Indian traditions
-
పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు..
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతుల కలబోతగా ప్రతిబింబిస్తోంది. విదేశీ అతిథులు తమ సంప్రదాయాలను వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్‌ను ఇష్టపడుతుంటారు. మన వంటకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ జీవనశైలిని పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో సంప్రదాయాలను అనుసరిస్తారు. సుమారు 150 దేశాల నుంచి యాత్రికులు పుట్టపర్తి వస్తుంటారు. విదేశీ సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు మన సంప్రదాయాలను అనుసరిస్తారు. భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇదో గర్వకారణమని పుట్టపర్తివాసులు చెబుతున్నారు. సాయిబాబా చలువ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విదేశీయులు మెచ్చే విధంగా పుట్టపర్తిలో వసతి అందుబాటులో ఉంది. హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సంగీత పరికరాల అంగళ్లు ఉన్నాయి. విదేశీయులు మెచ్చే విధంగా హోటళ్లలో అలంకరణ కనిపిస్తుంది. సుమారు 10 లాడ్జిలు, 30 హోటళ్లు విదేశీయులకు నచ్చేశైలిలో అందుబాటులో ఉన్నాయి. భారత దేశానికి వచ్చినా.. ఇక్కడి దర్శనీయ స్థలాలను చూసినా వదిలి వెళ్లలేమని విదేశీ అతిథులు అంటున్నారు. ఇక్కడ పాటించే ఆచార వ్యవహారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతున్నారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
అమ్మ వాటిని నేర్చుకోవడానికి చాలా కష్టపడింది! :ప్రియాంక
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురించి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన మహిళా కేంద్రీకృత సదరస్సులో మాట్లాడుతూ..తన తల్లి భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడిందని అన్నారు. ఆమెకు రాజకీయాలంటే ఇష్టం ఉండవంటూ చెప్పుకొచ్చారు. తాను ఇద్దరు ధైర్యవంతులైన, బలమైన మహిళల వద్ద పెరిగానని చెప్పారు. తన నానమ్మ ఇందిరా గాంధీ 33 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్నప్పుడూ తన వయసు ఎనిమిదేళ్లని ఆమె గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ పోయిన మరుసటి రోజే తన విధులను నిర్వర్తించేందుకు వెళ్లిపోయారని చెప్పారు. ఆమె చనిపోయే వరకు కూడా తన కర్తవ్యం పట్ల ఆమె అంతర్గత శక్తి అలానే ఉందని, చనిపోయేంత వరకు దేశ సేవ చేస్తూనే ఉన్నారని చెప్పారు. అంతేగాదు తన తల్లి సోనియా 21 ఏళ్ల వయసులో రాజీవ్‌గాంధీతో ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుని ఇటలీ నుంచి భారత్‌కు వచ్చారని అన్నారు. ఇక్కడకు వచ్చాక భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడిందని, ఆ తర్వాత తన నానమ్మమ ఇందిరా గాంధీ నుంచి ప్రతీది నేర్చుకున్నారని చెప్పారు. ఆమె సరిగ్గా 44 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిందని, రాజకీయాలంటే ఇష్టం లేకున్నప్పటకీ వచ్చి దేశ సేవ చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుని జీవితమంతా సేవ చేసిందని అన్నారు. అంతేగాదు తన తల్లి తన నానమ్మ నుంచి నేర్చుకున్న ముఖ్య విషయం గురించి చెబుతూ.."మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా లేదా ఎంత పెద్ద విషాదం లేదా సమస్యలో ఉన్నా అది ఇంట్లో లేదా పనిలోనైనా సరే నిలబడి సమర్ధవంతంగా ఎదుర్కొని మీ కోసం మీరు పోరాడగలగలిగే సామర్థ్యం కలిగి ఉండటం" అని చెప్పారు. (చదవండి: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్‌గా మేనిఫెస్టో!) -
సరయు : డాన్స్, ఫైట్స్, ఆర్ట్స్
