ప్రాంతంలోనే ప్రతి ఏటా కనీసం ఐదారుగురు చనిపోతున్నారని పోలీసు కేసులు చెబుతున్నాయి. ఇక గాయలబారిన పడటం, చిన్న చిన్న సంఘటనలు రికార్డుల్లో ఉండవు. 'పర్యాటకులు నదులు, అక్కడి వాతావరణానికి ఆకర్షితులవుతారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా నదుల్లోకి దిగుతారు. అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో క్షణాల్లు కొట్టుకుపోతారు' అని మనాలికి చెందిన టూర్ ఆపరేటర్ చెప్పారు. ఆదివారం బియాస్ నది దుర్ఘటన కూడా ఇలాంటిదే అని విశ్లేషించారు. హిమాచల్ ప్రదేశ్‌లో చాలా హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తిని బట్టి డ్యాం గేట్లను తరచూ ఎత్తేస్తుంటారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఇలాంటి ప్రమాదాల గురించి ముందే హెచ్చరించాల్సిన అవసరముందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అంతేగాక హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఉంచడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముళ్ల తీగలను ఏర్పాటు చేయాలని చెప్పారు. -
త్వరలో బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు
5న కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలోని బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మైసూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పూర్తై నేపథ్యంలో ఇక కార్పొరేషన్ బోర్డుల నియామకాలను ఆలస్యం చేయబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 5న బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో వారి వారి నియోజకవర్గాల్లోని సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఇక కన్నడ మాధ్యమ పాఠశాలల్లో ఒకే ఒక విద్యార్థి ఉన్నా కూడా అలాంటి పాఠశాలల ను మూయబోమని తెలిపారు. ఒక విద్యార్థి ఉన్నా కూడా పాఠశాలలను న డపాల్సిందేనని తమ ప్రభుత్వం భావి స్తోందని, అయితే ఈ విషయంపై మంత్రి వర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కన్నడ క్రియా సమితి కార్యకర్త మల్లేష్ రాష్ట్రంలో కన్నడ మాధ్యమ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ విషయంపై స్పందిస్తూ సిద్ధరామయ్యపై వ్యాఖ్యలు చేశారు. -
ఓడాం...ఘోరంగా కాదు
అధిష్టానానికి సీఎం సంజాయిషీ సోనియా, డిగ్గీకి వివరణ మోడీ ప్రభంజనాన్ని కొంత ఆపాం మెరుగైన ఫలితాలు సాధించాం మితిమీరిన ఆత్మ విశ్వాసమే దెబ్బతీసింది పరమేశ్వరపై సిద్ధు ఫిర్యాదు? పార్టీపై బహిరంగ విమర్శలు చేశారంటూ ఆరోపణ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవలేక పోయినా, దేశంలో ఇతర రాష్ట్రాల్లో లాగా మోడీ ప్రభంజనం లేకుండా చూడగలిగామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధిష్టానానికి విన్నవించారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరతో కలసి ఆయన ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను శనివారం కలుసుకున్నారు. సాయంత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ వాదనలను వినిపించారు. ‘2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలను సాధించాం. అప్పట్లో కేవలం ఆరు స్థానాలను మాత్రమే గెలవగలిగాం. ఈసారి మరో మూడు సీట్లు పెరిగాయి. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ సొంతంగా ఇన్ని స్థానాల్లో గెలవలేదు’ అని వారు వివరించినట్లు తెలిసింది. సీట్లు తగ్గినా ఓట్లు బాగానే వచ్చాయని, మున్ముందు పార్టీని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కొన్ని నియోజక వర్గాల్లో నాయకుల సహాయ నిరాకరణ వల్ల కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. మరి కొన్ని నియోజక వర్గాల్లో మితిమీరిన ఆత్మ విశ్వాసం దెబ్బ తీసిందన్నారు. ఇదే సమయంలో పార్టీకి గెలుపు అవకాశాలున్నా, విజయాన్ని సొంతం చేసుకోలేని నియోజక వర్గాల్లో పని చేసిన మంత్రులను బాధ్యులను చేయాల్సిందిగా అధిష్టానం సూచించినట్లు తెలిసింది. పరమేశ్వరపై ఫిర్యాదు? ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్‌ను విడిగా కలుసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి, పరమేశ్వరపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో పరమేశ్వర సరైన సహకారం అందించ లేదని, ఓ సమావేశంలో మాట్లాడుతూ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ వంచించిందని ఆరోపించారని తెలిపారు. మరో సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్‌కు టికెట్ ఇవ్వకపోవడం పట్ల కూడా బహిరంగంగానే అృసంతప్తి వ్యక్తం చేశారని ఫిర్యాదు చేశారు. దీని వల్ల కాంగ్రెస్‌కు సంప్రదాయక ఓటు బ్యాంకులైన ఈ వర్గాల నుంచి ఓట్లు బీజేపీ వైపు మళ్లాయని ఆరోపించినట్లు సమాచారం. -
కరువుపై అప్రమత్తం
అధికారులకు సీఎం సూచన యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలకు ఆదేశం నిధుల కొరత లేదని స్పష్టీకరణ ఇక సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రతి వారం సమావేశం నీటి ఎద్దడి గ్రామాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రాన్ని వరుసగా నాలుగో ఏడాది కరువు కబళించిందని, కనుక అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. తాగు నీటి సదుపాయం, కరువు సహాయక పనులకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇక్కడి క్యాంప్ కార్యాలయంృకష్ణాలో గురువారం ఆయన కరువు సహాయక పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తాగు నీరు, పశు గ్రాసం, విద్యుత్ సమస్యలపై జిల్లా పంచాయతీల సీఈఓలు ప్రతి వారం సమావేశాన్ని నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రభుత్వంృదష్టికి తీసుకు రావాలన్నారు. రాష్ట్రంలో మరో 22 వారాలకు సరిపడా పశు గ్రాసం ఉందని, భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా రైతులకు పశు గ్రాసం కిట్లను అందించి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. వరుస కరువు వల్ల తాగు నీరు, పశు గ్రాసానికి హాహాకారాలు మిన్ను ముట్టాయని తెలిపారు. కరువును సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన పనులను చేపట్టడం లేదని నిష్టూరమాడారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కరువు సహాయక పనులకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే విడుదలైందని చెప్పారు. 1085 గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ఆ గ్రామాల్లో 1,500 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. మొత్తమ్మీద రాష్ర్ట వ్యాప్తంగా 11,640 గ్రామాల్లో తాగు నీటి సమస్య ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ల వద్ద నిధులున్నాయని, అత్యవసర పనులకు వీటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో మంత్రులు శ్రీనివాస ప్రసాద్, డీకే. శివ కుమార్, హెచ్‌కే. పాటిల్, టీబీ. జయచంద్ర, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆకలి తీర్చడమే ఆనందం!
ఆకలి విలువ తెలిసినవాడికి అన్నం విలువ తెలుస్తుంది. ఆకలి, అన్నం... ఈ రెండిటి విలువ తెలిసినవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాల్సిన అవసరమేంటో తెలుస్తుంది. టోనీ టేకి అవన్నీ తెలుసు కాబట్టే రోజుకి మూడు వేల మందికి అన్నం పెడుతున్నాడు. అన్నార్తుల ఆకలి మంటలను చల్లారుస్తున్నాడు! అది 2003వ సంవత్సరం. ఓ శ్మశాన వాటికలో ఒక మహిళకు అంత్యక్రియలు జరుగు తున్నాయి. అందరూ విషణ్ణ వదనాలతో నిలబడి ఉన్నారు. మరణించిన స్త్రీ ఆత్మ శాంతించాలని అందరూ మనసుల్లోనే ప్రార్థిస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం అలాంటివేమీ చేయడం లేదు. అక్కడ ఉన్నవారందరి వైపూ తదేకంగా చూస్తున్నాడు. ఆ మరణించిన స్త్రీ కొడుకే అతను. అతడి ముఖంలో దిగులు కంటే ఆశ్చర్యం ఎక్కువగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న వ్యక్తి అది గమనించాడు. ‘‘ఏంటి అలా చూస్తున్నావ్’’ అన్నాడు. ‘‘వీళ్లెవరినీ నేనెప్పుడూ చూడలేదు. వీళ్లలో మా బంధువులు కానీ, స్నేహితులు కానీ లేరు. కానీ అమ్మ అంత్యక్రియలకు ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు. మీతో సహా’’ అన్నాడతను. ‘‘ఓ అదా... మేం మీ బంధువులం, స్నేహితులం కాదు. మీ అమ్మగారి వల్ల సహాయం పొందినవాళ్లం. మాలో చాలామంది ఆమె చేతిముద్ద తిన్నాం. ఆ కృతజ్ఞతతోనే వచ్చాం.’’ అతడి మాట వినగానే మరింత ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. తన తల్లి ఇంతమందికి సాయం చేసిందా! ఆమె ఎంతో మంచిదని తెలుసు. ఇంటికెవరొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టేది. ఏదైనా మిగిలితే పడేయకుండా లేనివాళ్లకి పంచిపెట్టి వచ్చేది. ఏదో అలా చేస్తోంది అనుకున్నాంగానీ ఆమె ఇంత మందికి సాయం చేసిందా అని విస్మయం చెందాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు... తన తల్లి మంచితనానికి తాను ప్రతినిధి కావాలని. ఆ నిర్ణయానికి ఫలితమే... విల్లింగ్ హార్ట్స. దాన్ని స్థాపించిన ఆ వ్యక్తి పేరు... టోనీ టే. ఆలోచన ఉద్యమమయ్యింది... టోనీ కుటుంబం సిరిగలదేమీ కాదు. కడుపు నింపుకోవడం కోసం కష్టపడి పని చేసుకున్నవాళ్లే. అందుకే అతడికి ఆకలి విలువ, అన్నం విలువ తెలుసు. దానికితోడు పోతూ పోతూ తల్లి నేర్పిన పాఠం అతడి ఆలోచనల్ని చాలా ప్రభావితం చేసింది. నాటి నుంచీ తనకున్నదాన్ని మరికొందరికి పంచడమే జీవితలక్ష్యంగా ఏర్పరచు కున్నాడు టోనీ. కానీ ఆ చిన్న చిన్న సాయాలు అతడికి తృప్తినివ్వలేదు. ఇంకా ఏదో చేయాలి. ఏం చేయాలా అని ఆలోచించాడు. అన్నం పెట్టడాన్ని ఓ పనిగా కాకుండా ఉద్యమంగా మలచాలని అనుకున్నాడు. ‘విల్లింగ్ హార్ట్స’ అనే సేవాసంస్థను స్థాపించాడు. ఆకలితో ఉన్నవారికి ఓ ముద్దపెట్టి కడుపు నింపుదాం రమ్మంటూ అందరినీ ఆహ్వానించాడు. మొదట ఎవ్వరూ అంతగా పట్టించు కోలేదు. కానీ టోనీ నిరుత్సాహపడలేదు. తన పని తాను చేసుకుపోయాడు. రోజూ సాయంత్రం మార్కెట్ యార్డులకు వెళ్లి, మిగిలిన కూరగాయలు తెచ్చుకునేవాడు. బేకరీలు, రెస్టారెంట్లకు వెళ్లి, మిగిలిపోయిన పిండి, నెయ్యి, డాల్డా, మాంసం ఏదైనా నాకు ఇచ్చేయండి అని అభ్యర్థించేవాడు. వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని, ఉదయమే లేచి వంట మొదలెట్టేవాడు. పూర్తవగానే వండిన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ప్యాక్ చేసుకుని బయలుదేరేవాడు. ఎక్కడ ఎవరు ఆకలితో ఉన్నారని తెలిసినా అక్కడికెళ్లి వాటిని పంచేవాడు. కొన్నాళ్లకు అతడి సేవ గురించి అంద రికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి అతడితో చేరారు. ప్రస్తుతం విల్లింగ్ హార్ట్సలో 200 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లలో రిటైరైనవాళ్లు, గృహిణులు, విద్యార్థులు... ఇలా చాలామంది ఉన్నారు. కూరగాయలు సేకరించడం దగ్గర్నుంచి పాత్రల్ని కడగడం వరకూ అందరూ అన్ని పనుల్నీ పంచుకుంటారు. అందరూ తప్పకుండా రావాలన్న నియమం ఉండదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లు వస్తారు. పనుల్లో పాలుపంచుకుంటారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే అందరికీ మెసేజిలిస్తాడు టోనీ. ఎవరికి వీలైతే వాళ్లు వచ్చి పని చేస్తారు. అది కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. అయితే ఇప్పుడు ఆహారాన్ని తీసుకెళ్లి పంచడం లేదు టోనీ. సింగపూర్ మొత్తంలో 23 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశాడు. ఆకలిగొన్న వారంతా అక్కడికొచ్చి తినవచ్చని అందరికీ తెలిసేలా చేశాడు. ఉదయాన్నే వండిన ఆహారమంతా ఈ సెంటర్లకు తీసుకెళ్లిపోతారు. ఎవరు వచ్చినా ఉచితంగా భోజనం పెట్టి పంపిస్తారు. అలా రోజుకి మూడు వేల మంది కడుపుల్ని నింపు తున్నారు. ‘‘ఆకలి తీరిన తరువాత వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. దానికోసం ఎంత కష్టపడినా ఫర్వాలేదనిపిస్తుంది’’ అంటాడు టోనీ. మంచితనానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది! - సమీర నేలపూడి విశ్రమించడు... విసుగు చెందడు! అనుకున్నది సాధించడానికి పెద్ద కసరత్తే చేశాడు టోనీ టే. రెండు వందల మంది వాలంటీర్లను ఒక్కచోట చేర్చడమంటే మాటలు కాదు కదా! అయితే అంతమంది ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్నా, అందరూ అన్నీ అయ్యి చేస్తున్నా... ఇప్పటికీ తనవంతు పని తాను చేస్తూనే ఉంటాడు టోనీ. ఉదయం నాలుగింటికి లేచి పని మొదలు పెడతాడు. స్వయంగా కొన్ని వంటకాలు వండుతాడు. అన్ని పనులూ దగ్గరుండి పర్యవేక్షించు కుంటాడు. ఎప్పుడో అర్ధరాత్రి పడక మీదికి చేరతాడు. ఎంత కష్ట పడుతున్నా పెదవుల మీద చిరునవ్వు చెరగ నివ్వక పోవడమే అతడి ప్రత్యేకత! -
కాంగ్రెస్ తొలి జాబితా
12 మంది అభ్యర్థుల ఖరారు ‘దక్షిణం’ నుంచి ‘ఆధార్’ నిలేకని తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ ఛాన్స బళ్లారి నుంచి హనుమంతప్ప, బెల్గాం నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్ పోటీ బీజేపీకి పెట్టని కోటగా ‘బెంగళూరు దక్షిణం’ అక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన అనంత్ ఐటీ ఉద్యోగుల ఓట్లే అధికం నిలేకనితో ఆ స్థానాన్ని కైవసం చేసుకునేలా కాంగ్రెస్ ఎత్తు అదే స్థానం నుంచి పోటీ చేయనున్న ఆప్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ కసరత్తును ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సంఘం (సీఈసీ) సమావేశంలో 12 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం అభ్యర్థిగా ‘ఆధార్’ చైర్మన్ నందన్ నిలేకనిని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపిక చేశారని తెలిసింది. తొమ్మిది మంది ప్రస్తుత ఎంపీలకు తిరిగి టికెట్లు లభించనున్నాయి. బళ్లారి స్థానానికి ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వై. హనుమంతప్ప పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బెల్గాం స్థానానికి లక్ష్మీ హెబ్బాల్కర్ పేరు ఖరారైంది. సీఈసీ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. కాగా బీజేపీ ఇప్పటికే 21 స్థానాలకు, జేడీఎస్ పది స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. దక్షిణపై తర్జన భర్జన ప్రతిష్టాత్మక బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజక వర్గానికి నిలేకని పేరును ఖరారు చేయడానికి ముందు కాంగ్రెస్ నాయకులు తీవ్ర తర్జన భర్జన పడినట్లు తెలిసింది. 1991 నుంచి ఆ స్థానం బీజేపీ చేతుల్లోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి పెట్టని కోట. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత్ కుమార్ వరుసగా ఐదు సార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ అనేక ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితం కనబడ లేదు. 1991, 2004 సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయింది. ఆ నియోజక వర్గంలో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, ఈసారి నిలేకని ద్వారా ప్రయోగం చేయదలచుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఆ స్థానం నుంచి బరిలో దిగుతోంది. దీంతో కాంగ్రెస్ మాటేమో కానీ, బీజేపీకే వణుకు పుడుతోంది. ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన ‘ప్రి పోల్ సర్వే’లో ఈ స్థానం ఆప్ పాలవుతుందనే అంచనాలు వచ్చాయి. మొత్తం 28 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 11, జేడీఎస్‌కు రెండు, ఆప్‌కు ఒక స్థానం దక్కవచ్చని ఆ సర్వే జోస్యం చెప్పింది. -
గ్రూపులొద్దు
ఎమ్మెల్యేలకు సీఎం హితవు రహస్య సమావేశాలపై అసంతృప్తి ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయొద్దని క్లాస్ సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని సలహా మంత్రులపై ఆరోపణలు చేయడం తగదని సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు, విందులు, వినోదాలను ఏర్పాటు చేస్తుండడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ఏవైనా సమస్యలుంటే పార్టీ వేదికపైనే చర్చించుకోవాలని సూచించారు. నియోజక వర్గాల్లో సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలని కోరారు. లేనట్లయితే కేపీసీసీ అధ్యక్షుడిని కూడా కలుసుకోవచ్చని సూచించారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. తమ పనులు జరిగి తీరాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టడం సరికాదని హితవు పలికారు. చట్టం పరిధిలో తాము పని చేయాల్సి ఉంటుందని, కనుక కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉండకపోవచ్చని వివరించారు. అలాంటి సందర్భాల్లో మంత్రులపై ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. మంగళవారం రాత్రి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో సమావేశం కావడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇకమీదట ఇలాంటి పొరపాట్లు చేయవద్దని సలహా ఇచ్చారు. మంత్రులు కూడా ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై ఆయా ఎమ్మెల్యేలతో చర్చించాలని, స్థానిక సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావాలని ఆదేశించారు. పేదలకు త్వరలో ఇళ్లు వివిధ పథకాల కింద ఇళ్ల పంపిణీకి సంబంధించి లోటు పాట్లను నివారించి, అర్హులైన పేదలకు సత్వరమే వాటిని ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ పథకాలకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఎమ్మెల్యేలకు ఫిబ్రవరిలో కూడా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఇళ్ల పంపిణీని చేపడతామన్నారు. సమావేశం తర్వాత సీఎల్పీ కార్యదర్శి సీఎస్. అప్పాజీ నాడగౌడ విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రయ, బసవ వసతి సహా వివిధ పథకాల కింద మూడు లక్షల ఇళ్ల పంపిణీ నిలిచిపోవడంపై ఎమ్మెల్యేలు సమావేశంలో ప్రస్తావించారని తెలిపారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తానని సీఎం భరోసా ఇచ్చారని చెప్పారు. -
హంపి ఉత్సవం జనోత్సవం
ప్రారంభ సభలో సీఎం సిద్ధరామయ్య నేతలు, అధికారుల ఉత్సవం కారాదు హంపి పేరు వింటేనే మనస్సు పులకరిస్తుంది ఈ ఉత్సవాలు మన సంస్కృతి, వారసత్వాలకు నిలువుటద్దం వీటిని నిర్వహించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది చరిత్ర పుటల్లో హంపికి చిరస్థానం సాక్షి, బళ్లారి : హంపి పేరు వింటేనే ప్రతి ఒక్కరి మనస్సు, శరీరం పులకించి పోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హంపి ఉత్సవం రాజకీయ నేతలు, అధికారులు ఉత్సవం కాకూడదని, ప్రజలందరి ఉత్సవమని గుర్తు చేశారు. మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి హంపిలోని శ్రీకృష్ణదేవరాయ వేదిక భువనేశ్వరి మాత విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం హంపి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. రెండు సంవత్సరాల నుంచి కరువు ప్రభావం వల్ల హంపి ఉత్సవాలను వాయిదా వేస్తూ వచ్చారని, ఈ ఏడాది కూడా రాష్ట్రంలో కరువు ఛాయలు ఉన్నప్పటికీ మన సంృ్కతిని, కళలను కాపాడాలనే ఉద్దేశంతో ఉత్సవాలను వాయిదా వేయకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం హంపి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు రాజధానిగా చేసుకుని పరిపాలించిన హంపి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి పోయిందని గుర్తు చేశారు. భూమండలంలోనే విజయనగర సామ్రాజ్యం కంటే గొప్పది ఎక్కడా లేదని పర్షియా దేశ రాయబారి అబ్దుల్ రజాక్ పొగడ్తలతో ముంచెత్తారంటే హంపి విజయనగర సామ్రాజ్య గత వైభవం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత వైభవం గుర్తు ఉండేలా ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విజయనగర సామ్రాజ్యం సువర్ణ యుగంగా పేరు పొందిందంటే అప్పట్లో బంగారు వజ్ర వైఢూర్యాలు రాసులు పోసుకుని అమ్ముకునేవారని గుర్తు చేశారు. హంపిలోని ప్రతి రాయిని పిలిస్తే పలికే మాదిరిగా శిల్పులు అతి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ప్రజల స్థితిగతులు, జీవన విధానాలు, పరిపాలన, శిలా శాసనాల ద్వారా అవగతమవుతుందన్నారు. దేశ, విదేశాల నుంచి కళాకారులకు కూడా అవకాశం కల్పించామని గుర్తు చేశారు. దసరా ఉత్సవాల తరహా మాదిరిగా హంపి ఉత్సవాలను ఎందుకు నిర్వహించ కూడదని అప్పట్లో తన సహచరుడు ఎంపీ ప్రకాష్ గుర్తు చేయడంతో హంపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు అయిందన్నారు. కార్యక్రమంలో హంపి విద్యారణ్య స్వామీజీ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పరమేశ్వర్ నాయక్, పర్యాటక శాఖ మంత్రి దేశ్‌పాండే, రాష్ట్ర కన్నడ సంృ్కతి శాఖ మంత్రి ఉమాశ్రీ, ఎమ్మెల్యేలు అనిల్‌లాడ్, భీమానాయక్, నాగరాజు, తుకారాం, ఎమ్మెల్సీ రాఘవేంద్ర హిట్నాల్, వృుత్యుంజయ జినగా, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, జిందాల్ ఎండీ వినోద్ నావెల్, శోభా బెండిగెరె, ఉపాధ్యక్షురాలు మమత సురేష్ తదితరులు పాల్గొన్నారు.