త్వరలో బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు | The boards, corporations appointments | Sakshi
Sakshi News home page

త్వరలో బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు

Published Mon, Jun 2 2014 1:52 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

The boards, corporations appointments

  • 5న కాంగ్రెస్ పార్టీ  శాసనసభా పక్ష సమావేశం
  •  ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య వెల్లడి
  •  సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలోని బోర్డులు, కార్పొరేషన్‌ల నియామకాలను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మైసూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పూర్తై  నేపథ్యంలో ఇక కార్పొరేషన్ బోర్డుల నియామకాలను ఆలస్యం చేయబోమని స్పష్టం చేశారు.

    ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 5న బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో వారి వారి నియోజకవర్గాల్లోని సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఇక కన్నడ మాధ్యమ పాఠశాలల్లో ఒకే ఒక విద్యార్థి ఉన్నా కూడా అలాంటి పాఠశాలల ను మూయబోమని తెలిపారు.

    ఒక విద్యార్థి ఉన్నా కూడా పాఠశాలలను న డపాల్సిందేనని తమ ప్రభుత్వం భావి స్తోందని, అయితే ఈ విషయంపై మంత్రి వర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కన్నడ క్రియా సమితి కార్యకర్త మల్లేష్ రాష్ట్రంలో కన్నడ మాధ్యమ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ విషయంపై స్పందిస్తూ సిద్ధరామయ్యపై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement