
తెలుగు సంప్రదాయ దుస్తుల్లో విదేశీ మహిళలు
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతుల కలబోతగా ప్రతిబింబిస్తోంది. విదేశీ అతిథులు తమ సంప్రదాయాలను వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్‌ను ఇష్టపడుతుంటారు. మన వంటకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ జీవనశైలిని పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో సంప్రదాయాలను అనుసరిస్తారు. సుమారు 150 దేశాల నుంచి యాత్రికులు పుట్టపర్తి వస్తుంటారు.
విదేశీ సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు మన సంప్రదాయాలను అనుసరిస్తారు. భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇదో గర్వకారణమని పుట్టపర్తివాసులు చెబుతున్నారు. సాయిబాబా చలువ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విదేశీయులు మెచ్చే విధంగా పుట్టపర్తిలో వసతి అందుబాటులో ఉంది.
హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సంగీత పరికరాల అంగళ్లు ఉన్నాయి. విదేశీయులు మెచ్చే విధంగా హోటళ్లలో అలంకరణ కనిపిస్తుంది. సుమారు 10 లాడ్జిలు, 30 హోటళ్లు విదేశీయులకు నచ్చేశైలిలో అందుబాటులో ఉన్నాయి. భారత దేశానికి వచ్చినా.. ఇక్కడి దర్శనీయ స్థలాలను చూసినా వదిలి వెళ్లలేమని విదేశీ అతిథులు అంటున్నారు. ఇక్కడ పాటించే ఆచార వ్యవహారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతున్నారు.
చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
Comments
Please login to add a commentAdd a comment