ఒబామాయనమః
అమెరికా అధ్యక్షుడు ఒబామా బరాక్ భారత సందర్శనను మూడు ముక్కల్లో చెప్పాలంటే అతడొచ్చాడు, చూశాడు, గెలిచాడు కాదు.. హృదయాలను కొల్లగొట్టాడు అని చెప్పవచ్చు. ఇటీవలి భారతీయ చరిత్రలో జాతి హృదయంలో ఇంత ప్రభావం చూపిన విదేశీ పాలకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన సందర్శనతో విదేశీ పెట్టుబడులకు మరింతగా తలుపులు తెరుచుకున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తున్న ప్పటికీ భారత్‌కు ప్రపంచ యవనికపై ఉన్న ప్రాధాన్యతను అద్వితీయ రీతిలో గుర్తించాడని చెప్పాలి.
భారతీయ సంప్రదాయాలకు గౌరవమి చ్చి, ఒక జాతిగా మీకు తిరుగులేదని ప్రకటించిన ఒబామా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. చివరి రోజు ఎంపిక చేసిన సభికుల ముందు ప్రసంగించిన ఒబామా జాతి ఆత్మను స్పృశించారు. మత స్వేచ్ఛ, సామరస్య విషయంలో మన బలాన్ని, బలహీనతను కూడా ఏకకాలంలోనే గుర్తించి హెచ్చరించిన ఒబామాకు కృతజ్ఞతలు.
- మోహన ఎస్వీయూ, తిరుపతి