ఆ బాలిక కుంచె పట్టుకుంటే ‘చిత్రమై’న అనుభూతినిచ్చే సూర్యోదయం ఆవిష్కృతమవుతుంది. గజ్జె కట్టుకుంటే సంప్రదాయం ఘల్లు మంటుంది. యాహూ అని కేక పెట్టిందంటే ఈవ్ టీజర్లకు వణుకుపుడుతుంది. జన్మతః అమెరికా వాసి అయినా సనాతన భారతీయ కళలపై తరగని ఇష్టంతో పాటు నవతరం అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, మార్షల్ ఆర్ట్స్... ఇలా సకల కళల్లోనూ రాణిస్తోంది సరయు. అంతేకాదు... ఎంతగా కళలపై ఆసక్తి పెంచుకుంటే అంతగా ఇటు చదువులోనూ మంచి ఫలితాలు వస్తాయంటోంది. ‘‘ఆధ్యాత్మిక భావాలు, చారిత్రక మూలాలు తెలిపే నాట్యం ఓ వైపు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. మరోవైపు చదువులోనూ రాణించేందుకు ఉపకరించింది’’అని చెప్పింది సరయు (15). సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు విజయ్, గీతల ఇద్దరు సంతానంలో ఒకరైన సరయు... అమెరికాలో ఉంటున్న భారతీయ చిన్నారుల సంప్రదాయ అభిరుచులకు నిదర్శనం కరాటే కిక్ కొట్టినా.. కాళ్లకు గజ్జకట్టినా... ‘‘ఎంత నాట్యం నేర్చుకోవాలనుకున్నా కాలిఫోర్నియాలో శిక్షకుకులు దొరకడం కష్టంగా మారింది. అయినా పట్టు వదలకుండా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నలు ఎలాగోలా నాట్య గురువును పట్టుకున్నారు’’ అంటూ చెప్పింది సరయు. పద్యాలకు అర్ధమే తెలియని ఐదేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె నాట్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో బృంద ప్రదర్శనల్లో పాల్గొన్న ఆమె... ఈనెల 20న బెంగుళూర్లో సోలో ప్రదర్శన ద్వారా ఆరంగేట్రం చేయాలనుకుంటోంది. మరోవైపు కరాటేలో కూడా సరయు ప్రతిభ చాటుతోంది. సెకండ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్‌ను స్వంతం చేసుకుంది. నాట్యం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కైతే.. మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్‌కి అంటుందీ బాలిక. తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు స్పానిష్ భాష కూడా ప్రావీణ్యం సంపాదించింది. చిత్రకళలోనూ రాణిస్తూ అనేక బహుమతులు అందుకుంటోంది. తాను గీసిన చిత్రాలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం విశేషం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశమున్న సరయు... ఇదంతా కూడా చదువే అంటుంది. డెర్మటాలజిస్ట్ కావాలని..! ఒత్తిడితో కూడిన సంక్లిష్టమైన ఇంటర్నేషనల్ బ్యాక్కల్యూరేట్ (ఐబి) కరిక్యులమ్కీ, తన సకల కళాభ్యాసానికి మధ్య ఆమె విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంది. గత మే నెలలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన గ్రేడ్ టెన్ ఐబి పూర్తి చేసుకుంది. డెర్మటాలజిస్ట్ కావాలనేది ఆమె లక్ష్యం. తనను తాను మాత్రమే కాకుండా తన సంస్కృతీ సంప్రదాయాలను కూడా ఇతరులకు తెలియజెప్పడంలో నాట్యం ఒక ప్రధాన మార్గం అంటుంది. – ఎస్.సత్యబాబు -
ఒబామాయనమః
అమెరికా అధ్యక్షుడు ఒబామా బరాక్ భారత సందర్శనను మూడు ముక్కల్లో చెప్పాలంటే అతడొచ్చాడు, చూశాడు, గెలిచాడు కాదు.. హృదయాలను కొల్లగొట్టాడు అని చెప్పవచ్చు. ఇటీవలి భారతీయ చరిత్రలో జాతి హృదయంలో ఇంత ప్రభావం చూపిన విదేశీ పాలకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన సందర్శనతో విదేశీ పెట్టుబడులకు మరింతగా తలుపులు తెరుచుకున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తున్న ప్పటికీ భారత్‌కు ప్రపంచ యవనికపై ఉన్న ప్రాధాన్యతను అద్వితీయ రీతిలో గుర్తించాడని చెప్పాలి. భారతీయ సంప్రదాయాలకు గౌరవమి చ్చి, ఒక జాతిగా మీకు తిరుగులేదని ప్రకటించిన ఒబామా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. చివరి రోజు ఎంపిక చేసిన సభికుల ముందు ప్రసంగించిన ఒబామా జాతి ఆత్మను స్పృశించారు. మత స్వేచ్ఛ, సామరస్య విషయంలో మన బలాన్ని, బలహీనతను కూడా ఏకకాలంలోనే గుర్తించి హెచ్చరించిన ఒబామాకు కృతజ్ఞతలు. - మోహన ఎస్వీయూ, తిరుపతి