PAK PM Shehbaz Sharif Said Learn Lessons After 3 Wars with India - Sakshi
Sakshi News home page

యుద్ధం తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు

Published Tue, Jan 17 2023 8:42 PM | Last Updated on Tue, Jan 17 2023 9:32 PM

Pak PM Shehbaz Sharif Said Learn Lessons After 3 Wars With India - Sakshi

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ భారత్‌తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తాము తమ పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు. కాశ్మీర్‌ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దుబాయ్‌కి చెందిన అల్‌ అరేబియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్‌ ప్రధాని షరీఫ్‌​ మాట్లాడుతూ.."భారత ప్రధాని మోదీకి నా సందేశం ఏంటంటే?.. మన మధ్య చిచ్చు రేపుతున్న బర్నింగ్‌ పాయింట్‌లను పరిష్కరించడానికి టేబుల్‌పై కూర్చోని చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవిద్దాం. పరస్పరం కలిహించుకోవడంతో సమయం, వనరులు వృధా చేస్తున్నాం" అని అన్నారు.

తాము భారత్‌లో చేసిన మూడు యుద్ధాల కారణంగా పాక్‌ ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వారంతా తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదీగాక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్‌ తమకు సాయం చేయమంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజలు ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా గోధుమపిండి కోసం ఘోరంగా ఆర్రుల చాజుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజలు తెహ్రీక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొంటోన్నారు. గతేడాది చివర్లోనే దేశ భద్రతా దళాలతో కాల్పులు విరమించింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్‌ ప్రధాని షెహబాజ్‌ పోరుగు దేశంతో ముక్కుసూటిగా నిజాయితీగా వ్యహిరిస్తాం అని పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యులు,  ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారని, ఆ వనరులను ఉపయోగించుకుని శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మందుగుండు సామాగ్రి కోసం వనరులను దుర్వినియోగం చేయాలనుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలో కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ..పాకిస్తాన్‌ శాంతిని కోరుకుంటుందని, కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. ఈ మేరకు తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న పాక్‌ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ నేరుగా సంకేతాలిస్తోంది. 

(చదవండి:  వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement