అలనాటి హీరో కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు వందల సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాంతారావు దిగ్గజ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. తమకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కాంతారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన కుమారులు ఈ సందర్భంగా తమ దీనస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ సినిమాలు తీశారు. దీనివల్ల మేం ఆర్థికంగా చాలా నష్టపోయాం. నాన్న క్యాన్సర్ బారినపడినప్పుడు కూడా చికిత్స కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం.
ఒకప్పుడు మద్రాసులో బంగ్లాలో ఉన్న మేము ఇప్పుడు సిటీకి దూరంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. పరిశ్రమ నుంచి మాకెలాంటి సాయం అందలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి మాకు ఓ ఇల్లు కేటాయించి సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment