కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురించి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన మహిళా కేంద్రీకృత సదరస్సులో మాట్లాడుతూ..తన తల్లి భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడిందని అన్నారు. ఆమెకు రాజకీయాలంటే ఇష్టం ఉండవంటూ చెప్పుకొచ్చారు. తాను ఇద్దరు ధైర్యవంతులైన, బలమైన మహిళల వద్ద పెరిగానని చెప్పారు.
తన నానమ్మ ఇందిరా గాంధీ 33 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్నప్పుడూ తన వయసు ఎనిమిదేళ్లని ఆమె గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ పోయిన మరుసటి రోజే తన విధులను నిర్వర్తించేందుకు వెళ్లిపోయారని చెప్పారు. ఆమె చనిపోయే వరకు కూడా తన కర్తవ్యం పట్ల ఆమె అంతర్గత శక్తి అలానే ఉందని, చనిపోయేంత వరకు దేశ సేవ చేస్తూనే ఉన్నారని చెప్పారు. అంతేగాదు తన తల్లి సోనియా 21 ఏళ్ల వయసులో రాజీవ్‌గాంధీతో ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుని ఇటలీ నుంచి భారత్‌కు వచ్చారని అన్నారు.
ఇక్కడకు వచ్చాక భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడిందని, ఆ తర్వాత తన నానమ్మమ ఇందిరా గాంధీ నుంచి ప్రతీది నేర్చుకున్నారని చెప్పారు. ఆమె సరిగ్గా 44 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిందని, రాజకీయాలంటే ఇష్టం లేకున్నప్పటకీ వచ్చి దేశ సేవ చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుని జీవితమంతా సేవ చేసిందని అన్నారు. అంతేగాదు తన తల్లి తన నానమ్మ నుంచి నేర్చుకున్న ముఖ్య విషయం గురించి చెబుతూ.."మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా లేదా ఎంత పెద్ద విషాదం లేదా సమస్యలో ఉన్నా అది ఇంట్లో లేదా పనిలోనైనా సరే నిలబడి సమర్ధవంతంగా ఎదుర్కొని మీ కోసం మీరు పోరాడగలగలిగే సామర్థ్యం కలిగి ఉండటం" అని చెప్పారు.
(చదవండి: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్‌గా మేనిఫెస్టో!)
Comments
Please login to add a commentAdd a comment